🍀 29 - AUGUST - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

 🌹🍀 29 - AUGUST - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 29, సోమవారం, ఆగస్టు 2022 ఇందు వాసరే  Monday 🌹
2) 🌹 కపిల గీత - 62 / Kapila Gita - 62 🌹 సృష్టి తత్వము - 18
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 101 / Agni Maha Purana - 101 🌹
4) 🌹. శివ మహా పురాణము - 617 / Siva Maha Purana -617 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 236 / Osho Daily Meditations - 236 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 -  3 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 3 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹29,  August ఆగస్టు 2022 పంచాగము - Panchangam  🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀.  రుద్రనమక స్తోత్రం - 39 🍀*

*75. అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!*
*ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!*
*76. నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!*
*వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి :  శాస్త్రవాక్కు అర్థనిర్ణయం - శాస్త్రవాక్కు అమోఘమే, అందు పొరపాటుండదు. కాని, దాని అర్థం ఇదియని హృదయంతోనూ, బుద్ధితోనూ చేసే వ్యాఖ్యానంలో పొరపాటుండ వచ్చును. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వర్ష ఋతువు,
దక్షిణాయణం, భాద్రపద మాసం
తిథి: శుక్ల విదియ 15:22:27 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 23:04:50
వరకు తదుపరి హస్త
యోగం: సద్య 25:03:02 వరకు
తదుపరి శుభ
కరణం: కౌలవ 15:18:27 వరకు
వర్జ్యం: 05:29:48 - 07:10:12
దుర్ముహూర్తం: 12:41:57 - 13:31:59
మరియు 15:12:04 - 16:02:07
రాహు కాలం: 07:35:28 - 09:09:17
గుళిక కాలం: 13:50:45 - 15:24:35
యమ గండం: 10:43:07 - 12:16:56
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41
అమృత కాలం: 15:32:12 - 17:12:36
సూర్యోదయం: 06:01:38
సూర్యాస్తమయం: 18:32:14
చంద్రోదయం: 07:32:01
చంద్రాస్తమయం: 20:02:03
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
శ్రీవత్స యోగం - ధన లాభం ,
సర్వ సౌఖ్యం 23:04:50 వరకు
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 62 / Kapila Gita - 62🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴  2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 18 🌴*

*18. అంతః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః|*
*సమన్వేత్యేష సత్త్వానాం  భగవానాత్మమాయయా॥*

*ఈ విధముగా తన మాయ ద్వారా ప్రాణులలోపల జీవ రూపుడుగను, వెలుపల కాల రూపుడుగను వ్యాప్తమైయున్న భగవంతుడే ఇరువది ఐదవ తత్త్వము.*

*పరమాత్మ తన మాయతో ప్రతీ ప్రాణిలోనూ లోపల పురుషునిగా ఉంటాడు, వెలుపల కాలముగా ఉంటాడు. లోపల సంకల్పం కలిగించేదీ, బయట కాలముగా ఉండి ఆ పని చేయించేదీ భగవానుడే. అలా లోపల పురుషునిగా ఉండి, బయట కాలముగా ఉండి అన్ని ప్రాణులనీ కలుపుతాడూ (సమన్వేత్యేష సత్త్వానాం). కలిపేది ఆయనే - సమన్వేతి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 62 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 18 🌴*

*18. antaḥ puruṣa-rūpeṇa kāla-rūpeṇa yo bahiḥ*
*samanvety eṣa sattvānāṁ bhagavān ātma-māyayā*

*By exhibiting His potencies, the Supreme Personality of Godhead adjusts all these different elements, keeping Himself within as the Supersoul and without as time.*

*Paramātmā, who resides within the body of the individual soul, and the conditioned soul comes to this material world in order to lord it over material nature. When the living entity is bewildered or illusioned by the external energy, he becomes forgetful of his eternal relationship with the Lord, but as soon as he becomes aware of his constitutional position, he is liberated.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 101 / Agni Maha Purana - 101 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 33*

*🌻. పవిత్రారోపణ విధి -  శ్రీధర నిత్యపూజా విధానము -2🌻*

ఈ విధముగ ప్రార్థించు పవిత్రకమును ఇష్టదేవతామండలమునకు గాయత్రీ మంత్రముతో కట్టవలెను.
''ఓం నమో నారాయణాయ విద్మహే, వాసుదేవాయ దీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్‌''
అనునది ఇష్టదేవత యగు నారాయణుని గాయత్రీమంత్రము.

ఈ గాయత్రీ ఇష్టదేవతానామానుసారముగ ఉండును. దేవప్రతిమలపై అర్పించుటకు అనేక విధములగు పవిత్రకము లుండును. విగ్రహము యొక్క నాభి వరకు వచ్చునది ఒకటి; తొడలవరకు వచ్చునది మరి యొకటి మోకాళ్ళవరకు వచ్చునది మరియొకటి. పాదములవరకు వ్రేలాడునది ఒకటి. చివరిదానికి వనమాల అని పేరు. దానిని ఒక వెయ్యి ఎనిమిది దారములతో నిర్మింపవలెను. సాధారణమాలను శక్త్యనుసారము నిర్మింపవలెను. లేదా అది పదునారు అంగుళములకంటె రెట్టింపు పెద్దదిగా ఉండవలెను.

కర్ణికా-కేసర-దళాదులుగల యంత్ర-చక్రదిమండలములపై వేయు పవిత్రకము పైనుండి క్రిందివరకును కప్పునదిగా ఉండవలెను. ఒక చక్రము, ఒక కమలము ఉన్న మంక్షలముపై ఆ మండలము ఎన్ని అంగుళము లున్నదో అన్ని అంగుళముల పవిత్రకము అర్పింపవలెను. వేదిపై అర్పించు పవిత్రకము తన చేతి అంగుళములతో ముప్పదియేడు అంగుళముల పొడ వుండవలెను.

ఆచార్యుని కొరకును, తలిదండ్రుల కొరకును, పుస్తకముపై ఉంచుట కొరకును నిర్మింపబుడు పవిత్రకము నాభిప్రదేశము వరకును వ్రేలాడవలెను. దీనికి పండ్రెండు ముడులు ఉండవలెను. దానిపై మంచి గంధము పూయవలెను. వనమాలయందు రెండేసి అంగుళముల దూరమున క్రమముగా నూటఎనిమిది ముడులు వేయవలెను.

లేదా కనిష్ఠ-మధ్యదు-ఉత్తమపత్రకములపై క్రమముగా పండ్రెండు, ఇరువదినాలుగు, ముప్పదియారుముడులు వేయవలెను. మంద-మధ్యమ-ఉత్తమమాలార్థు లగ పురుషులు అనామికా-మధ్యమా-అంగుష్ఠములచేతనే పవిత్రకములను గ్రహింపవలెను. లేదా కనిష్ఠకాది నామధేయములు గల పవిత్రకములందు అన్నింటియందును పండ్రెండేసి ముడులే ఉండవలెను. (తంతువుల సంఖ్యను పట్టియు, పొడవును పట్టియు ఈ కనిష్ఠికాదినామదేయము లేర్పడినవి).

సూర్యునకు, కలశమునకు, అగ్ని మొదలగు వాటికిని గూడ యథాసంభవముగ భగవంతు డగు విష్ణువునకు వలెనే పవిత్రకములను అర్పించుట ఉత్తమ మని చెప్పబడినది. పీఠముకొరకు దాని పొడవును పట్టియు, కుండమునకు దాని మేఖలపర్యంతమును పొడవు గల పవిత్రకముండవలెను. విష్ణుపార్షదులకు యథాశక్తిగ సూత్రగ్రంథులను సమర్పింపవలెను. లేదా గ్రంథులు లేకుండ పదునేడు సూత్రములు సమర్పింపవలెను. భద్రుడను పార్షదునకు త్రిసూత్రము సమర్పింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 101 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 33*
*🌻 Mode of investiture of the sacred thread for the deity and the installation of the deity - 2 🌻*

8-10. Having prayed (in this way), one has to tie it to the circular altar at first with the Gāyatrī[1]
Oṃ nārāyaṇāya vidmahe vāsudevāya dhīmahi tanno viṣṇuḥ pracodayāt.
A garland made of one thousand and eight wood-flowers is consecrated to the Lord of lords extending upto the feet and the pavitraka (sacred thread) upto the knees, thighs, and navel of the idol befitting him. The garland should be made thirty-two fingers length.

11. In the circular lotus of one finger (breadth) the pericarp, filament, leaf, the first basic syllable and the outer circumference of the circle are consecrated.

12-13. By the measure of one’s fingers the threads for the preceptors (are consecrated) on the models of the parents on the ground. Twelve knots made fragrant are consecrated to the end of the navel. Then two garlands are made ready at first containing one hundred and eight flowers.

14. O twice born one! Otherwise twenty-four or thirty-six garlands should be consecrated to the sun with the ring and middle fingers by those who desire for a daughter.

15. There may be twelve knots in the sacred thread for the pot of the Sun, and the fire as in the case of Viṣṇu.

16. According to one’s ability the knots of the sacred thread should be placed in the midst of the articles for the worship of Viṣṇu on the altar in the pit encircled by a girdle.

17-18. One who has bathed and performed the twilight worship should dye the seventeen strings divided into three parts, with rocanā (yellow pigment), agallochuṃ, camphor, turmeric, saffron or sandal. Then one has to worship Hari on the eleventh lunar day at the sacrificial yard.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 616 / Sri Siva Maha Purana - 616 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 08 🌴*
*🌻. దేవాసుర యుద్ధము  - 4 🌻*

ఈ విధముగా తన స్తెన్యము భగ్నమగుటను గాంచి, దాని పాలకుడగు తారకాసురుడు కోపావేశము గలవాడై దేవతలను, గణములను సంహరించుటకు ఉద్యుక్తుడాయెను (33). ఆతడు రణరంగములో పదివేల చేతులు గలవాడై సింహమునెక్కి వేగముగా దేవతలను, మరియు గణములను పడగొట్టు చుండెను (34). మహాబలుడు, గణాధ్యక్షుడునగు ఆ వీరభధ్రుడు వాని ఆ యుద్ధకర్మను చూచి మిక్కిలి కోపమును పొంది వానిని వధించుటకు ఉద్యుక్తుడాయెను (35). ఆతడు శివుని పాదపద్మములను స్మరించి గొప్ప త్రిశూలమును చేతబట్టెను. ఆతని తేజస్సుచే సర్వదిక్కులు మరియు ఆకాశము ప్రకాశించెను (36).

ఇంతలో గొప్ప ఉత్కంఠతో చూచుచున్న కుమారస్వామి వెంటనే వీరబాహునితో చెప్పించి ఆ యుద్ధమును ఆపించెను (37). అపుడు వీరభధ్రుడు ఆయన ఆజ్ఞకు తలఒగ్గి యుద్ధము నుండి వెనుకకు మరలెను. మహావీరుడు, అసురనాయకుడు అగు తారకుడు కోపించెను (38). అపుడా రాక్షసుడు కోపముతో మండిపడుతూ దేవతలపై బాణవర్షమును కురిపించెను. అనేక అస్త్రముతలతో యుద్ధమును చేయుటలో నిపుణుడగు ఆతడు వెంటనే దేవతలను యుద్ధమునకు పురిగొల్పెను (39). అందరు దేవతలు కలిసిననూ లొంగనివాడు, బలవంతులలో శ్రేష్ఠుడు, రక్షసరాజు అగు తారకుడు ఈ తీరున గొప్ప యుద్ధమును చేసెను (40).

ఈ విధముగా సంహరింపబడుతూ భయముతో కంగారు పడుచున్న ఆ దేవతలను చూచి అచ్యుతుడు కోపించి వెంటనే యుద్ధమునకు సన్నద్ధుడాయెను (41). విష్ణుభగవానుడు సుదర్శన చక్రము, శార్‌ఙ్గ ధనస్సు అను ఆయుధములను చేతబట్టి ఆ రాక్షసునితో యుద్ధమును చేయుటకొరకు ముందున కురికెను (42).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 616🌹*
*✍️  J.L. SHASTRI,  📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  08 🌴*

*🌻 The battle between the gods and Asuras - 4 🌻*

33. On seeing his army vanishing thus in flight, their protector, the Asura Tāraka, furiously rushed at the gods and the Gaṇas.

34. He assumed ten thousand hands and rode on a lion. In the battle that followed he felled the gods and the Gaṇas quickly.

35-36. On seeing such a perpetration of Tāraka, Vīrabhadra, the leader of the Gaṇas, became very furious. In order to kill him he took up his trident after remembering the lotuslike feet of Śiva. His brilliance then brightly illuminated all the quarters and the sky.

37. In the meantime, the master stopped the war. He prevented Vīrabāhu and others immediately in order to show his own might.

38. At his bidding Vīrabhadra returned from the battle. The heroic leader of the Asuras, Tāraka, was still in his unabated fury.

39. Then the Asura showered arrows on the gods and put them to distress. He was skilful in the use of various missiles in the war.

40. After causing a great havoc, Tāraka, the protector of Asuras, the most excellent among the brave, seemed invincible to the gods.

41. On seeing the gods terrified and slaughtered, Viṣṇu became furious and got ready to fight.

42. Taking discus Sudarśana, the bow Śārṅga and other weapons with him, lord Viṣṇu rushed to meet the great Asura in the battle.

Continues....
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 236 / Osho Daily Meditations  - 236 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 236. వినడం మరియు దివ్య శ్రవణం 🍀*

*🕉. దివ్య శ్రవణం ఉంటే కళ - అదే ధ్యానం. సరిగ్గా వినడం ఎలాగో నేర్చుకోగలిగితే, ధ్యానం యొక్క లోతైన రహస్యాన్ని నేర్చుకుంటారు. వినడం ఒక విషయం -- శ్రవణం పూర్తిగా భిన్నమైనది; వాటి ప్రపంచాలు వేరు. వినికిడి అనేది భౌతిక దృగ్విషయం; మీకు చెవులు ఉన్నాయి కాబట్టి మీరు వింటారు. శ్రవణం అనేది ఒక ఆధ్యాత్మిక దృగ్విషయం. మీకు శ్రద్ధ ఉన్నప్పుడు, మీ అంతరంగం మీ చెవులతో కలిసినప్పుడు మీరు ఆలకిస్తారు. 🕉*
 
*పక్షుల ధ్వనులు, చెట్లను దాటుతున్న గాలి, వరదలలో నది, గర్జించే సముద్రం, మరియు మేఘాలు, ప్రజలు, ప్రయాణిస్తున్న దూర రైలు, రహదారిపై కార్లు -- ఒక్కో శబ్దాన్ని వినండి.  మీరు వినే దానిపై ఏమీ తీర్మానాలు విధించకుండా వినండి. వాటిపై ఎటువంటి తీర్పు ఇవ్వకండి ; మీరు తీర్పు చెప్పిన క్షణం, శ్రవణం ఆగిపోతుంది. నిజంగా శ్రద్ధ గల వ్యక్తి ఏ నిర్ధారణలు చేయకుండానే ఉంటాడు; అతను లేదా ఆమె ఎప్పుడూ దేని గురించి ఇది ఇంతే నిర్థారించుకోరు.*

*ఎందుకంటే జీవితం ఒక ప్రక్రియ, ఏదీ అంతం కాదు. మూర్ఖుడు మాత్రమే దేనికైనా ముగింపును భావించ గలడు; వివేకవంతులు నిర్ధారణలు చేయడానికి వెనుకాడతారు. కాబట్టి తీర్మానాలు లేకుండా వినండి.  జాగురూకతతో, నిశ్శబ్దంగా, తెరుచుకుని, స్వీకరిస్తూ ఉండి వినండి. మిమ్మల్ని చుట్టుముట్టే ధ్వనితో పూర్తిగా అక్కడే ఉండండి. మరియు మీరు ఆశ్చర్యపోతారు: ఒక రోజు అకస్మాత్తుగా ధ్వని ఉంది, మీరు వింటున్నారు, దానితో పాటు నిశ్శబ్దం కూడా ఉంటుంది. ధ్వని ద్వారా జరిగేది నిజమైన నిశ్శబ్దం.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 236 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 236. HEARING AND LISTENING 🍀*

*🕉.  The art if divine listening-that's what meditation is. If one can learn how to listen rightly, one has learned the deepest secret of meditation. Hearing is one thing -- listening is altogether different; they are worlds apart. Hearing is a physical phenomenon; you hear because you have ears. Listening is a spiritual phenomenon. You listen when you have attention, when your inner being joins with your ears.  🕉*
 
*Listen to the sounds of the birds, the wind passing through the trees, the river in flood, the ocean roaring, and the clouds, the people, the faraway train passing by, the cars on the road -- each sound has to be used. And listen without imposing anything on what you listen to. Don't judge them; The moment you judge, listening stops. The really attentive person remains without conclusions; he or she never concludes about anything.*

*Because life is a process, nothing ever ends. Only the foolish person can conclude; the wise will hesitate to make conclusions. So listen without conclusions.  Just listen--alert, silent, open, receptive. Just be there, totally with the sound that surrounds you. And you will be surprised: One day suddenly the sound is there, you are listening, and yet there is silence. It is true silence that happens through sound.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 402 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 402 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।*
*మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*

*🌻 402. 'విద్యా అవిద్యా స్వరూపిణి' - 3 🌻*

*పూర్ణయోగి ఇహపరములందు సమవర్తనము కలిగి యుండును. ఇహమును నిరసించుట, పరమును గొప్పదని భావించుట సమ వర్తనమునకు దారి చూపదు. పూర్ణయోగి ఇహమునందు పరమును దర్శించగల దిట్ట. అట్టి యోగులు స్మశానమున కావలివాడుగ నుండుటకు గాని, చెప్పులు కుట్టువాడుగ నుండుటకు గాని, మాంసము అమ్ముకొనువాడుగ నుండుటకు గానీ, గోవులు, గొట్టెలకాపరిగ నుండుటకు గాని, రాజకీయముల యందుండుటకు గాని, యుద్ధము లందు పాల్గొనుటకు గాని, వ్యాపారాదులు చేయుటకు గాని సందేహింపరు.*

*కేవలము పాండిత్యమును ఒలకపోయుచు శాస్త్ర పురాణాదులను మాత్రమే వివరించుకొనుచు జీవించ వలెనను నియమ ముండదు. ప్రకృతి తనకేది లభింపజేసిన దానియందే వర్తించును. “యదృచ్ఛాలాభ సంతుష్టో" అని గీతలో భగవానుడు పలికినాడు. ధర్మవ్యాధుడు, హరిశ్చంద్రుడు, శ్రీకృష్ణుడు అట్టివారు. వీరికి అవిద్య యందు నీరస భావము లేదు. విద్యా అవిద్యల యందు సమమగు రస భావము కలవారు. ఇట్టి వారు శ్రీమాత స్వరూపులే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 402 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini*
*Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*

*🌻 402. 'Vidya Avidya Swarupini' - 3 🌻*

*A Purnayogi has equanimity in all the things. Protesting against the physical creation and thinking that the Supreme is great does not lead to equanimity. Purnayogi is the one who can see the Supreme Being in everything.  Such Yogis do not hesitate to be a graveyard keeper, to be a cobbler, to be a meat seller, to be a cowherd, to be in politics, to participate in war, or to be a businessman.*

*There is no rule of thumb to live by merely performing the austerities and displaying their knowledge to others. They live with what the nature has to offee. Lord said in the Gita, 'Yadrichhalabha Santushto'. Dharmavyadha, Harishchandra and Sri Krishna are the same. They have no sense of wrong in the knowledge of the senses. They have the same sense of passion in both the knowledge of the senses and that of the self. These stalwarts are nothing but the forms of Srimata Herself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No comments:

Post a Comment