శ్రీ మదగ్ని మహాపురాణము - 147 / Agni Maha Purana - 147


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 147 / Agni Maha Purana - 147 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 44

🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 6🌻

పాదముల విస్తారము అరంగుళములు, గుహ్యకము మూడు అంగుళములు, పంజా ఐదు అంగుళములు ఉండవలెను. పాదముల బొటనవ్రేలు వెడల్పుగా ఉండవలెను. మిగిలిన వ్రేళ్ళ మధ్య భాగవిస్తారము క్రమముగా మొదటి వ్రేలు ఎనిమిదవ భాగము తక్కువగా ఉండవలెన. బొటన వ్రేలు ఎత్తు ఒకటిన్నర అంగుళము లుండవలెను, దీని గోరు ప్రమాణమును మిగిలిన వ్రేళ్ళ ప్రమాణము కంటె రెట్టింపు ఉంచవలెను. రెండవ వ్రేలి గోరు విస్తారము అర అంగుళము, ఇతరమైన వ్రేళ్ళ గోరు విస్తారము క్రమముగా కొంచెకొంచెము తగ్గించవలెను. అండకోశములు రెండును మూడేసి అంగుళముల పొడవు, లింగము నాలుగు అంగుళములు ఉండవలెను, దానిపై భాగము నాలుగు అంగుళము లుండవలెను.

అండకోశములు పూర్తి తిరుగుడు ఆరేసి అంగుళములు. ఇంత మాత్రమేకాక దేవతా ప్రతిమను సకల భూషణములతో అలంకరించవలెను. ఈ విధముగా సంక్షిప్తముగ లక్షణము చెప్పబడినది. ఇదే విధముగ లోకములో కనబడు ఇతర లక్షణములను కూడ దృష్ణిలో నుంచుకొని, ప్రతిమపై అలక్షణములను నిర్మింపవలెను. పైకుడి చేతిలో చక్రము, క్రింది దానిలో పద్మము, పై ఎడమచేతిలో శంఖము క్రింది దానిలో గద ఉంచవలెను. ఇవి వాసుదేవ శ్రీకృష్ణుని చిహ్నములు గాన ఆప్రతిమ యందు మాత్రమే ఉంచవలెను. భగవంతుని సమీపమున హస్తమునందు కమలము ధరించిన లక్ష్మిని, వీణను ధరించి యున్న పుష్టిదేవిని నిర్మించవలెను.

ఈ ప్రతిమల ఎత్తు భగవత్ప్రతిమ తొడల ఎత్తు ఉండవలెను. ప్రభామండములో ఉన్న మాలధర-విద్యాధరుల విగ్రహము కూడ స్థాపింపవలెను. ప్రభను ఏనుగు మొదలైన వాటితో అలంకరింపవలెను. భగవచ్చరణముల క్రింద భాగమును (పాదపీఠమును) పద్మాకారమును నిర్మింపవలెను. ఈ విధముగ దేవ ప్రతిమలకు పై చెప్పిన లక్షణము లుండునట్లు కూర్చవలెను.

అగ్ని మహాపురాణమునందు వాసుదేవ ప్రతిమా లక్షణమను నలుబది నాల్గవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 147 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 44

🌻Characteristics of the image of Vāsudeva - 6 🌻


41. The front (part) of the ankles should be four aṅgulas The extent of the feet should be three kalās. The generative organ should be three aṅgulas.

42. Its girth (should be) five aṅgulas. The fore-finger (should be) of same length. The other fingers are duly lesser by one part of eighth.

43. The height of the toe is said to be one and a half aṅgulas. The nail of the two should be made twice that.

44. (Those of other fingers) should be gradually made half aṅgula less than the previous. The scrotum should be three aṅgulas (long). The generative organ (should be) four fingers (long).

45. The girth of the upper part of the pouch should be made (to be) four aṅgulas. The girth of the scrotum is said to be six aṅgulas.

46. The image should be adorned with ornaments. This is the exact description of details. The features (of the deities) should be made in this world, as described.

47. A disc on the (upper) right hand, and a lotus on the lower (right hand), the conch on the (upper) left hand, the mace on the lower (left hand) are to be placed according to the characteristic of Vāsudeva.

48-49. (The images of) Śrī and Puṣṭi should be made carrying a lotus and a harp respectively in their hands, (their images) reaching upto the thighs (of that of Vāsudeva). Then the two Vidyādharas (a class of semi-divine beings) holding the garlands (in their hands) should be made in the halo of the principal image). The halo (should also) be decked with the (images) of (celestial) elephants. The pedestal should be radiant like a lotus on which the images (should be worshipped) as follows.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment