శ్రీ శివ మహా పురాణము - 588 / Sri Siva Maha Purana - 588


🌹 . శ్రీ శివ మహా పురాణము - 588 / Sri Siva Maha Purana - 588 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴

🌻. కార్తికేయుని లీలలు - 1 🌻


నారదుడిట్లు పలికెను-

ఓ దేవదేవా! ప్రజాపతీ! బ్రహ్మా! సృష్టిని చేయు ప్రభూ! తరువాత ఏమాయెను? దయయుంచి అచటి విశేషములను ఇపుడు చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమార ! ఆ సమయములో ప్రతాపశాలియగు విశ్వామిత్రుడు విధిచోదితుడై అనుకోకుండగా అచటకు ఆనందముతో విచ్చేసెను (2). తేజశ్శాలియగు శివపుత్రుని అలౌకిక ప్రకాశమును గాంచి ఆయన ఆనందముతో నిండిన హృదయము గలవాడై ప్రసన్న చిత్తముతో నమస్కరించెను (3). ఆ బాలుని ప్రభావము నెరింగిన విశ్వామిత్రుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై విధిచోదితములగు వాక్కులతో ఆ బాలకుని స్తుతించెను (4).

అపుడా బాలకుడు అచట మిక్కిలి ప్రన్నుడై అనేక లీలలను ప్రదర్శించెను. ఏమి అశ్చర్యము! అద్భుతము. ఆ శివసుతుడు బిగ్గరగా నవ్వి విశ్వమిత్రునితో నిట్లనెను (5).

శివసుతుడు ఇట్లు పలికెను -

ఓ మహాజ్ఞానీ! నీవు శివుని ఇచ్చచే ఇచటకు అకస్మాత్తుగా విచ్చేసితివి. తండ్రీ! నాకు వేదవిహితమగు సంస్కారమును యథావిధిగా చేయుము (6) ఈ నాటి నుండియూ నీవు నాకు పురోహితుడవై ఆనందమును కలిగించుము. నీవు అందరికీ పూజ్యుడవు కాగలవు. ఈ విషయములో సందేహము లేదు (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ బాలకుని మాటలను విని మిక్కిలి అశ్చర్యమును, ప్రసన్నతను పొందిన గాధికుమారుడగు విశ్వామిత్రుడు మెల్లగా ఆ బాలకునితో నిట్లనెను (8).

విశ్వామిత్రుడిట్లు పలికెను -

కుమారా ! వినుము. నేను విప్రుడని కాను క్షత్రియుని కుమారుడను. నేను విశ్వామిత్రుడని ప్రసిద్ధిగాంచిన క్షత్రియుడను. విప్రులను సేవించువాడను (9) . ఓ శ్రేష్ఠ బాలకా! నేను నీకు నా చరిత్ర నంతనూ చెప్పియుంటిని. నీవెవరివి? నాకాశ్చర్యము కలుగుచున్నది. నాకు నీ చరిత్రను పూర్తిగా చెప్పుము (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 588 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴

🌻 The boyhood sports of Kārttikeya - 1 🌻



Nārada said:—

1. O lord of subjects, O Brahmin, O creator, what happened thereafter? Please tell me the same.


Brahmā said:—

2. O dear, then the powerful sage Viśvāmitra, urged by Brahmā, came there casually and was delighted.

3. On seeing the unearthly splendour of that brilliant boy, he became very delighted. He bowed to the boy.

4. With a delighted mind he eulogised him with the words prompted by Brahmā. Viśvāmitra realised his power.

5. The boy too was delighted and became the source of great enjoyment. Laughingly he spoke to Viśvāmitra. It was very surprising.


Śiva’s son said:—

6. “O great one of perfect wisdom, it is due to the will of Śiva that you have come here by chance. O dear, perform my purificatory rites in accordance with Vedic injunctions.

7. From now onwards you remain my priest conferring your love on me. It is certain that you will become the object of worship of all.”


Brahmā said:—

8. On hearing his words, Gādhi’s son[1] (Viśvāmitra) was highly delighted and surprised. He spoke to him in a tone, by no means highly accented.


Viśvāmitra said:—

9. Listen, O dear, I am not a brahmin. I am a Kṣatriya, son of Gādhi, famous as Viśvāmitra and a servant of brahmins.

10. O excellent boy, I have thus narrated my life to you. Who are you? Now mention everything about your life to me who am surprised.


Continues....

🌹🌹🌹🌹🌹


02 Jul 2022

No comments:

Post a Comment