🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀
🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 2 🌻
శివునికి లోహితాక్షుడు అను నామము కలదు. అతను తపః స్వరూపుడు. అగ్ని స్వరూపుడు. అందువలన అతని కన్నులు ఎఱ్ఱ జీరతో నుండును. ఎఱ్ఱని కమలములు ఆయన కన్నులతో పోల్చ బడినవి. ఎఱ్ఱని ఆయన నయన కమలములకు తెల్లని చల్లని వెన్నెలను అందించునది శ్రీమాత. దానివలన శ్రీ శివునకు ఆహ్లాదము కలుగును. శివుడు తపస్వి అగుటచే అతనికి చల్లదనమును సమకూర్చుట తన ధర్మమని శ్రీమాత భావించునని కవి భావము.
స్త్రీ ఆహ్లాదమును కూర్చున దైనపుడు మాత్రమే పురుషుడు పరిపూర్ణ ఆనందమును పొందగలడు. చిట్టుబుట్టులాడు స్త్రీలు గృహశాంతిని, సంపదను హరించు చుందురు. స్త్రీలోకమునకు శ్రీమాత ఈ సందేశము ద్వారా పతివ్రతా ధర్మము నొకటి ఆవిష్కరించు చున్నది. ఈ కారణము గనే సీత, సావిత్రి, అనసూయ ఈ ధర్మమును పాటించిరి గనుక పతివ్రతలైరి. కార్తీక మాసము శివ తత్త్వమునకు ప్రతీక. అందలి వెన్నెల శ్రీమాతకు ప్రతీక.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻
🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 2 🌻
Lord Shiva has the name Lohitaksha, the fiery eyed. He is the embodiment of penance. Embodiment of fire. So his eyes are red tinge in them. Red lotuses are compared to His eyes. Srimata is the one who gives the white and cold moonlight to the red lotus like eyes of the Lord. That will please Lord Shiva. The poet feels that Srimata thinks it is her dharma to provide coolness to Lord Shiva, the embodiment of the fires of penance.
It is only when the woman brings bliss can a man attain complete happiness. Disturbed women destroy domestic peace and wealth. Through this message, Sri Mata is innovating a virtue of Pativrata to the world of women. This is the reason why Sita, Savitri and Anasuya followed this dharma and became celibates. The month of Kartika is symbolic of Shiva Tattva. It's moonlight symbolizes Srimata.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment