శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 402 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 402. 'విద్యా అవిద్యా స్వరూపిణి' - 3 🌻


పూర్ణయోగి ఇహపరములందు సమవర్తనము కలిగి యుండును. ఇహమును నిరసించుట, పరమును గొప్పదని భావించుట సమ వర్తనమునకు దారి చూపదు. పూర్ణయోగి ఇహమునందు పరమును దర్శించగల దిట్ట. అట్టి యోగులు స్మశానమున కావలివాడుగ నుండుటకు గాని, చెప్పులు కుట్టువాడుగ నుండుటకు గాని, మాంసము అమ్ముకొనువాడుగ నుండుటకు గానీ, గోవులు, గొట్టెలకాపరిగ నుండుటకు గాని, రాజకీయముల యందుండుటకు గాని, యుద్ధము లందు పాల్గొనుటకు గాని, వ్యాపారాదులు చేయుటకు గాని సందేహింపరు.

కేవలము పాండిత్యమును ఒలకపోయుచు శాస్త్ర పురాణాదులను మాత్రమే వివరించుకొనుచు జీవించ వలెనను నియమ ముండదు. ప్రకృతి తనకేది లభింపజేసిన దానియందే వర్తించును. “యదృచ్ఛాలాభ సంతుష్టో" అని గీతలో భగవానుడు పలికినాడు. ధర్మవ్యాధుడు, హరిశ్చంద్రుడు, శ్రీకృష్ణుడు అట్టివారు. వీరికి అవిద్య యందు నీరస భావము లేదు. విద్యా అవిద్యల యందు సమమగు రస భావము కలవారు. ఇట్టి వారు శ్రీమాత స్వరూపులే.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 402 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻

🌻 402. 'Vidya Avidya Swarupini' - 3 🌻


A Purnayogi has equanimity in all the things. Protesting against the physical creation and thinking that the Supreme is great does not lead to equanimity. Purnayogi is the one who can see the Supreme Being in everything. Such Yogis do not hesitate to be a graveyard keeper, to be a cobbler, to be a meat seller, to be a cowherd, to be in politics, to participate in war, or to be a businessman.

There is no rule of thumb to live by merely performing the austerities and displaying their knowledge to others. They live with what the nature has to offee. Lord said in the Gita, 'Yadrichhalabha Santushto'. Dharmavyadha, Harishchandra and Sri Krishna are the same. They have no sense of wrong in the knowledge of the senses. They have the same sense of passion in both the knowledge of the senses and that of the self. These stalwarts are nothing but the forms of Srimata Herself.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Aug 2022

No comments:

Post a Comment