శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 -2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 418 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 418 -2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🌻 418. 'జడశక్తిః' - 2🌻


చైతన్య శక్తిని క్రమముగ ఉపసంహరించుచూ ఎనిమిది రకములుగ ప్రకృతి ఎనిమిది పొరల పదార్థము నేర్పరచును. అహంకారము నుండి భౌతిక దేహము వరకూ క్రమముగ పదార్థము జడమగు చుండును. త్రిగుణములు, పంచభూతములతో కూడిన దేహ మేర్పడి అందు జీవుడు వసించుటకు వీలుపడును. జీవుడు చైతన్య స్వరూపుడు. అతనిని ఆవరించియున్న అష్ట ప్రకృతులు క్రమముగ జడములగును. ఇందు ఒక్కొక్క ఆవరణ యందు మరల ఏడు పొరలున్నవి. భౌతిక దేహమున కూడ శుక్రము నుండి ఎముకల వరకు ఏడు ధాతువుల శరీరమున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 418 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻

🌻 418. 'Jadashaktih' - 2🌻


By gradually withdrawing the consciousness, nature forms eight layered matter in eight different ways. From the ego to the physical body, the matter becomes gradually more inert. A body composed of trigunas and panchabhutas enables the spirit to reside in it. The spirit is the embodiment of consciousness. The eight prakritis surrounding him become gradually inert as they go. There are again seven layers in each enclosure. The physical body also has a body of seven elements from generative tissues to the bones.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment