🌹 15 - AUGUST - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, సోమవారం, ఆగస్టు 2022 ఇందు వాసరే Monday 🌹
🇮🇳. 75వ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, Happy 75th Independence Day All of U 🇮🇳*
🌹 Happy Sri Aurobindo Jayanti to all. 🌹
2) 🌹 కపిల గీత - 55 / Kapila Gita - 55 🌹 సృష్టి తత్వము - 11
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 94 / Agni Maha Purana - 934🌹
4) 🌹. శివ మహా పురాణము - 610 / Siva Maha Purana -610 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 229 / Osho Daily Meditations - 229 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 398 / Sri Lalitha Chaitanya Vijnanam - 398 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 15, August ఆగస్టు 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
🇮🇳. 75వ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, Happy 75th Independence Day All of U 🇮🇳
🇮🇳. ప్రసాద్ భరద్వాజ
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, స్వాతంత్య దినోత్సవం Sankashti Chaturthi, Independence Day🌻*
*🍀. రుద్రనమక స్తోత్రం - 37 🍀*
*71. హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!*
*ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!*
*72. మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!*
*తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : భగవత్సేవకులు చేసే పనులలో రెండు పనులు ముఖ్యంగా భగవానునికి అత్యంత ప్రీతికరములై వుంటాయి. ఒకటి నిరాడంబరమైన భక్తి భావంతో ఆయన ఆలయ ప్రదేశాలను శుభ్ర పరచడం. రెండు మానవజాతికి దివ్యత్వసిద్ధి కలుగ గలందులకై ప్రపంచ రణక్షోణిపై నిలిచి పోరాడడం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ చవితి 21:03:39 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 21:08:36
వరకు తదుపరి రేవతి
యోగం: ధృతి 23:23:35 వరకు
తదుపరి శూల
కరణం: బవ 09:46:56 వరకు
వర్జ్యం: 07:12:24 - 08:45:08
దుర్ముహూర్తం: 12:45:55 - 13:36:47
మరియు 15:18:31 - 16:09:24
రాహు కాలం: 07:34:19 - 09:09:42
గుళిక కాలం: 13:55:51 - 15:31:15
యమ గండం: 10:45:06 - 12:20:29
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:45
అమృత కాలం: 16:28:48 - 18:01:32
సూర్యోదయం: 05:58:56
సూర్యాస్తమయం: 18:42:01
చంద్రోదయం: 21:23:30
చంద్రాస్తమయం: 08:59:13
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: మీనం
గద యోగం - కార్య హాని , చెడు 21:08:36
వరకు తదుపరి మతంగ యోగం - అశ్వ లాభం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🇮🇳. 75వ స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులందరికీ, Happy 75th Independence Day All of U 🇮🇳*
*🌹Happy Sri Aurobindo Jayanti to all. 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 55 / Kapila Gita - 55🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*2వ అధ్యాయము*
*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 11 🌴*
*11. పంచభిః పంచభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా|*
*ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః॥*
*జననీ! అయిదు, అయిదు, నాలుగు, పది వెరసి ఇరువది నాలుగు అనగా - పంచమహాభూతములు, పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయము, దశేంద్రియములు, అను ఇరువది నాలుగు తత్త్వములను ప్రకృతి కార్యములుగా తత్త్వవేత్తలు పేర్కొందురు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 55 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 11 🌴*
*11. pañcabhiḥ pañcabhir brahma caturbhir daśabhis tathā*
*etac catur-viṁśatikaṁ gaṇaṁ prādhānikaṁ viduḥ*
*The aggregate elements, namely the five gross elements, the five subtle elements, the four internal senses, the five senses for gathering knowledge and the five outward organs of action, are known as the pradhāna.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 94 / Agni Maha Purana - 94 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 31*
*🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 1 🌻*
అగ్నిదేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పచున్నాను. దీనికి ''మార్జనము'' లేదా ''అపామార్జనము'' అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును.
సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును, అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. కల్మషరహితుడును, పరమశుద్ధుడును, నిత్యధ్యానయోగనిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి రక్షావిషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక.
భగవంతుడైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రక్షావిషయమున చెప్పెదను. నా వాక్యము సిద్ధించుగాక. భగవతంతుడైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రక్షా విషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.
ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీకేశా! నా నమస్త అశుభములను హరింపుము. ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! ఆకుంఠితశక్తి గల నీ చక్రావ్యాయుధములు నాలిగింటిచే సమస్తదుష్టుల సంహారము చేయుము. ఓ ప్రభూ! ఫలానావాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశలక్షేమము ను ప్రసాదించుము. పాపములవలన కలుగు మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 94 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 31*
*🌻 Mode of cleansing and Protection oneself and others - 1 🌻*
Agni said:
1. I will now describe (the rite) known as the cleansing for the protection of one’s self and others, by which a man would become freed of miseries and get happiness.
2-3. Oṃ, salutations to the greatest object, the soul, the great soul, the formless and many-formed, the all-pervading, supreme soul, blemishless, pure and (person) engaged in meditative contemplation. Having saluted I shall expound. May my words prove true.
