శ్రీ మదగ్ని మహాపురాణము - 141 / Agni Maha Purana - 141
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 141 / Agni Maha Purana - 141 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 43
🌻. ఆలయ ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనము - 4🌻
''సమస్తప్రాణులకును వాసస్థానమైన వాడును, సర్వవ్యాపకుడును సర్వస్రష్టయు, విశ్వరూపుడును, స్వప్నాధివతియు అగు శ్రీహరికి నమస్కారము దేవా! దేవేశ్వరా! నేను నీసమీపమున నిద్రించుచున్నాను నా మనస్సులో ఏకార్యములను సంకల్పించితినో వాటి విషయమున నాకంతయు తెలుపుము'' ఇట్లు ప్రార్థించి ''ఓం ఓం హ్రూంఫట్ విష్ణవే స్వాహా'' అను మంత్రమును జపించి నిద్రించగా శుభస్వప్నము వచ్చినచో శుభము కలుగును.
చెడు స్వప్నము వచ్చినచో నరసింహ మంత్రముచే హోమము చేయగా శుభమే కలుగును. ఉదయమున లేచి, అస్త్ర మంత్రముతో శిలపై అర్ఘ్యమీయవలెను. పిమ్మట అస్త్రపూజ చేయవలెను. గునపము, టంకము మొదలగు అస్త్రముల ముఖమును అతనికి చూపవలెను.
శిల్పి ఇంద్రియ నిగ్రహవంతుడై, టంకము చేతగైకొని ఆ శిలను చతురస్రముగా నుండునట్లు చేయవలెను. పిమ్మట పిండిన చేయుటకై దానిని కొంచెము చిన్నది చేయవలెను. పిమ్మట ఆ శిలకు వస్త్రము చుట్టి, రథముపై ఉంచి, శిల్పా శాలకు తీసికొని వచ్చి, మరల దానికి పూజ చేయవలెను. పిమ్మట ప్రతిమ నిర్మింపవలెను.
అగ్ని మహాపురాణమునందు ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనమను నలుబదిమూడవ అధ్యాయము సమాస్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 141 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 43
🌻 Installation of deities in the temples - 4 🌻
23. “Oṃ! salutations to (Lord) Viṣṇu, the omnipresent, Prabhaviṣṇu (Viṣṇu) (strong), the universe, and Salutations to the lord of dreams.”
24. “O Lord of lords! I have slept by your side. (Instruct me) in my dreams (how to execute) all the works I have in my mind.”
25. “Oṃ Oṃ! hrūṃ phaṭ viṣṇave svāhā! When the dream (is) good, everything (will also be) good. If it is bad, it becomes good by the performance of the siṃhahoma[2]. Having offered reverential waters to the stone in the morning, the implements should be worshipped with (the sacred syllables) (for the worship of) implements.
26. The spades and chisels should have their edges besmeared with honey and clarified butter. (The priest) should think himself as Viṣṇu and the sculptor as Viśvakarman (the divine architect).
27-28. The implement which is of the form of Viṣṇu should be given (to the sculptor) and its face and back should be shown. Having cut a square block of the stone with controlled senses and holding a chisel, the sculptor should make a smaller one for the purpose of the pedestal. Having placed (them) in a chariot and brought to the workspot together with the cloth (one who) makes the image after having worshipped (the form conceived), is a sculptor.
22. Being informed thus (these beings) go to another place in good cheer and satisfied. Having eaten the sacrificial porridge along with the sculptors, he should repeat in the night the following sacred syllables (inducing) sleep.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment