శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 402. 'విద్యా అవిద్యా స్వరూపిణి' - 1 🌻

శ్రీమాత విద్యా స్వరూపిణీయే గాక, అవిద్యా స్వరూపిణి యని కూడ అర్థము. విద్యను, అవిద్యను రెండింటిని ఎఱుంగువాడు మృత్యువును దాటి అమృతత్త్వము ననుభవించు చుండును. సృష్టి యందలి ద్రవ్య మంతయూ నశించు చుండును. ఇంద్రియ ప్రవృత్తులునూ అట్లే తాత్కాలికములు. గుణములు కూడ ప్రాకృత సంబంధములే. గుణములు, ఇంద్రియములు, రూపములు మూడును ప్రకృతి సంబంధితములు. అనుభూతికి ఈ మొత్తము వేదిక.

జీవుడు పరమాత్మ నుండి వ్యక్తమైన అంశ. ప్రకృతి కూడ పరమాత్మ నుండి వ్యక్తమైనదే. మూలప్రకృతి అష్టప్రకృతిగ మారి జీవుని అనుభూతికి వేదిక యగు చున్నది. వేదిక శాశ్వతము కాదు. అది అవిద్యా స్వరూపము. జీవుడు శాశ్వతుడు. మూలప్రకృతి, దాని కాధారమైన పరతత్వము శాశ్వతము. మూల ప్రకృతి, పరతత్వములతో అనుసంధానము చెందు ఆత్మ విద్యా స్వరూపమై యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 402 -1🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

📝. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻

🌻 402. 'Vidya Avidya Swarupini' - 1 🌻


This means that Mata is the personification of wisdom, and also the personification of ignorance. He who knows both education and ignorance will go beyond death and experience immortality. All the riches and sensualities in this Creation shall perish. Gunas are also natural(prakritic) tendencies. Gunas, senses and forms are related to nature. This whole platform for experience.

The Self is a manifestation of the Supreme Being and so is nature. The primordial nature expressed itself in eight forms and formed a basis for experience. The basis is not permanent. It is a form of ignorance. The self is eternal. Primordial nature, and its associated philosophy is eternal. The soul, which connects the primordial aspects of nature, with its philosophies is the personification of wisdom.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 Aug 2022

No comments:

Post a Comment