🍀 26 - AUGUST - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

 🌹🍀 26 - AUGUST - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 26, ఆగస్టు 2022  శుక్రవారం, భృగు వాసరే Friday 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 252 / Bhagavad-Gita -252 - 6-19 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 652 / Vishnu Sahasranama Contemplation - 652 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 331 / DAILY WISDOM - 331 🌹   
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 231 🌹
🌹.స్మశాన నారాయణుని ఆలయం, అలంపూర్‌ - విశిష్టత🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹26,  August 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చివరి శ్రావణ శుక్రవారం 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -11 🍀*

*11. గఙ్గా త్వమేవ జననీ తులసీ త్వమేవ కృష్ణప్రియా త్వమసి భాణ్డిరదివ్యక్షేత్రే ।*
*రాజగృహే త్వమసి సున్దరి రాజ్యలక్ష్మీ శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్  ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆత్మానుభవాలలో భిన్నత్వం - నీ ఆత్మానుభవం నీవు యథార్థమని చాటుకొని, దానికి భిన్నంగా ఉండే మరొకరి ఆత్మానుభవం యథార్థం కాదని నీవు నిరాకరించే యెడల, భగవానుడి మరింత శిక్షణకు గురి కావలసి ఉంటుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ చతుర్దశి 12:25:26
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: ఆశ్లేష 18:33:09 వరకు
తదుపరి మఘ
యోగం: పరిఘ 26:11:20 వరకు
తదుపరి శివ
కరణం: శకుని 12:22:27 వరకు
వర్జ్యం: 06:18:00 - 08:03:00
దుర్ముహూర్తం: 08:31:49 - 09:22:02
మరియు 12:42:55 - 13:33:09
రాహు కాలం: 10:43:38 - 12:17:48
గుళిక కాలం: 07:35:19 - 09:09:29
యమ గండం: 15:26:08 - 17:00:18
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:42
అమృత కాలం: 16:48:00 - 18:33:00
సూర్యోదయం: 06:01:09
సూర్యాస్తమయం: 18:34:28
చంద్రోదయం: 04:58:08
చంద్రాస్తమయం: 18:12:28
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
మృత్యు యోగం - మృత్యు భయం
18:33:09 వరకు తదుపరి కాల యోగం
- అవమానం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శ్రీమద్భగవద్గీత - 253 / Bhagavad-Gita -  253 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం  - 20 🌴*

*20. యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |*
*యత్ర చైవాత్మనాత్మనం పశ్యన్నాత్మని తుష్యతి ||*

🌷. తాత్పర్యం :
*భౌతిక కార్యకలాపాల నుండి నిగ్రహించబడిన మనస్సు, యోగ సాధన ద్వారా నిశ్చలంగా మారినప్పుడు, యోగి శుద్ధి చేయబడిన మనస్సు ద్వారా ఆత్మను చూడగలుగుతాడు మరియు అతను అంతర్గత ఆనందంలో ఆనందిస్తాడు.*

🌷. భాష్యము :
యోగాభ్యాసము ద్వారా మనుజుడు క్రమముగా భౌతిక భావనల నుండి ముక్తుడగును. ఇదియే యోగసిద్ధాంతపు ప్రధాన లక్షణము. తదుపరి మనుజుడు సమాధి యందు మగ్నుడగును. అనగా ఆత్మ పరమాత్మతో సమానమనెడి ఎట్టి అపోహలు లేకుండా, పవిత్రమైన మనోబుద్దులతో హృదయస్థ పరమాత్మను యోగి గుర్తించగలుగు స్థితియే సమాధి యనబడును. వాస్తవమునాకు యోగపధ్ధతి దాదాపు పతంజలి యోగానియమముల పైననే ఆధారపడియున్నది. కొందరు అప్రమాణిక వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించగా, అద్వైతులు అట్టి దానినే మోక్షమని భావింతురు.

కాని వారందరు పతంజలి యోగపద్ధతి యందు దివ్యానందమును విషయము అంగీకరింపబడినను, అద్వైతులు ఆ విషయము అద్వైతసిద్ధాంతమందలి ఏకత్వమునకు భంగకరమని భయపడి అట్టి దివ్యానందమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞాత యను ద్వైతమును అద్వైతులు అంగీకరింపకున్నను, పవిత్రములైన ఇంద్రియముల ద్వారా అనుభవింపబడెడి దివ్యానందము ఈ శ్లోకము నందు అంగీకరింపబడినది.

ఇదే విషయము యోగవిధానకర్తయైన పతంజలిముని చేతను ఆమోదింపబడినది. ఆ మహాముని “పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ: కైవల్యం స్వరూపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన యోగసూత్రములలో (4.33) ప్రకటించియున్నాడు.

పై సూత్రమునందలి “చితశక్తి” లేదా “అంతరంగశక్తి” దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము, అంత్యమున భగవానునితో ఏకమగుటయైన మోక్షము అనునవియే పురుషార్థ మనబడును. ఈ పురుషార్థములలోని భగవదైక్యమే అద్వైతులచే కైవల్యమని పిలువబడును. కాని పతంజలి ముని ప్రకారం ఈ కైవల్యము అంతరంగశక్తి (ఆధ్యాత్మికశక్తి) అయియున్నది. దాని దవారా జీవుడు తన సహజస్థితి తెలిసికొనగలడు.
🌹 🌹 🌹 🌹 🌹H67

*🌹 Bhagavad-Gita as It is - 253 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 20 🌴*

*20. yatroparamate cittaṁ niruddhaṁ yoga-sevayā*
*yatra caivātmanātmānaṁ paśyann ātmani tuṣyati*

🌷 Translation :
*When the mind, restrained from material activities, becomes still by the practice of Yog, then the yogi is able to behold the soul through the purified mind, and he rejoices in the inner joy.*

🌹 Purport :
By practice of yoga one becomes gradually detached from material concepts. This is the primary characteristic of the yoga principle. And after this, one becomes situated in trance, or samādhi, which means that the yogī realizes the Supersoul through transcendental mind and intelligence, without any of the misgivings of identifying the self with the Superself. Yoga practice is more or less based on the principles of the Patañjali system. Some unauthorized commentators try to identify the individual soul with the Supersoul, and the monists think this to be liberation, but they do not understand the real purpose of the Patañjali system of yoga.

There is an acceptance of transcendental pleasure in the Patañjali system, but the monists do not accept this transcendental pleasure, out of fear of jeopardizing the theory of oneness. The duality of knowledge and knower is not accepted by the nondualist, but in this verse transcendental pleasure – realized through transcendental senses – is accepted. And this is corroborated by Patañjali Muni, the famous exponent of the yoga system.

The great sage declares in his Yoga-sūtras (4.33): puruṣārtha-śūnyānāṁ guṇānāṁ pratiprasavaḥ kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti. This citi-śakti, or internal potency, is transcendental. Puruṣārtha means material religiosity, economic development, sense gratification and, at the end, the attempt to become one with the Supreme. This “oneness with the Supreme” is called kaivalyam by the monist. But according to Patañjali, this kaivalyam is an internal, or transcendental, potency by which the living entity becomes aware of his constitutional position.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 652 / Vishnu  Sahasranama Contemplation - 652🌹*

*🌻652. కామపాలః, कामपालः, Kāmapālaḥ🌻*

*ఓం కామపాలాయ నమః | ॐ कामपालाय नमः | OM Kāmapālāya namaḥ*

*సర్వేషాం కామినాం సర్వాన్ కామాన్ పాలయతీతి సః ।*
*కామపాల ఇతి ప్రోక్తో విష్ణుర్విబుధసత్తమైః ॥*

*కోరికలు కలవారి కోరికలను తీర్చి వారిని పాలించువాడుగనుక విష్ణువు కామపాలః అని చెప్పబడును.*

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 652🌹*

*🌻652. Kāmapālaḥ🌻*

*OM Kāmapālāya namaḥ*

सर्वेषां कामिनां सर्वान् कामान् पालयतीति सः ।
कामपाल इति प्रोक्तो विष्णुर्विबुधसत्तमैः ॥

*Sarveṣāṃ kāmināṃ sarvān kāmān pālayatīti saḥ,*
*Kāmapāla iti prokto viṣṇurvibudhasattamaiḥ.*

*He takes care of the ones with desires by fulfilling them and hence Lord Viṣṇu is called Kāmapālaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
कामदेवः कामपालः कामी कान्तः कृतागमः ।अनिर्देश्यवपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ॥ ७० ॥
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః ।అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనఞ్జయః ॥ 70 ॥
Kāmadevaḥ kāmapālaḥ kāmī kāntaḥ kr‌tāgamaḥ,Anirdeśyavapurviṣṇurvīro’nanto dhanañjayaḥ ॥ 70 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 331 / DAILY WISDOM - 331 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*✍️ .స్వామి కృష్ణానంద   📝. ప్రసాద్ భరద్వాజ*

*🌻 26. మీరు ఒక్క సారిగా మొత్తం చూడాలి 🌻*

*ఆడ, మగ అనేవి ఉండవు. కానీ, మీరు చెబితే, వారు ప్రతిచోటా ఉన్నారు. చెట్లలో కూడా మగ చెట్లు మరియు ఆడ చెట్లు కనిపిస్తాయి. ఇది నిజం కూడా కావచ్చు. నేను హాస్యమాడడం లేదు. అందుకే పర-పరాగ సంపర్కం జరుగుతుంది, ఆపై చెట్లలో పండ్లు ఉత్పత్తి అవుతాయి. అది మగ-ఆడ చర్య మాత్రమే. కీటకాలకు కూడా మగ మరియు ఆడ భేదం ఉంది - తేనెటీగల్లో వలె, సైన్యం వంటి మగవి ఉన్నాయి మరియు ఆడది రాణి. ప్రతి చోటా మీరు ఒకే లక్షణాలను కనుగొంటారు.*

*కానీ, మీరు ఈ స్పృహను అధిగమించడానికి ప్రయత్నిస్తే, మరియు భగవంతుని శక్తి  ప్రతి చోటా ఉందని భావిస్తే, సానుకూల మరియు ప్రతికూల రెండూ భగవంతుని చైతన్యంలో కరిగిపోతాయి. అప్పుడు మీరు ఆలోచిస్తున్నట్లు అటువంటి భేదం ఉండదు. దిగువ స్థాయిలలో, ఈ భేదాలు కనిపిస్తాయి, కానీ ఉన్నత స్థాయిలో, అవన్నీ భగవంతుని శక్తిగా, భగవంతుని చైతన్యంలో కలిసిపోతాయి. కాబట్టి, మీ సందేహం ఏమిటి? మీరు దేనిని కేంద్రీకరిస్తున్నారు? మీరు ఎవరి ముఖం పైనైనా ఎందుకు దృష్టి పెట్టాలనుకుంటున్నారు? అవసరము ఏమిటి? కళ్ళు, ముక్కు, చెవులు మొదలైన వాటిని చూసి మీరు ఒక వ్యక్తిని అంచనా వేయలేరు. ఇది మొత్తం ఇంకా ఉంది. మీరు ఒకే చిత్రంగా చూడవలసిన మొత్తం విషయం-తల నుండి పాదాల వరకు ఏకకాలంలో.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 331 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda  📚. Prasad Bharadwaj*

*🌻 26. The Whole Thing You have to See at One Stroke 🌻*

*There are no such things as males and females. But, if you say they are, then they are everywhere. Even in trees you will find male trees and female trees. It may be true, also. I am not joking. That is why cross-pollination takes place, and then fruits are produced in the trees. That is a male-female action only. Even insects have male and female distinction—like in honey bees, there are males like drones, and the female is the queen. Everywhere you find the same features. But, if you try to transcend this consciousness, and feel God's power present everywhere, then the positive and negative, both, will melt into God-consciousness.*

*Then there will be no such distinction as you are thinking. In the lower levels, these distinctions are seen, but in the higher level, they all get fused into God-energy, God-consciousness. So, what is your doubt? What are you concentrating? Why do you want to concentrate on anyone's face? What is the purpose? You cannot judge a person by seeing the eyes, nose, ears, etc. It is a total that is there. The whole thing you have to see at one stroke—from head to foot simultaneously.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో  - 231 🌹*
*✍️.  సౌభాగ్య  📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀.  దేవుడంటే ప్రకృతికి సంబంధించిన అంతిమ చట్టం. నీ బాధ్యతని నిర్వర్తించు. ప్రకృతి వెంటనే స్పందిస్తుంది. నువ్వు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ పోతే నీకు వరాలందుతాయి.  🍀*

*శాంతి దైవికం. అది దేవుడిచ్చిన వరం. దేవుడు చాలా ఉదారుడు. నువ్వు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ పోతే నీకు వరాలందుతాయి. అది వరాల కోసం చేసేది కాదు కానీ అలా జరుగుతుంది. ఐతే ఒక విషయం గుర్తుంచుకోవాలి. దాన్ని ప్రత్యక్ష్యంగా మనం ఏమీ చెయ్యలేం. కానీ దానికి సరయిన సందర్భాన్ని మనం కల్పించవచ్చు. అది పూలకు సంబంధించిన విషయం లాంటిది. పూలకు సంబంధించి సూటిగా మనం ఏమీ చెయ్యలేం. భూమిని సిద్ధం చేసి విత్తనాల్ని నాటవచ్చు. మొక్క పెరగడానికి సాయపడవచ్చు. ఎదురుచూడవచ్చు. సరయిన రుతువులో, సరయిన సందర్భం నుండి పూలను లాగలేం. అవి రావడాన్ని వాటంతట అది జరిగేలా నువ్వు అనుమతించాలి.*

*అవి ఒక తెలియని చోటు నించీ, మార్మికమయిన గమనం గుండా వస్తాయి. దాని కోసం సహనం అవసరం. వ్యక్తి తను ఎంత వరకు చెయ్యాలో అంతవరకు చేయాలి. తరువాత ఎదురుచూడాలి. సమయం వచ్చినపుడు పూలు వస్తాయి. అవి ఎప్పుడూ వస్తాయి. బుద్ధుడికి,  లావోట్జుకు, మహావీరుడికీ వచ్చాయి.  అవి నీకు కూడా వస్తాయి. దేవుడికి పక్షపాతం లేదు. ఆయన ఎవరి పట్లో యిష్టాన్ని, మరెవరి పట్లో అయిష్టాన్ని ప్రదర్శించడు. దేవుడంటే ప్రకృతికి సంబంధించిన అంతిమ చట్టం. నీ బాధ్యతని నిర్వర్తించు. ప్రకృతి వెంటనే స్పందిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. స్మశాన నారాయణుని ఆలయం, అలంపూర్‌ - విశిష్టత🌹*

*స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.  1. కాశీ,  2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)*

*అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు . అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.*

*స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....*
*పాలు అన్నముతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నేయి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి !*

*ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .*

*స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.  ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )*

*అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.*

*ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "వేణు మాధవ నంబూద్రి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !*

*ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !*

*చేరుకొనే విధానం :*
*అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "*

*ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశేశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !*

*ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి మోక్షం నారాయణ శ్రద్ద పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు : 9440544759,  9491298422.*
*పదిమందికి ఉపయోగపడే విషయం . దయవుంచి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.*
*సర్వేజనా సుఖినోభవంతు*
*గురుభ్యోన్నమః*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment