🌹 10 - OCTOBER అక్టోబరు - 2022 MONDAY సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 268 / Bhagavad-Gita -268 - 6వ అధ్యాయము 35 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 667 / Vishnu Sahasranama Contemplation - 667 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 629 / Sri Siva Maha Purana - 629 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 346 / DAILY WISDOM - 346 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 245 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹10, అక్టోబరు, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 2 🍀*
*3. ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |*
*శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోఽర్దనః*
*4. అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః |*
*ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఏకత్వ భావనను నిరంతరం సాధన చేయండి. 'మేమంతా ఒక్కటి, మేమంతా ఒక్కటి. మేము వేర్వేరనే భావం మాలో కలిగించడం దేనివలనా సాధ్యంకాదు. మేమంతా ఒక్కటి. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, శరద్ ఋతువు,
దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 25:40:59 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: రేవతి 16:03:01 వరకు
తదుపరి అశ్విని
యోగం: వ్యాఘత 16:42:02 వరకు
తదుపరి హర్షణ
కరణం: బాలవ 14:01:49 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 12:26:39 - 13:14:00
మరియు 14:48:42 - 15:36:03
రాహు కాలం: 07:36:39 - 09:05:26
గుళిక కాలం: 13:31:46 - 15:00:32
యమ గండం: 10:34:12 - 12:02:59
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:25
అమృత కాలం: 18:29:42 - 32:13:46
సూర్యోదయం: 06:07:52
సూర్యాస్తమయం: 17:58:05
చంద్రోదయం: 18:26:31
చంద్రాస్తమయం: 06:20:17
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మీనం
మతంగ యోగం - అశ్వ లాభం
16:03:01 వరకు తదుపరి రాక్షస
యోగం - మిత్ర కలహం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 268 / Bhagavad-Gita - 268 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 35 🌴*
*35. శ్రీ భగవానువాచ*
*అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |*
*అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||*
🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ గొప్పభుజములు కలిగిన కుంతీపుత్రా! చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులకష్టతరమైనను దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధింపవచ్చును.*
🌷. భాష్యము :
దృఢమైన మనస్సును నిగ్రహించుట యందలి కష్టమును గూర్చి అర్జునుడు పలికినదానిని శ్రీకృష్ణభగవానుడు అంగీకరించెను. కాని అట్టి కార్యము అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధ్యమగునని అదే సమయమున అతడు ఉపదేశించుచున్నాడు. అట్టి అభ్యాసమంగా నేమి? తీర్థస్థలమున కేగుట, మనస్సును పరమాత్మ యందు సంలగ్నము చేయుట, ఇంద్రియ మనస్సులను నిరోధించుట బ్రహ్మచర్యము పాటించుట, ఏకాంతముగా వసించుట వంటి కటిన నియమనిబంధనలను ఈ కాలమున ఎవ్వరును పాటించలేరు. కాని కృష్ణభక్తిభావన ద్వారా మనుజుడు నవవిధములైన భక్తిమార్గములందు పాల్గొనగలడు. అట్టి భక్తికార్యములలో ప్రప్రథమమైనది శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము. అది మనస్సును అన్నివిధములైన అపోహల నుండి ముక్తినొందించు దివ్యవిధానము. శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము అధికాధికముగా జరిగిన కొలది మనుడు అధికముగా జ్ఞానవంతుడై, కృష్ణుని నుండి మనస్సును దూరము చేయు సమస్తవిషయములందును వైరాగ్యమును పొందును.
కృష్ణపరములు కానటువంటి కార్యములు నుండి మనస్సును నిగ్రహించుట ద్వారా మనుజుడు వైరాగ్యమును సులభముగా నేర్వగలడు. భౌతికత్వము నుండి విడివడి, ఆధ్యాత్మికత యందే మనస్సు లగ్నమగుట యనెడి కార్యము వైరాగ్యమనబడును. వాస్తవమునకు నిరాకారతత్త్వములో వైరాగ్యమును పొందుట యనునది మనస్సును కృష్ణపరకర్మల యందు నియుక్తము చేయుట కన్నను మిక్కిలి కష్టమైనది. కనుకనే కృష్ణభక్తి ఆచరణీయమైన పద్ధతియై యున్నది. ఏలయన కృష్ణుని గూర్చి శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అప్రయత్నముగా పరతత్త్వమునందు అనురక్తుడగును. అట్టి పరతత్త్వానురాగమే “పరేశానుభవము” (ఆధ్యాత్మికసంతృప్తి) అనబడును. ఆకలిగొన్నవాడు తాను తిను ప్రతిముద్ద యందు తృప్తిని పొందుటతో ఈ ఆధ్యాత్మిక సంతృప్తిని పోల్చవచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 268 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 6 - Dhyana Yoga - 35 🌴*
*35. śrī-bhagavān uvāca*
*asaṁśayaṁ mahā-bāho mano durnigrahaṁ calam*
*abhyāsena tu kaunteya vairāgyeṇa ca gṛhyate*
🌷 Translation :
*Lord Śrī Kṛṣṇa said: O mighty-armed son of Kuntī, it is undoubtedly very difficult to curb the restless mind, but it is possible by suitable practice and by detachment.*
🌹 Purport :
The difficulty of controlling the obstinate mind, as expressed by Arjuna, is accepted by the Personality of Godhead. But at the same time He suggests that by practice and detachment it is possible. What is that practice? In the present age no one can observe the strict rules and regulations of placing oneself in a sacred place, focusing the mind on the Supersoul, restraining the senses and mind, observing celibacy, remaining alone, etc. By the practice of Kṛṣṇa consciousness, however, one engages in nine types of devotional service to the Lord. The first and foremost of such devotional engagements is hearing about Kṛṣṇa.
This is a very powerful transcendental method for purging the mind of all misgivings. The more one hears about Kṛṣṇa, the more one becomes enlightened and detached from everything that draws the mind away from Kṛṣṇa. By detaching the mind from activities not devoted to the Lord, one can very easily learn vairāgya. Vairāgya means detachment from matter and engagement of the mind in spirit. Impersonal spiritual detachment is more difficult than attaching the mind to the activities of Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 667/ Vishnu Sahasranama Contemplation - 667🌹*
*🌻667. బ్రాహ్మణః, ब्राह्मणः, Brāhmaṇaḥ🌻*
*ఓం బ్రాహ్మణాయ నమః | ॐ ब्राह्मणाय नमः | OM Brāhmaṇāya namaḥ*
*లోకానాం హి సమస్తానాం శ్రీవిష్ణుర్బ్రాహ్మణాత్మనా ।*
*కుర్వన్ ప్రవచనం వేదస్యాయం బ్రాహ్మణ ఉచ్యతే ॥*
*బ్రాహ్మణ రూపమున సమస్త లోములకును, సమస్త జనులకును వేద ప్రవచనము చేయుచు, వేదార్థమును తెలియ జేయుచు ఉండువాడు కావున బ్రాహ్మణః అనబడుచున్నాడు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 667🌹*
*🌻667. Brāhmaṇaḥ🌻*
*OM Brāhmaṇāya namaḥ*
लोकानां हि समस्तानां श्रीविष्णुर्ब्राह्मणात्मना ।
कुर्वन् प्रवचनं वेदस्यायं ब्राह्मण उच्यते ॥
*Lokānāṃ hi samastānāṃ śrīviṣṇurbrāhmaṇātmanā,*
*Kurvan pravacanaṃ vedasyāyaṃ brāhmaṇa ucyate.*
*In the form of the Brāhmaṇas, He expounds the Vedas to the whole world. So He is Brāhmaṇaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakrdbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 629 / Sri Siva Maha Purana - 629 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 11 🌴*
*🌻. బాణ ప్రలంబవధ - 2 🌻*
అపుడు ఆ పర్వతుడు కుమారస్వామి యొక్క ఆ వచనమును విని ఆనందించిన వాడై షణ్ముఖుడగు గుహుని స్తుతించి తన లోకమును చేరుకొనెను (12). ఓ మహర్షీ! అపుడు స్కందుడు మహేశ్వరుని ఆనందము కొరకు అచటనే పాపములను హరించు మూడు లింగములను యథావిధిగా స్థాపించెను (13). ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర అను నామములు గల ఆ లింగములు మూడు భక్తులకు సర్వ సిద్ధుల నిచ్చును (14). సర్వేశ్వరుడగు గుహుడు మరల జయస్తంభమునకు సమీపములో స్తంభేశ్వరుడను పేరు గల లింగమును ఆనందముతో స్థాపించెను (15).
అపుడు విష్ణువు మొదలగు దేవతలందరు అచట దేవదేవుడు, శూలధారి యగు శివుని లింగమును ఆనందముతో స్థాపంచిరి (16). ఆ శివలింగములన్నింటికి అద్భుతమగు మహిమ కలిగెను. వాటిని అర్చించు భక్తులకు కోర్కెలన్నియు ఈడేరుటయే గాక, మోక్షము కూడ లభించును (17). అపుడు విష్ణువుమొదలగు దేవతలందరు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై గుహుని ముందిడు కొని కైలాసమునకు ఆనందముతో వెళ్లుటకు సంకల్పించిరి (18). ఆ సమయములో శేషుని కుమారుడగు కుముదుడు రాక్షసులచే పీడింపబడినవాడై కుమారుని శరణు జొచ్చెను(19).
తారకుని అనుచరుడు, మిక్కిలి బలశాలియగు ప్రలంబాసురుడు ఈ యుద్ధము నుండి పారిపోయి మరియొక చోట ఉపద్రవమును కలిగించెను (20). అపుడు సర్పాధిపతి యగు శేషుని తనయుడగు కుముదుడు పార్వతీ తనయుడగు కుమారుని శరణు జొచ్చి స్తుతించెను (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 629🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 11 🌴*
*🌻 The Victory of Kumāra and the death of Bāṇa and Pralamba - 2 🌻*
12. On hearing the words of the lord, the delighted lord of the mountains eulogised Kumāra the slayer of his enemy and went back to his abode.
13. O sage, with great pleasure and observing the rules Skanda installed three phallic emblems of Śiva that quell all sins.
14. The first is called Pratijñeśvara, the second Kapāleśvara and the last Kumāreśvara. The three are capable of conferring all the achievements.
15. Thereafter Kumāra, the lord of all, joyously installed the phallic image Stambheśvara,[1] near the column of victory.
16. Then Viṣṇu and other gods joyously installed the phallic emblem of Śiva, the lord of the gods.
17. The glory of the phallic emblems of Śiva was marvellous, conferring all cherished desires and salvation to the devotees.
18. Then the delighted Viṣṇu and the gods desired to go to the chief of mountains joyously putting Bṛhaspati ahead.
19. Then Kumuda[2] the son of Śeṣa who was harassed by the Asuras came and sought refuge in Kumāra.
20. Another follower of Tāraka—Pralamba who had fled from the previous battle wrought great havoc with full force.
21. Kumuda, the great son of Śeṣa the lord of serpents, sought refuge in Kumāra the son of Pārvatī and eulogised him.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 346 / DAILY WISDOM - 346 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*
*🌻11. ప్రతి ఆలోచన ఒక సంపూర్ణ ఆలోచన🌻*
*జీవితం పరిపూర్ణం అవ్వాలంటే, మతపరమైన ఆరాధన మరియు ధ్యానం లౌకిక జీవితంలోకి ప్రవేశించి జీవితమంతా నిండాలి. నీటిలో నానబెట్టిన వస్త్రం దాని ప్రతి పోగు లో నీటిని గ్రహిస్తుంది. లౌకిక జీవితం మరింత వ్యవస్థీకృతమైన చైతన్య అనుభవానికి సోపానంగా మారాలి. ధ్యానం అంటే సంఘవిద్రోహ లేదా అసాంఘిక పద్ధతిలో ఉపసంహరణ అని అర్థం కాదు. ధ్యానం కంటే సహజమైనది మరొకటి ఉండదు.*
*ధ్యానం జీవితంలోని కొన్ని విధుల నుండి మానసికంగా మూసివేయబడాలని సూచించనవసరం లేదు. మనస్తత్వం అవిభాజ్యమైనది.ఇందులో తనకు తాను విరుద్ధంగా అనేక విభజనలు లేవు. మనస్సు ఏ విధమైన విభజనలు లేని ఒక ఏకత్వం. ప్రతి ఆలోచన పూర్ణమైన ఆలోచన. ఈ విధంగా, మనం ధ్యానంలోకి ప్రవేశించినప్పుడు, మొత్తం సంపూర్ణమైన మనస్సు, లౌకిక విషయాలతో అనుసంధానించబడిన అంశాలు కూడా ఉత్తేజితం చేయబడతాయి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 346 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*
*🌻11. Every Thought is a Whole Thought🌻*
*The spirit of religious worship and meditation has to saturate and seep into the secular life, if life is to become a healthy whole. Even as cloth soaked in water absorbs into its very fibre the whole of water, the apparently secular life has to become a living step to the more organised dimension of religious experience. Meditation need not necessarily mean a withdrawal in an antisocial or unsocial manner. Nothing can be more natural than meditation.*
*Meditation need not suggest the shutting oneself off psychologically from certain other functions of life. The psyche is a whole, a Gestalt, as they usually call it. It is not a partitioned house divided against itself. The psychological organ is a compact indivisibility. Every thought is a whole thought. Thus, when we enter into meditation, the entire psychic wholeness gets charged, even those aspects which are connected with the well-known secular engagements.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 245 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జీవితం పాఠశాల. మనం ఎంతో కొంత నేర్చుకోవటానికి యిక్కడున్నాం. అన్నిటికన్నా ముఖ్యం ఎట్లా పాడాలి, ఎట్లా నాట్యం చేయాలి, ఎట్లా ఆనందంగా వుండాలి అన్న విషయాలు తెలుసుకోవాలి. అవన్నీ ధ్యానం వల్లనే తెలుస్తాయి. ధ్యానం నీ నించీ ఆ శక్తుల్ని బహిర్గతం చేస్తుంది. 🍀*
*ధ్యానం లేని మనిషి హృదయంలో కవిత్వముండదు, సంగీతముండదు. ఉత్సవముండదు. అతనిలో వసంతం మొదలు కాదు. అతనిలో పూలు యింకా ఎదురు చూస్తూ వుంటాయి. అవింకా రూపొందవు. ఎదురుచూస్తాయి. అతనింకా వికసించడు. అతనిలో యింకా పరిమళం ప్రవహించదు. అతను విచ్చుకోని విత్తనం లాంటివాడు. అతను మేలుకోడు. తానేమిటో గ్రహించే స్పృహలో వుండడు. ఎట్లాంటి ఆనందం, పరవశం, నాట్యం లేకుండా సాధారణ జీవితం జీవిస్తాడు. జీవితాన్ని లాగుతూ వుంటాడు. జీవితం అతనికి భారంగా వుంటుంది. అట్లాగే లాగిస్తూ వుంటాడు. మరణమే అతనికి విశ్రాంతిగా భావిస్తాడు.*
*జీవితం పాఠశాల. మనం ఎంతో కొంత నేర్చుకోవటానికి యిక్కడున్నాం. అన్నిటికన్నా ముఖ్యం ఎట్లా పాడాలి, ఎట్లా నాట్యం చేయాలి, ఎట్లా ఆనందంగా వుండాలి అన్న విషయాలు తెలుసుకోవాలి. అవన్నీ ధ్యానం వల్లనే తెలుస్తాయి. ధ్యానం నీ నించీ ఆ శక్తుల్ని బహిర్గతం చేస్తుంది. నీ అస్తిత్వంలో వేల పూలు విచ్చుకుంటాయి. అప్పుడు మరణానంతరం స్వర్గం ఎంతో దూరంలో వుండదు. అప్పుడు స్వర్గం యిప్పుడు, యిక్కడ వుంటుంది. అప్పుడు అదే నిజమవుతుంది. అదే సత్యమవుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment