శ్రీ శివ మహా పురాణము - 614 / Sri Siva Maha Purana - 614
🌹 . శ్రీ శివ మహా పురాణము - 614 / Sri Siva Maha Purana - 614 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 08 🌴
🌻. దేవాసుర యుద్ధము - 2 🌻
వీరుడు, గొప్ప తేజశ్శాలి యగు వీరభద్రుడు కూడా భయంకరమైన వాడియైన త్రిశూలముతో వెంటనే తారకుని కొట్టెను (13) . రాక్షసశ్రేష్టుడు, బలశాలి, వీరులకు ఆదరణీయుడు అగు ఆ తారకుడు కూడ తరువాత యుద్దములో వీరభద్రుని శక్తితో కొట్టెను (14). యుద్ధ విద్యలో నేర్పరులగు వారిద్దరు ఈవిధముగా యుద్ధరంగములో అనేక విధములగు శస్త్రాస్త్రములతో యుద్ధమును చేయుచూ పరస్పరము హింసించుకొనిరి (15).
అపుడచట అందరు చూచుచుండగా ఆ ఇద్దరు మహావీరుల మధ్య శరీరము గగుర్పొడిచే భయంకరమగు యుద్ధము జరిగెను (16). అపుడు భేరీలు, మృదంగములు, పటహములు, ఆనకములు, గోముఖములు అను వాద్యములను వీరులు మ్రోగించిరి. ఆ శబ్దము వినువారలకు మిక్కిలి బీతిని గొల్పెను (17). దెబ్బలతో శిథిలమైన దేహములు గల వారిద్దరు యుద్దమునకు మరల సన్నద్ధులై బుధాంగారకుల వలె మహవేగముతో ద్వంద్వయుద్ధమును చేసిరి (18). వీరభద్రునకు వానితో జరుగు చున్న ఈ యుద్ధమును చూచి, శివునకు ప్రియుడవగు నీవు అచటకు వెళ్లి వీరభద్రునితో ఇట్లు పలికితివి (19).
నారదుడిట్లు పలికెను -
వీరభద్రా! మహావీరా! నీవు గణములలో అగ్రేసరుడవు. ఈ యుద్ధమునుండి వెనుకకు మరలుము. నీవు వధించగలవని తోచుట లేదు (20). నీ ఈ మాటను విని గణాధ్యక్షుడు, కోపముతో ఆవేశమును పొంది యున్నవాడు అగు వీరభద్రుడు అపుడు చేతులను జోడించి నీతో ఇట్లు పలికెను (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 614🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 08 🌴
🌻 The battle between the gods and Asuras - 2 🌻
13. In the same manner, the heroic Vīrabhadra of great brilliance hit Tāraka with his sharp terrible trident.
14. The powerful king of the Asuras, the heroic Tāraka, hit Vīrabhadra[1] again with spear.
15. Fighting each other thus they hit each other with various weapons and missiles both being equally skilful in the art of warfare.
16. Even as others stood gazing, the two of great energy continued their duel causing hair to stand on ends, with tumultuous noise.
17. Then various military bands and drums like Bherīs, Mṛdaṅgas, Paṭahas, Āṇakas and Gomukhas were sounded by the soldiers terrifying those who happened to hear.
18. Both of them were severely wounded by the mutual hits and thrusts but still they continued their fight with added vigour like Mercury and Mars.
19. On seeing the fight between him and Vīrabhadra, you, the favourite of Śiva went there and said to Vīrabhadra,
Nārada said:—
20. “O Vīrabhadra, of great heroism, you are the leader of the Gaṇas. Please desist from this fight. Your killing him does not fit in properly”.
21. On hearing your words, the leader of the Gaṇas Vīrabhadra became furious but spoke to you with palms joined in reverence.
Continues....
🌹🌹🌹🌹🌹
25 Aug 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment