1) 🌹 01, JANUARY 2023 SUNDAY, ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. నూతన సంవత్సర 2023 శుభాకాంక్షలు Happy New Year 2023 🍀
2) 🌹 కపిల గీత - 112 / Kapila Gita - 112 🌹 సృష్టి తత్వము - 68
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 704 / Vishnu Sahasranama Contemplation - 704 🌹 🌻704. శూరసేనః, शूरसेनः, Śūrasenaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 665 / Sri Siva Maha Purana - 665 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 3 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 3 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 286 / Osho Daily Meditations - 286 🌹 🍀 286. ఎప్పుడైనా, ఏ ప్రదేశంలోనైనా / ANY TIME, ANY PLACE 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 1 🌹 🌻 422. 'సంధ్యా' - 1 / 'Sandhya' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹01, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ఆంగ్ల నూతన సంవత్సరం, English New Year🌻*
*🍀. సూర్య మండల స్త్రోత్రం - 2 🍀*
2. యన్మండలం దీప్తికరం విశాలం |
రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ 2
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : శుద్ధత్వం సాధించడానికి మనం తొలుత మన యందలి పురుష చేతనలో సుప్రతిష్ఠితులం కావాలి. పురుషుడు నిత్య శుద్ధుడు. ఆ శుద్ధత్వంలో మనం నెలకొన్న తరువాత మన యందలి ప్రకృతి క్రమంగా దానంత టదే శుద్ధం కావడం మొదలు పెట్టుతుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల-దశమి 19:13:54 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: అశ్విని 12:50:12 వరకు
తదుపరి భరణి
యోగం: శివ 07:23:10 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: తైతిల 06:48:15 వరకు
వర్జ్యం: 08:38:40 - 10:18:48
మరియు 23:03:00 - 24:45:20
దుర్ముహూర్తం: 16:23:54 - 17:08:21
రాహు కాలం: 16:29:27 - 17:52:48
గుళిక కాలం: 15:06:06 - 16:29:27
యమ గండం: 12:19:24 - 13:42:45
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 05:18:24 - 06:58:32
సూర్యోదయం: 06:45:58
సూర్యాస్తమయం: 17:52:48
చంద్రోదయం: 13:38:41
చంద్రాస్తమయం: 01:48:15
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ఆనంద యోగం - కార్య సిధ్ధి
12:50:12 వరకు తదుపరి కాలదండ
యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀. నూతన సంవత్సర 2023 శుభాకాంక్షలు Happy New Year 2023 🍀
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 112 / Kapila Gita - 112🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 68 🌴*
*68. క్షుత్తృద్భ్యాముదరం సింధుర్నోదతిష్ఠత్తదా విరాట్|*
*హృదయం మనసా చంద్రో నోదతిష్ఠత్తదా విరాట్|*
*సముద్రుడు ఆకలిదప్పులతో గూడి ఉదరమునందు ప్రవేశించెను. కాని, ఆ విరాట్పురుషుడు మేల్కొనలేదు. చంద్రుడు మనస్సుతో గూడి హృదయము నందు ప్రవేశించెను. కాని, ఆ విరాట్పురుషుడు మేల్కొనలేదు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 112 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 68 🌴*
*68. kṣut-tṛḍbhyām udaraṁ sindhur nodatiṣṭhat tadā virāṭ*
*hṛdayaṁ manasā candro nodatiṣṭhat tadā virāṭ*
*The ocean entered His abdomen with hunger and thirst, but the Cosmic Being refused to rise even then. The moon-god entered His heart with the mind, but the Cosmic Being would not be roused.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 704 / Vishnu Sahasranama Contemplation - 704🌹*
*🌻704. శూరసేనః, शूरसेनः, Śūrasenaḥ🌻*
*ఓం శూరసేనాయ నమః | ॐ शूरसेनाय नमः | OM Śūrasenāya namaḥ*
*హనుమత్ ప్రముఖా శ్శౌర్యశాలినో యత్ర సైనికాః ।*
*సా శూరసేన యస్య స శూరసేన ఇతీర్యతే ॥*
*హనుమంతుడు మొదలగు శౌర్యశాలురైన సేనాప్రముఖులు ఏ సేనయందు కలరో అట్టి సేన శూరసేన. అట్టి శూరయగు సేన ఎవనికి కలదో అట్టివాడు శూరసేనః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 704🌹*
*🌻704. Śūrasenaḥ🌻*
*OM Śūrasenāya namaḥ*
हनुमत् प्रमुखा श्शौर्यशालिनो यत्र सैनिकाः ।
सा शूरसेन यस्य स शूरसेन इतीर्यते ॥
*Hanumat pramukhā śśauryaśālino yatra sainikāḥ,*
*Sā śūrasena yasya sa śūrasena itīryate.*
*The army that has valiant commanders like Hanumān is called Śūrasena. He who has got such Śūrasenas is Śūrasenaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥
సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥
Sadgatissatkrtissattā sadbhūtissatparāyaṇaḥ,Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 665 / Sri Siva Maha Purana - 665 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*
*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 3 🌻*
అపుడు గణేశుడు లేచి శివునకు, పార్వతికి, నాకు విష్ణువునకు (18), మరియు నారదాది బుషులందరికీ నమస్కరించి వారి ఎదుట నిలబడి ఇట్లు పలికెను : నా అపరాధమును మన్నించుడు. ఇట్టి అభిమానము (అహంకారము) ను కలిగియుండట మానవుల లక్షణము (19). నేను, శంకరుడు మరియు విష్ణువు అనే త్రిమూర్తులు ఉత్తమ వరములనిచ్చి ఒక్క సారిగా ప్రీతితో నిట్లు పలికితిమి (20). త్రిమూర్తులమగు మేము మల్లోకములలో ఎట్లు పూజింప బడుచున్నామో, అదే విధముగా సర్వులు ఈ గణనాథుని కూడా పూజించెదరు గాక! (21)
మేము ప్రకృతి నుండి పుట్టితిమి. ఇతడు కూడా ప్రకృతి నుండి పుట్టినాడు గాన నిశ్చయముగా పూజ్యుడు. గణేశుడు విఘ్నములను పారద్రోలి, కొర్కెలనన్నిటినీ ఈడేర్చును (22). మానవులు ముందుగా ఇతనిని పూజించి తరువాత మమ్ములను పూజించవలెను. ఇతనిని పూజించనిచో, మలో ఎవ్వరినైననూ పూజించినట్లు గాదు (23).
ఇతనిని పూజించకుండగా ఇతర దేవతలను పూజించినచో, ఆ ఫలము లభించదు. ఓ దేవతలారా! ఈ విషయములో సందేహించకుడు (24). ఇట్లు పలికి ముందుగా శివుడు, తరువాత విష్ణువు ఆ గణేశుని ఆదరముగా అనేక వస్తువలతో పూజించిరి (25).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 665🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*
*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 3 🌻*
18-19. Getting up and bowing to Śiva, Pārvatī, Viṣṇu and me, Gaṇeśa stood in front of Nārada and other sages and said—“My guilt shall be forgiven. Arrogance is the characteristic of Man’s nature.”
20. We three Śiva, Viṣṇu and I said to the gods simultaneously with pleasure, after granting him excellent boons
21. “O great gods, just as we three are worshipped in all the three worlds, so also he shall be worshipped by all of you.”
22. We are the offsprings of primordial nature. He is also the same and hence worthy of worship. He is the remover of all obstacles and the bestower of the fruits of all rites.
23. He shall be worshipped first and we shall be worshipped afterwards. If he is not worshipped, we too are not worshipped.
24. If the other deities are worshipped when he is not worshipped, the fruit of that rite will be lost. There is no doubt in this matter.
25. After saying this we worshipped him. Śiva worshipped Gaṇeśa with various articles of worship. Viṣṇu worshipped him afterwards.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 286 / Osho Daily Meditations - 286 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 286. ఎప్పుడైనా, ఏ ప్రదేశంలోనైనా 🍀*
*🕉. ధ్యానానికి సమయం లేదా ప్రదేశంతో సంబంధం లేదు. బదులుగా, ఇది మీతో, మీ అంతర్భాగానికి సంబంధించినది. కాబట్టి మీరు రోజువారీ దినచర్య నుండి విముక్తి పొందినప్పుడల్లా, విశ్రాంతి తీసుకోండి మరియు అది జరిగేలా అనుమతించండి. ఇది ఏ ప్రదేశంలోనైనా, ఎప్పుడైనా జరగవచ్చు, ఎందుకంటే ఇది తాత్కాలికమైనది మరియు పరిమితమైనది కాదు. 🕉*
*సరైన ధ్యానానికి పరిమితి, సమయం అంటూ లేదు. అది నిరంతరం జరుగుతోంది. నెమ్మది, నెమ్మదిగా ఆ ప్రవాహం మరింత స్పృహలోకి వస్తుంది. ఎప్పుడైనా మీరు ఏమి చేస్తున్నారో అది ఉపరితలంపై ఉంటుంది; కానీ లోతుగా, అంతర్వాహినిగా నది ప్రవహిస్తూనే ఉంటుంది. సమాజంలో కూడా, అన్ని రకాల అలజడులతో చుట్టుముట్టబడి ఉన్నప్పటికీ, అంతరంలో మీరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని అవమానించి నప్పుడు, మిమ్మల్ని కించపరిచి నప్పుడు, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా, మీ స్వయంలో లోతైన ప్రశాంతత ఉంటుంది.*
*మూలం ఎప్పుడూ కలవరపడకుండా ఉంటుంది. వెయ్యి, ఒకటి అపశ్రుతులు ఉన్నప్పటికీ కేంద్రంలో ఏదీ చెదిరిపోదు. కానీ ఈ ధ్యానం మనస్సు ద్వారా నిర్వహించ బడదు; అది హృదయం ద్వారా మాత్రమే అనుమతించ బడుతుంది. క్షణంలో ధ్యానం ఉంది. - ఇది ఇక్కడ ఎప్పుడూ ఉంది! అది జరగడానికి మీరు ఏమీ చేయరు; అది దానంతట అదే జరుగుతోంది. ఈ క్షణంలో సమయం లేదు. ఈ క్షణంలో మీరు రవాణా చేయబడతారు. ఈ క్షణంలో మీరు ఆ నిశ్శబ్దాన్ని, ఆ ప్రశాంతతను, ఆ పరమార్థాన్ని అనుభవించవచ్చు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 286 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 286. ANY TIME, ANY PLACE 🍀*
*🕉. Meditation has nothing to do with time or place. Rather, it has something to do with you, your inner space. So whenever you are free of the day-to-day routine, relax and allow it to happen. It can happen any place, any time, because it is nontemporal and nonspatial. 🕉*
*The right meditation knows no limitation, and slowly, slowly the flow becomes more and more conscious. Then whatever you are doing remains on the surface; deep down, the river goes on flowing. Even in the marketplace, surrounded by all kinds of turmoil, you are utterly silent. Even when somebody is insulting you, offending you, trying to provoke you, deep down there is a calmness; something remains undisturbed.*
*Even when there are a thousand and one distractions, at the center nothing is distracted. But that meditation cannot be managed by the mind; it can only be allowed by the heart. This moment is meditation--it is here! You have not done anything for it to happen; it is happening on its own. In this moment there is no time. In this moment you are transported. In this moment you can feel that quiet, that serenity, that transcendence.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 422 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 422. 'సంధ్యా' - 1🌻*
*పగలు రాత్రి కానిది, రెంటినీ సంధి జేయునది సంధ్య. ఆమె శ్రీమాతయే. దైవ ధ్యానమునకు గాని, దైవ జ్ఞానమునకు గాని, దైవమును చేరుటకు గాని ఉత్తమోత్తమ కాలము సంధ్య. రాత్రింబవళ్ళను సంధించును. ఇహపరములను సంధించును. జ్ఞానా జ్ఞానములను సంధించును. విరుద్ధమగు విషయములను సంధించి సమన్వయించుట విశేషమగు యోగశక్తి. జీవాత్మ పరమాత్మలను కూడ అట్లే సంధించి సమన్వయ పరచును.*
*లోకముల నడుమ, కాలముల నడుమ, ఆద్యంతముల నడుమ - అన్నింటికినీ నడుమ నుండునది. పగలు రాత్రి నడుమ సంధ్య యున్నది. రాత్రి పగలు నడుమ సంధ్య యున్నది. శుక్ల పక్షము-కృష్ణ పక్షము నడుమ, మరియు కృష్ణ పక్షము-శుక్ల పక్షము నడుమ కూడ యున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 422 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 422. 'Sandhya' - 1🌻*
*The one which is neither day nor the night, dusk, it is the union of both. It is Srimata. Dusk is the best time for divine meditation, divine knowledge and to reach God. Unites day and night. Unites self and non self. Unites Knowledge and ignorance. It is a remarkable yogic power to bring together and harmonize conflicting things.*
*Similarly, She unites and harmonizes Jivatma and Paramatma. She stays between the worlds, between day and night, between the ages- in the midst of all. There is twilight in the middle of the day and night. There is twilight in the middle of night and day. There is also a Twilight zone between the fullmoon cycle and newmoon cycle and vice versa.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment