నిత్య ప్రజ్ఞా సందేశములు - 352 - 17. ధ్యానం అంటే . . . / DAILY WISDOM - 352 - 17. Meditation is . . .
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 352 / DAILY WISDOM - 352 🌹
🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀
📝. ప్రసాద్ భరద్వాజ్
🌻17. ధ్యానం అంటే నిజమైన మతాన్ని ఆచరించడం🌻
ఒకరు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, వారు నిజమైన మతాన్ని ఆచరిస్తున్నట్లు. కానీ, ఎవరైనా అలా చేయడం ద్వారా ఒక నిర్దిష్ట మతపరమైన తెగకు, వ్యవస్థకు చెందిన వారు కాదు. మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం మతపరంగా జీవిస్తాము, ఎందుకంటే మతం అనేది మనిషి మరియు దేవుని మధ్య, ఆత్మ మరియు సంపూర్ణత మధ్య ఉన్న సంబంధం. ఆ సంబంధాన్ని జీవితంలో ధృవీకరించడం మతం యొక్క లక్ష్యం. మతం అనేది ఒక దేవాలయానికి లేదా చర్చికి సంబంధించిన చర్య కాదు. ఇది భగవంతునితో ఒకరి చైతన్యం యొక్క సంబంధాన్ని అంతర్గతంగా అంగీకరించడం. ఆ భగవంతుడే అనేక రూపాలలో ఒక్కో మతంలో ఒక్కోలా వ్యక్తీకరించబడతాడు. మనం పవిత్రమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు, మనం నిజంగా దేవుని ఆలయంలో ఉంటాము.
మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, మనం దైవసన్నిధిలోనే ఉంటాము. దేవాలయం లేదా చర్చి అనేవి ప్రపంచంలోని అనుభావిక విషయాలు కంటే ఉన్నతమైన స్థానాన్ని ఆక్రమించే మతాన్ని సూచిస్తాయి. చర్చి ప్రపంచానికి చెందినది కాదు. ఇది లౌకికానికి పైన ఉండే ఒక ఒక దైవిక వృత్తి. ఆలయాలు ఉన్నత దైవీ విలువలతో, విషయాలతో నిండి ఉంటాయి. అక్కడ కూర్చున్న వారెవరూ ద్వంద్వాలకు చెందినవారు కాదు, దైవానికి చెందినవారు. ఈ ప్రపంచం దేశకాలాలకు లోబడి ఉంటుంది. ఈ పరిమితిని అధిగమించడమే మన ప్రయత్నం. ధ్యానంలో మాత్రమే ఒకడు నిజమైన మతస్థుడు అవుతాడు. ఇతర కార్యకలాపాలలో ఒకరు తిరిగి శారీరక వ్యక్తిత్వంలోకి జారిపోతారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 352 🌹
🍀 📖 from The Philosophy of Religion 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻17. Meditation is Practising True Religion🌻
When one is in a mood of meditation, one is practising true religion, but by so doing one does not belong to any particular religious cult. We live religion when we are in a state of meditation, because religion is the relation between man and God, between the soul and the Absolute. The affirmation of it in life is religion's aim. Religion is not the act of belonging to a creed, a temple, or a church. It is an inward acceptance of one's conscious relation with the Almighty, who presents Himself as the degrees of Deity in the different religions. When we are in a holy mood, we are really in the temple of God.
When we are in a state of meditation, we are in the church of Christ. The temple or the church is this very transcendence which is the spirit of religion that occupies a position superior to the empirical subjects and objects of the world. The church does not belong to the world. It is a divine occupation, lifted above the mundane. The temples are trans-earthly atmospheres which have in their precincts whatever is of value. Anyone seated there does not belong to sides or parties, but to the Divine Whole. This world is nothing but a spatio-temporal complex of subjects and objects. And our endeavour is to overcome this limitation. One becomes truly religious only in meditation. In other activities one sinks back into the bodily individuality.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment