🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 235 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. మనిషి దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది. 🍀
ప్రతి మనిషి ప్రశాంతంగా జీవించాలనుకుంటాడు. అనుకున్నంత మాత్రాన ప్రశాంతంగా వుండలేడు. కొంత మంది శాంతి కోసం అరుస్తూ యుద్ధానికి సిద్ధపడతారు. శాంతి గురించి మాట్లాడుతూ ఆటంబాంబులు సిద్ధం చేస్తారు. ఇది చాలా చిత్రమయిన విషయం. మనుషులు అట్లాంటి వైరుధ్యాల్లో జీవిస్తారు. కారణం మంచి విషయాల గురించి కోరుకోవడం సులభం. వాటిని ఆచరణలోకి తేవడం పూర్తిగా భిన్నమైన విషయం. కలగనడం ఒక విషయం. కలని ఆచరణలోకి తేవడం మరొక విషయం. ఐనా కలలు కలలే. మేలుకొంటేనే అవి మాయమవుతాయి.
వాస్తవం వేరుగా వుంటుంది. మనిషిలో చీలిక ఏర్పడుతుంది. దేవుడి గురించి, శాంతి గురించి ప్రేమ గురించి కలగంటాడు. వాస్తవంలో యుద్ధానికి, వినాశనానికి, దౌర్జన్యానికి సిద్ధపడతాడు.నిజమైన శాంతి కాముకుడు. ఆంతరిక పరివర్తన గుండా సాగుతాడు. అప్పుడే స్వప్నం సాకారమవుతుంది. ధ్యానమొకటే పరివర్తనకు కారణమవుతుంది. దౌర్జన్యాన్ని ప్రేమగా పరివర్తిస్తుంది. అవి వేరు వేరు కావు. ఒక శక్తి. మన దగ్గర శక్తులున్నాయి. మనం ఎదగలేదు. ధ్యానం గుండానే అవి ఎదుగుతాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
03 Sep 2022
No comments:
Post a Comment