4. (Salutations) to the Boar, Man-lion and Dwarf (forms of Viṣṇu), the great sage. Having saluted I shall expound. May my words prove true.
5. (Salutations) to Trivikrama (a form of Viṣṇu, as he measured the three steps and removed the pride of the demon Bali), Rāma, Vaikuṇṭha (abode ofViṣṇu), the (Supreme) man. Having saluted I shall expound. May my words become true.
6. O Boar, Lord as Man-lion, Lord as Dwarf, Trivikrama, Hayagrīveśa (Lord as Horse-necked), Lord of all beings, Hṛṣīkeśa (Viṣṇu) (the Lord of all senses) destroy my impurity.
7. With these four most excellent weapons, the ever victorious disc and others of unbroken power, you become destroyer of all wicked things.
8. You remove the calamity of such a person and do (him) all good and also (remove) the fear of distress due to fetters of death which is the fruit of sins.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 609 / Sri Siva Maha Purana - 609 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 07 🌴*
*🌻. యుద్ధారంభము - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు మొదలగు ఆ దేవతలు ప్రభుని ఆ చరితమును గాంచి మిక్కిలి సంతసిల్లిరి. వారి మనస్సులో విశ్వాసము నెలకొనెను (1). శివుని తేజస్సుచే ప్రేరితులైన ఆ దేవతలు కుమారుని ముందిడు కొని గెంతుతూ సింహనాదమును చేయుచూ తారకుని సంహరించుటకు బయలు దేరిరి (2).
దేవతల యుద్ధసన్నాహమును గురించి విన్న మహాబలశాలియగు తారకుడు కూడా వెంటనే పెద్ద స్తెన్యముతో దేవతలు ఉన్నచోటికి బయలు దేరెను (3). తారకుని మహాసైన్యము వచ్చు చుండగా చూచి దేవతలు బలముగా అనేకపర్యాయములు సింహనాదమును చేసిరి. ఆ స్తెన్యమును చూచి వారి ఆశ్చర్యమును పొందిరి (4). అపుడు శంకరునిచే ప్రేరేపింపబడిన ఆకాశవాణి వెంటనే విష్ణువు మొదలగు దేవతలనందరినీ ఉద్దేశించి ఆకసమునుండి ఇట్లు పలికెను (5).
ఆకాశవాణి ఇట్లు పలికెను -
ఓ దేవతలారా! మీరు కుమారుని ఎదుట నిడుకొని యుద్ధమునకు సన్నద్ధులై రాక్షసులను జయించి విజయమును పొందుడు (6).
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడా ఆకాశవాణిని విని దేవతలందరు భయమును వీడి ఉత్సాహముతో పరాక్రమ సూచకములగు మాటలను పలికిరి (7). భయమును పొంది యున్న ఆ దేవతలందురు కుమారుని ముందిడుకొని యుద్ధమును చేయగోరి భూమి, సముద్రముల సంగమస్థానమునకు చేరిరి (8). ఆ తారకుడు గొప్ప స్తెన్యముతో గూడి దేవతలు ఉన్న స్థలమునకు శీఘ్రముగా వచ్చెను. ఆ స్థలమంతయూ దేవతలతో నిండియుండెను (9). ఆ స్తెన్యము రాగానే ప్రళయకాలమునందలి మేఘములవలె ధ్వని చేయు యుద్ధదుందుభులు, కర్ణ కఠోరమగు ఇతరవాద్యములు మ్రోగజొచ్చెను (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 609🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 07 🌴*
*🌻 Commencement of the War - 1 🌻*
Brahmā said:—
1. On seeing that miraculous feat of Kumāra, Viṣṇu and other gods became delighted. They were convinced of his prowess.
2. Keeping Kumāra at the head, shouting and roaring, purified by Śiva’s splendour they started to attack Tāraka.
3. When he heard about the preparation of the gods, the powerful Tāraka rushed to fight back the gods with a great army.
4. On seeing the great army of Tāraka approaching, the gods were surprised but roared like lions.
5. Then a celestial voice, prompted by Śiva addressed Viṣṇu and all other gods.
The celestial Voice said;—
6. O gods, keeping Kumāra at the head you have entered the lists. Defeating the Asuras in the battle, you will be victorious.
Brahmā said:—
7. On hearing the celestial voice, the gods became enthusiastic. Fearlessly they roared like heroes.
8. With their fear subsided, and keeping Kumāra ahead, the gods went to the confluence of the river Mahī and the ocean[1] desirous of fighting.
9. Immediately Tāraka, along with a great army, came to the place where the gods stood and was surrounded by them in a body.
10. Battle drums were sounded as loud as the rumbling sound of the clouds at the dissolution of the world. The harsh musical instruments were also played when he came.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 229 / Osho Daily Meditations - 229 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 229. అవసరమైన చెడు 🍀*
*🕉. మీరు అంధులతో జీవిస్తున్నప్పుడు, అంధుడిగా జీవించండి. మీరు మొత్తం ప్రపంచాన్ని మార్చలేరు. 🕉*
*ప్రపంచంలో అధికారం చెలాయించే ఉద్యోగిస్వామ్యం ఉందని నాకు తెలుసు, కానీ అది ఉనికిలో ఉండాలి ఎందుకంటే ప్రజలు పూర్తిగా బాధ్యతా రాహిత్యంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు కోర్టు మరియు చట్టం మరియు పోలీసు అధికారులను హఠాత్తుగా వదిలి వేయడానికి మార్గం లేదు. ఎందుకంటే అవి లేకుండా మీరు ఒక్క క్షణం కూడా జీవించలేరు. ఇది అవసరమైన చెడు. అప్రమత్తంగా లేని, గాఢనిద్రలో ఉన్న, గురక పెట్టే వ్యక్తులతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ దాని గురించి ఏమీ చేయలేము. గరిష్టంగా, మీరు చేయగలిగినది ఏమిటంటే, సమాజం మీపై బలవంతం చేసిన అదే తెలివితక్కువ ప్రవర్తనను అమలు చేయకూడదు.*
*దాన్ని వేరొకరిపై బలవంతంగా రుద్దకండి. మీకు భార్య, భర్త ఉండవచ్చు, పిల్లలు వారిపై లేదా మీ స్నేహితులపై బలవంతం చేయకండి. మీరు చేయగలిగింది అంతే. కానీ మీరు సమాజంలో జీవించాలి మరియు మీరు నియమాలను పాటించాలి. కాబట్టి కేవలం విషయాలను ఖండించవద్దు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అవసరమైన అనేక చెడులు ఉన్నాయి; అవి అవసరం. ఎంపిక ఒప్పు మరియు తప్పు మధ్య కాదు. నిజ జీవితంలో ఎంపిక ఎల్లప్పుడూ పెద్ద చెడు మరియు తక్కువ చెడు, పెద్ద తప్పు మరియు తక్కువ తప్పు మధ్య ఉంటుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 229 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 229. NECESSARY EVIL 🍀*
*🕉. When you live with blind people, live like a blind person. You cannot change the whole world. 🕉*
*I know bureaucracy exists, but it has to exist because people are absolutely irresponsible. There is no way suddenly to drop the bureaucracy and the court and the law and the police officers. There is no way, because you will not be able to live for a single moment. It is a necessary evil. One just has to learn to live with people who are not alert, who are fast asleep, who are snoring. It may be disturbing to you, but nothing can be done about it.*
*At the most, the one thing you can do is not to enforce the same stupid behavior that has been forced on you by society. Don't force it on anybody else. You may have a wife, a husband, children don't force it on them or on your friends. That's all you can do. But you have to live in society and you have to follow the rules. So don't just condemn things. Try to understand. There are many evils that are needed; they are necessary. The choice is not between right and wrong. In real life the choice is always between a bigger evil and a lesser evil, a bigger wrong and a lesser wrong.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 398 / Sri Lalitha Chaitanya Vijnanam - 398🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*
*🌻 398. 'అవ్యక్తా’🌻*
*గ్రహింపబడనిది, వర్ణింపలేనిది, తపస్సుచే గాని, కర్మచే గాని పొందరానిది శ్రీమాత అని అర్ధము. మూల ప్రకృతి నుండి మొదటి ఆవరణగా వెలువడునది అవ్యక్తము. మాయ యొక్క ప్రకాశ రూపము గలది. ఈ అవ్యక్తము సృష్టి ధర్మము కలిగి యుండును. సూక్ష్మతమమై యుండును. చక్రము లేనిదై యుండును. దీనికి ఆది గాని, అంతము గాని, చేతన గాని లేదు.*
*విశ్వవ్యాప్తమై నిలచి యుండును. మహత్తున కవ్వలిదై యుండును. మూడు గుణముల సమష్టి రూపముగ యుండును. మూల ప్రకృతి నుండి యేర్పడును. ఈ అవ్యక్త మాధారముగనే వ్యక్తమగు మహతత్త్వము పుట్టును. అవ్యక్తమే వ్యక్త మగుటచేత తర్వాత నామమున 'వ్యక్తా అవ్యక్త స్వరూపిణి' అని కీర్తింపబడినది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 398 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*
*🌻 398. Avyaktā अव्यक्ता 🌻*
*This could be considered as further extension of the previous nāma. Avyakta is the state of prakṛti in its un-manifested form, with the three guṇa-s in equal proportions. Avyakta is the first stage of the Brahman that cannot be explained, as this is the purest form of Brahman, without parentage. This stage is also known as turya or the fourth state of consciousness, the other three being sleep, dream and deep sleep. It is the non-dualistic state, where the Brahman without a second is realized.*
*This stage is explained by Brahma Sūtra (III.ii.23) which says tadvyaktamāha hi (तद्व्यक्तमाह हि). This means “That Brahman is un-manifest”. This is further explained as ‘It is not comprehended through the eye, or through speech, or through other senses. Nor it is attained through austerity or karma. It is imperceptible, for It is never perceived’.*
*When the nirguṇa Brahman (the Brahman without attributes) desires to create, the māyā undergoes modifications and this modified stage of māyā is called avyakta.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment