శ్రీ మదగ్ని మహాపురాణము - 135 / Agni Maha Purana - 135


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 135 / Agni Maha Purana - 135 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 42

🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 1🌻


హయగ్రీవుడు పలికెను. - ఇపుడు సర్వసాధారణమైన దేవాలయమును గూర్చి చెప్పదను, వినుము, దేవాలయమును నిర్మింపదలచిన విద్వాంసుడు, నలుపలకలగా ఉన్న క్షేత్రమును పదునారు భాగములుగా విభజింపవలెను. వాటిలో మధ్యనున్న నాలుగు భాగములతో ఆయముతో కూడిన గర్భమును నిశ్చయించి, మిగిలిన పండ్రెండు భాగములను గోడల నిమిత్తము నిర్ణయించుకొనవలెను. పై పండ్రెండు భాగములలో నాలుగు భాగముల పొడవు ఎంత ఉండునో, గోడల ఎత్తు అంత ఉండవలెను. శిఖరము ఎత్తు గోడల ఎత్తునకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తు దేవాలయపరిక్రమ ఎత్తు ఉంచవలెను. రెండు పార్శ్వములందును ఉన్న మార్గముల (ద్వారముల) కొలత ఈ కొలతను బట్టియే ఉండవలెను.

ఆ ద్వారములు సమాన ప్రమాణములై ఉండవలెను. ఆలయము ఎదుటనున్న ప్రదేశము విస్తారము కూడ శిఖరముతో సమానముగా ఉండవలెను. అందముగా ఉండుటకై దాని విస్తారము శిఖతము కంటె రెటింపు ఉండునట్లు కూడ చేయవచ్చును. ఆలయము ఎదుటనున్న సభామండపము విస్తారము, గర్భసూత్రమునకు రెట్టింపు ఉండవలెను. దేవాలయ పాద స్తంభముల పొడవు గోడపొడవుతో సమముగా ఉండవలెను, వాటికి మధ్య స్తంభముల మర్చి అందముగా ఉండు నట్లు చేయవలెను. ముఖమండప ప్రమాణము ఆలయ గర్భ ప్రమాణముతో సమముగా నుండవలెను. పిమ్మట ఎనుబది ఒక్కపదముల వాస్తు మండపమును ఆరంభింపవలెను.

మొదట ద్వారన్యాసము దగ్గరనున్న పదములలో ఉండు దేవతలను పూజింపవలెను. పిమ్మట ప్రాకారవిన్యాసము దగ్గరనున్న దేవతలను, అంతమునందు పదములందు స్థాపింపబడిన ముప్పది ముగ్గురు దేవతలను పూజింపవలెను. ఇది ప్రాసాదముల సర్వసాధారణ లక్షణము. ఇపుడు ప్రతిమా మానాను సారముగ నిర్మించు ఇతర ప్రాసాదములను గూర్చి వినుము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 135 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 42

🌻 Construction of a temple - 1 🌻

Hayagrīva said:

1. Listen to me describing the construction of a temple in general. A wise man should divide a square ground into sixteen parts.

2. One should make the four central squares endowed with. wealth. The other sixteen parts are left for the walls.

3. The pedestal should extend over four squares. The length of the cornice should be double that of the pedestal.

4. The path of circumambulation should be a quarter of (the length) of the cornice. Two equal openings having the same width as the latter, should be left on the two sides for projections

5. The extent of the ground should be made at first equal to the length of the tower or twice that such as it may be beautiful.

6- 7. One should construct the pavilion in front of the sanctum on the lines running parallel through the sides of its inner chamber, adorned with pillars and being of the same length or longer than the principal temple sanctorum by a quarter of its length. The anti-chamber should then be constructed at 81 steps.

8. The deities at the end of the base should be worshipped before placing the parrots at the front door. In the same manner the thirty-two gods at the end should be worshipped when the outer wall is raised.

9. This is the characteristic of a temple in general. Listen to the description (of raising) a temple proportionate to the (size of the) image.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment