శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 128 / Agni Maha Purana - 128 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 40
🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 2🌻
రెండు పదములపై నున్న పుష్పదంతుని కుశతృణములచేతమ, రెండు పదములపై నున్న వరుణుని పద్మముల చేతను, రెండు పదములపై నున్న అసురుని సురచేతను, ఒక పదముపై నున్న ఆదేశేషుని నేయి కలిపిన జలముచేతను. అర్ధపదముపై నున్న పాపమును యవాన్నముచేతను, అర్ధపదముపై నున్న రోగమును గంజిచేతను, ఒక పదముపై ఉన్న నాగమును నాగపుష్పము చేతను, రెండు పదములపై మన్న ముఖ్యుని భక్ష్యపదార్థముల చేతను, ఒక పదముపై నున్న భల్లాటుని పెసల అన్నముచేతమ, ఒక పదముపై ఉన్న సోముని తేనెతో కూడిన పాయసముచేతను, రెండు పదములపై నున్న ఋషిని శాలూకముచేతమ, ఒక పదముపై ఉన్న అదితిని లోపికచేతను, అర్థపదముపై నున్న దితిని పూరీలచేతను తృప్తిపరుపవలెమ.
ఈశాన్యదిశయం దున్న ఈశునికి క్రింద అర్ధపదముపై నున్న ఆవునిపాలచేతమ, క్రింద అర్ధపదముపై నున్న ఆపవత్సుని దధిచేతను తృప్తిపరుపవలెను. తూర్పున నాలుగు కోష్ఠములపై నున్న మరీచిని లడ్డూలచే తృప్తిపరుపవలెను. బ్రహ్మకు పై నున్న కోణమందు అర్ధపదముపై ఉన్న సావిత్రునకు రక్తపుష్పములు నివేదించవలెను. దాని క్రింద నున్న అర్ధకోణమునందున్న సవితకు కుశోదకము నాలుగు పదములపై ఉన్న వివస్వంతునకు రక్తచందనమును లీయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 128 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 40
🌻 The mode of making the respectful offering to the god - 2 🌻
8. The (two) door-keepers Sugrīva and Puṣpadanta occupying two squares (are worshipped) with barley grains and a clump of grass respectively, and Varuṇa with lotus flowers in a square.
9. The asura (demon) in two squares (is propitiated) with wine, (the serpent) Śeṣa in a square with ghee and water, the sin in half a square with barley grains, the disease in half a square with maṇḍaka (a kind of baked flour).
10. The Nāga (serpent) (is worshipped) in a square with the nāga flowers and the chief serpent in two squares with edibles The Bhallāṭa (a kind of superhuman being) (is worshipped) in a single square with rice mixed with kidney-bean, and the moon (with the same offering) in the next square.
11. The sage placed in two squares (is worshipped) with honey, sweat gruel and nutmeg, Diti in a square with anointments and Aditi in one and a half squares.
12. Āpas (is propitiated) in a square below in the northeast with milk and cake and then Apavatsa remaining in a square below with curd.
13. Marīci (is propitiated) in four squares in the east with balls of sweet-meat and for (the god) Savitṛ, the red flowers (are placed) in the lower aṅgular square.
14. In the square below that, water along with kuśa grass is offered to Savitṛ, red sandal paste is offered to Aruṇa in four squares.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment