శ్రీ మదగ్ని మహాపురాణము - 132 / Agni Maha Purana - 132
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 132 / Agni Maha Purana - 132 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 41
🌻. అథ శిలా విన్యాస విధి - 2🌻
ఆ ఘారము, ఆజ్యభాగము అను ఆహుతులను ప్రణవముతో చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ఎనిమిది అహుతులిచ్చి ''ఓం భూః స్వాహా'' ''ఓం భువః స్వాహా'' ''ఓం సువః స్వాహా'' అని మూడు వ్యాహృతులతో క్రమముగాలోకేశ్వరుడైన అగ్నికిని, సోమగ్రహమునకును, శ్రీ మహావిష్ణువునకును ఆహుతులర్పింపివలెను. పిమ్మట ప్రాయశ్చిత్తహోమముచేసి, ప్రణవయుక్తమగు ద్వాదశాక్షరమంత్రముతో మినుములు, ఘృతము, తిలలు కలిపి పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట ఆచార్యుడు పూర్వాభిముఖుడై, ఎనిమిది దిక్కులందు స్థాపించిన కలశములపై వేరువేరుగ పద్మాదిదేవతలను స్థాపించి పూజింపవలెను.
మధ్య యందు కూడ భూమి అలికి ఒక శిలను కలశమును స్థాపింపవలెను. ఈ తొమ్మిదికలశములపై ఈ క్రింద జెప్పిన దేవతలను స్థాపింపవలెను. పద్మ-మహాపద్మ-మకర-కచ్ఛప-కుముద-ఆనంద-పద్మ- శంఖములను ఎనిమిది కలశములపై స్థాపించి, పద్మినిని మధ్యనున్న కలశముపై స్థాపింపవలెను.
ఈ కలశలను కదపగూడదు., వాటి సమీపమున తూర్పునుండి ప్రారంభించి ఈశాన్యదిక్కువరకును ఒక్కొక్క ఇటుక ఉంచవలెను. వాటిపై వాటి దేవతలైన విమలమొదలగు శక్తులను స్థాపింపవలెను. మధ్య అనుగ్రహ అను దేవతలను స్థాపింపవలెను. పిమ్మట- ''మునిశ్రేష్ఠుడైన అంగిరసుని పుత్రియై ఓ ఇష్టకాదేవీ! నీ ఏ అవయవము కూడ విరుగలేదు. వికృతము కాలేదు, నీవు నీ సర్వాంగములతో పూర్ణమై యున్నావు. ఇపుడు నిన్ను నేను ప్రతిష్ఠంచుచున్నాను అని'' ప్రార్థింపవలెను. ఉత్తముడైన ఆచార్యుడు ఈ మంత్రముతో ఇష్టకాస్థాపనముచేసి, ఏకాగ్రచిత్తుడై మధ్యప్రదేశము నందు గర్భాధానము చేయవలెను.
దాని విధి-ఒక కలశముపై శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని స్థాపించి వారి సమీపమున మట్టి, పుష్పములు, ధాతువులు, రత్నములు ఉంచవలెను. పిమ్మట పండ్రెండు అంగుళముల వైశాల్యము, నాలుగు అంగుళముల ఎత్తగల, లోహాదినిర్మితమగు గర్భపాత్రలో అస్త్రపూజ చేయవలెను. పిమ్మట కమలాకారమగు తామ్రపాత్రలో పృథివిని పూజించి ఈ విధముగ ప్రార్థింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 132 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 41
🌻 Mode of performing consecration - 2 🌻
10. The primary offering and the offering with clarified butter should be done with the syllable oṃ. Then subsequently eight offerings and again eight offerings with clarified butter (should be offered) with the syllables (known as) vyāhṛtis[11] duly.
11. After that offer oblation (in the fire) to the gods, Agni, Soma and Puruṣottama separately with vyāhṛtis.
12-13. The preceptor (officiating at the rite) should do the expiatory rite facing the eastern quarter offering to the image, meat, and sesamum along with ghee separately in the pitchers with the vedic syllables or the mystic formula of twelve syllables. Having scattered (sesamum) in the eight directions a stone and a pitcher should be placed at the centre and the following divinities (should be invoked) in order.
14. Padma[12], mahāpadma, makara, kacchapa, kumuda, nanda, padma, śaṅkha and padminī (are the divinities).
15. The pitchers should not be moved. Eight bricks should be placed in them duly beginning with the eastern direction and ending with the north-east.
16. The female energies Vimalā and others, the presiding deities of these bricks, should be invoked in their proper pitchers. The energy Anugraha should be invoked at the central pitcher.
17. “O perfect, unbroken, full-bodied brick, the daughter of the sage Aṅgiras, I am establishing you. You grant me the desired thing.”
18-20. The preceptor, having placed the brick with this mystic syllable should do garbhādhāna[13]. Having invoked the goddess Padminī at the central pitcher, earth, flowers, minerals, gems, and iron pieces as well as the weapons of deities of quarters (should be placed) in the hole of twelve fingers’ width and four fingers’ depth.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment