🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 362 / DAILY WISDOM - 362 🌹
🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀
📝. ప్రసాద్ భరద్వాజ్
🌻27. నేను సందేహిస్తున్నాను అని నేను సందేహించలేను🌻
భారతదేశపు గొప్ప తత్వవేత్త అయిన శంకరాచార్యులు, మరియు ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్త అయిన రెనే డెస్కార్టెస్, స్వయం యొక్క స్వభావం గురించి వేర్వేరు సమయాల్లో ఒకే విధంగా ఆలోచించారు. దానిలో ఒకరి స్వీయ ఉనికిని అనుమానించడం అసాధ్యంగా పరిగణించబడింది, ఎందుకంటే సంశయవాదం, బయటి విషయాల స్వభావానికి అన్వయించవచ్చు కానీ సంశయవాది స్వయంగా వచ్చిన తీర్మానాలకు వర్తించదు. అంటే, ప్రతి దానిని అనుమానించడం కూడా సంశయవాది ఒక ఖచ్చితత్వంతో చేస్తాడు. సందేహాస్పద వాదన యొక్క ముగింపులు ఇతర విషయాలకు సంబంధించిన అదే సంశయవాదానికి లోబడి ఉండవు.
'నేను అనుమానిస్తున్నానని నేను సందేహించ లేను.' ఇది చివరకు ఒక ప్రాథమిక ముగింపు. ఒక వ్యక్తి ప్రతి దానిని అనుమానించ గలడు కానీ తను అనుమానిస్తున్నాడు అనే దానిపై అనుమానం కలిగి ఉండడు. ఎందుకంటే సందేహించే వారు, వారినే అనుమానించు కున్నట్లయితే, అలాంటి సందేహానికి అర్ధం ఉండదు. సాధారణ మనుగడలోని విషయాల పట్ల ఉన్న పట్టును తార్కిక విశ్లేషణలో ధిక్కరించే మనిషిలో కొంత ప్రత్యేకత ఉంది. చాలా మంది భారతీయ తత్వవేత్తలు చివరకు తీసుకున్న వైఖరి ఇదే. ఈ రహస్యం, అన్ని ప్రకృతి రహస్యాలను ఛేదిండానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. ఈ 'నేను ఉన్నాను,' లేదా 'నేను ఉనికిలో ఉన్నాను' అనేవి ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు. ఇది తిరస్కరించ లేనిది మరియు తప్పుపట్టలేని జ్ఞానం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 362 🌹
🍀 📖 from The Philosophy of Religion 🍀
📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj
🌻27. I Cannot Doubt that I am Doubting🌻
The great philosopher of India, Acharya Sankara, and another reputed philosopher of the West, Rene Descartes, thought on equal terms at different times in regard to the nature of the self. The doubting of the existence of one's own self has been regarded as impossible, because scepticism, while it can be applied to the nature of things outside, cannot be applied to the conclusions arrived at by the sceptic himself. The doubting of everything is an acceptance of the doubtless position which the sceptic maintains. The conclusions of a sceptical argument are not subject to the very same scepticism to which other things are subject.
“I cannot doubt that I am doubting.” This is the basic conclusion one finally lands upon. One can doubt everything but cannot doubt that one is doubting, because if one doubts the doubting, such doubting would have no sense. There is some peculiarity in man which defies the grasp at ordinary logical analysis. And this was the stand taken finally by most of the Indian philosophers. This mystery, this secret, may form the key to unlock the secrets of all nature. This “I am,” or “I exist” is uncontradictable, undeniable, and is infallible knowledge.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment