🍀 25 - DECEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 25 - DECEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 25 - DECEMBER - 2022 SUNDAY, ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 301 / Bhagavad-Gita -301 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -21వ శ్లోకము.
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 662 / Sri Siva Maha Purana - 662 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 013 / DAILY WISDOM - 013 🌹 13. ఉనికే సత్యం - Being is Truth 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 278 🌹
6) 🌹. శివ సూత్రములు - 15 / Siva Sutras - 15 🌹. 5. ఉద్యమో భైరవః - 2 / 5. Udyamo bhairavaḥ - 2

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹25, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : క్రిస్టమస్‌, Christmas, త్రిపుష్కర యోగం Tripushkara Yogam🌻*

*🍀. సూర్య మండల స్త్రోత్రం - 1 🍀*

*నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే*
*సహస్రశాఖాన్విత సంభవాత్మనే |*
*సహస్రయోగోద్భవ భావభాగినే*
*సహస్రసంఖ్యాయుధధారిణే నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మరణానికి భయపడ తగదు - నీవు మరణమని పిలుస్తూ వున్నది ఏమిటి ? మరణమంటే భయపడుతున్న నీవు వట్టి పిచ్చివాడవు. మరణమనే తల యొకటి తగిలించుకొని ముసుగుతో ఆటలాడుతూ జీవనమే నీ కడకు వచ్చినదని తెలుసుకో.🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్ సం‌, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
తిథి: శుక్ల విదియ 08:25:20 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: ఉత్తరాషాఢ 19:22:25
వరకు తదుపరి శ్రవణ
యోగం: వ్యాఘత 24:58:04 వరకు
తదుపరి హర్షణ
కరణం: కౌలవ 08:25:20 వరకు
వర్జ్యం: 05:18:00 - 06:42:24
మరియు 22:55:20 - 24:20:40
దుర్ముహూర్తం: 16:20:04 - 17:04:27
రాహు కాలం: 16:25:37 - 17:48:50
గుళిక కాలం: 15:02:24 - 16:25:37
యమ గండం: 12:15:58 - 13:39:11
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:37
అమృత కాలం: 13:44:24 - 15:08:48
సూర్యోదయం: 06:43:06
సూర్యాస్తమయం: 17:48:50
చంద్రోదయం: 08:38:56
చంద్రాస్తమయం: 19:59:50
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 14:03:59 వరకు తదుపరి 
ముసల యోగం - దుఃఖం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 301 / Bhagavad-Gita - 301 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 21 🌴*

*21. యో యో యాం యాం తనుం భక్త: శ్రద్ధయార్చితు మిచ్చతి |*
*తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||*

🌷. తాత్పర్యం :
*నేను ప్రతివారు హృదయమునందు పరమాత్మరూపున నిలిచియుందును. ఎవరేని ఒక దేవతను పూజింప గోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును.*

🌷. భాష్యము :
భగవానుడు సర్వజీవులకు స్వతంత్రత నొసగియున్నాడు. కనుకనే మనుజుడు విషయభోగమును వాంఛించి దానిని దేవతల నుండి పొందగోరినచో సర్వుల హృదయాంతరవర్తి రూపున ఆ భగవానుడు వారి భావముల నవగాహనము చేసికొని వారు కోరినట్లు చేసికొనుట అవకాశము కల్పించును. 

సర్వజీవులకు దివ్యజనకునిగా అతడు వారి స్వాతంత్ర్యముతో జోక్యమును కల్పించుకొనక, వారు తమ కోరికలు తీర్చుకొనుటకు అవకాశమును కల్పించును. సర్వశక్తిసమన్వితుడైన భగవానుడు జీవులకు విషయజగమునందు అనుభవించుటకు అవకాశము నొసగి మాయాశక్తి వలలో తగులుకొనునట్లు ఏల చేయవలెనని కొందరు ప్రశ్నించవచ్చును. 

శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపున అట్టి అవకాశములు మరియు సౌకర్యములు కల్పించనచో జీవుల స్వాతంత్ర్యమను పదమునకు అర్థమే ఉండదనుట ఆ ప్రశ్నకు సమాధానము. కనుకనే అతడు సర్వజీవులకు సంపూర్ణ స్వాతంత్ర్యమును వారు కోరినది కోరినట్లుగా ఒసగుచున్నాడు. 

కాని సర్వధర్మములను విడిచి తననొక్కనినే శరణుపొందవలె ననునది అతని చరమోపదేశము. అది మనకు గీతాజ్ఞానపు అంత్యమున దర్శనమిచ్చును. అట్టి ఉపదేశపాలనము మనుజుని ఆనంధభాగుని చేయగలదు.

జీవులు మరియు దేవతలు ఇరువురును శ్రీకృష్ణభగవానుని ఆధీనమున ఉండువారు. తత్కారణమున జీవుడు తన కోరిక ననుసరించి ఏదేని దేవతను పూజింపజాలడు. 

అదేవి ధముగా దేవదేవుని అనుమతి లేనిదే దేవతలు సైతము ఎట్టి వరముల నొసగజాలరు. సాధారణముగా చెప్పబడునట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే గడ్డిపోచ కూడా కదలదు. సామాన్యముగా జగమునందు ఆర్తులైనవారు వేదములు ఉపదేశించిన రీతి వివిధ దేవతల దరిచేరుదురు. అనగా ఏదేని వరమును వాంఛించువాడు ఆయా దేవతలను పూజించుచుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 301 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Yoga - 21 🌴*

*21. yo yo yāṁ yāṁ tanuṁ bhaktaḥ śraddhayārcitum icchati*
*tasya tasyācalāṁ śraddhāṁ tām eva vidadhāmy aham*

🌷 Translation : 
*I am in everyone’s heart as the Supersoul. As soon as one desires to worship some demigod, I make his faith steady so that he can devote himself to that particular deity.*

🌹 Purport :
God has given independence to everyone; therefore, if a person desires to have material enjoyment and wants very sincerely to have such facilities from the material demigods, the Supreme Lord, as Supersoul in everyone’s heart, understands and gives facilities to such persons. 

As the supreme father of all living entities, He does not interfere with their independence, but gives all facilities so that they can fulfill their material desires. 

Some may ask why the all-powerful God gives facilities to the living entities for enjoying this material world and so lets them fall into the trap of the illusory energy. 

The answer is that if the Supreme Lord as Supersoul does not give such facilities, then there is no meaning to independence.

Therefore He gives everyone full independence – whatever one likes – but His ultimate instruction we find in the Bhagavad-gītā: one should give up all other engagements and fully surrender unto Him. That will make man happy.

Both the living entity and the demigods are subordinate to the will of the Supreme Personality of Godhead; therefore the living entity cannot worship the demigod by his own desire, nor can the demigod bestow any benediction without the supreme will.

As it is said, not a blade of grass moves without the will of the Supreme Personality of Godhead. Generally, persons who are distressed in the material world go to the demigods, as they are advised in the Vedic literature. A person wanting some particular thing may worship such and such a demigod. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 662 / Sri Siva Maha Purana - 662 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴*
*🌻. గణేశుడు మరల జీవించుట - 6 🌻*

అపుడు వారు దాని శిరస్సును దెచ్చి ఆ దేహమునందు జోడించిరి. తరువాత దేవతలందురు బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు (50) నమస్కరించి ఇట్లు పలికిరి : మీరు చెప్పినట్లు చేసితిమి. ఓ శివా! మిగిలిన కార్యమును మీరు పూర్తి చేయుడు (51).

అట్లు చెప్పి గణములు మరియు దేవతలు సుఖమును పొంది ప్రకాశించిరి. వారు శివుని మాటను విని దానిని పాటించిరి (52). అపుడు బ్రహ్మ విష్ణువు మరియు దేవతలు తమ ప్రభువు, నిర్గుణుడు, పాలకుడు అగు శివదేవునకు నమస్కరించి ఇట్లు పలికిరి (53). మహాత్ముడవగు నీ యొక్క తేజస్సు నుండియే మేమందరము జన్మించితిమి. వేదమంత్రముల ప్రభావముచే నీ ఆ తేజస్సు ఇచటకు వచ్చుగాక! (54). ఇట్లు పలికి వారు ఉత్తమమగు జలమును మంత్రములతో అభిమంత్రించి శివుని స్మరించి, వారందురు కలిసి ఆ జలమును ఆ దేహముపై చల్లిరి (55).

అపుడా బాలకుడు శివుని సంకల్పముచే ఆ జలము తగిలిన వెంటనే చైతన్యమును పొంది జీవించి నిద్రలేచిన వానివలె లేచి నిలబడెను (56). భాగ్యవంతుడు, మిక్కిలి అందగాడు, ఏనుగు మోమువాడు, ఎర్రని దేహచ్ఛాయ గలవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, గొప్ప కాంతి గలవాడు, సుందరాకారుడు (57) అగు జీవించిన ఆ పార్వతీతనయుడగు బాలకుని చూచి వారందరు ఆనందించిరి. ఓ మహర్షీ! వారి దుఃఖమంతా నాశమును పొందెను (58). వారందరు జీవించిన ఆ పార్వతీ తనయుని పార్వతీ దేవికి హర్షోల్లాసముతో చూపించిరి. ఆ దేవి జీవించిన పుత్రుని చూచి అతిశయించిన ఆనందరమును పొందెను (59).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహిత యందలి కుమార ఖండలో గణేశుడు మరల జీవించుట అనే పదిహేడవ అధ్యాయము ముగిసినది (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 662🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴*

*🌻 The Resuscitation of Gaṇeśa - 6 🌻*

50-51. They took the head and fitted it to the body. After joining it, the gods bowed to Śiva, Viṣṇu and Brahmā and spoke—“What has been ordered by you has been carried out by us. Let the task left incomplete be performed now.”

52. Then the Pārṣadas shone happily. After hearing those words they awaited eagerly what Śiva would say.

53. Then Brahmā, Viṣṇu and other gods spoke after bowing to lord Śiva who is free from the ill effects of the attributes.

54. They said:—“Since we all are born out of your brilliant Energy let that Energy come into it by the recitation of the Vedic mantras.

55. Saying so, they jointly sprinkled the holy water, invoked by the mantras on that body after remembering Śiva.

56. Immediately after the contact of the holy water the boy was resuscitated to life and joined with consciousness. As Śiva willed, the boy woke up as from a sleep.

57. He was handsome, extremely comely. He had the face of an elephant. He was red-complexioned. He was delighted with face beaming. He was brilliant and had fine features.

58. O great sage, on seeing the son of Pārvatī resuscitated to life, they all rejoiced and their miseries came to an end.

59. They showed him delightfully to the goddess. On seeing her restored to life, the goddess was greatly delighted.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 13 / DAILY WISDOM - 13 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. ఉనికే సత్యం 🌻*

*అతీతమైన అర్థం తీసుకుంటే ఉనికే సత్యం. సాపేక్ష చైతన్యం యొక్క పరిమితులను అధిగమించలేడని, సహజంగా సాపేక్ష క్రమం యొక్క విలువను మరియు అర్థాన్ని సత్యంగా తీసుకుంటాడనే మనిషి యొక్క లోపాన్ని ఇది పట్టించుకోదు. సత్యం యొక్క అత్యున్నత విలువ స్వచ్ఛతతో సమానంగా తీసుకోబడుతుంది. ఎందుకంటే ఉనికిలో లేనిదానికి విలువ ఉండదనుకుంటారు కాబట్టి.*

*చైతన్యం అనేది వాస్తవాలలో అత్యంత సానుకూలమైనది, అన్ని అనుభవాల సారాంశము. ఇది స్థలం, సమయం మరియు కారణం యొక్క అన్ని పరిమితులను అధిగమిస్తుంది. చైతన్యం ఎప్పుడూ పరిమితం కాదు, ఎందుకంటే పరిమితి అనే వాస్తవం యొక్క స్పృహ దాని అపరిమితతకు రుజువు. చైతన్యం అనేది అత్యంత ప్రాథమిక అనుభవం లేదా అవగాహన. అది స్వచ్ఛమైనది మరియు సరళమైనది, స్వీయ-విరుద్ధమైన విభజనలు మరియు ఆలోచన యొక్క హెచ్చుతగ్గులకు లోబడింది కాదు.*

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 13 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 13. Being is Truth 🌻*

*Being is truth in the transcendent sense without reference to anything else. It does not pay heed to the difficulty of man that he cannot transcend the limitations of relativistic consciousness and so naturally takes the value and meaning of the relative order to be the truth. The highest value of truth is equated with pure being, for non-being can have no value.*

*Consciousness is the most positive of facts, the datum of all experience. It transcends all limits of space, time and causality. Consciousness is never limited, for the very consciousness of the fact of limitation is proof of its transcendental unlimitedness. The most fundamental experience is consciousness or awareness, pure and simple, free from the self-contradictory divisions and fluctuations of thought.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 278 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రతిదీ మొదట్లో చీకట్లో పెరుగుతుంది. తల్లి గర్భంలో చీకటి వుంటుంది. అది అవసరం. బిడ్డ పుడతాడు. భౌతికంగా అతను కాంతిలోకి వస్తాడు. కానీ, ఆధ్యాత్మికంగా అతనింకా చీకట్లోనే వుంటాడు. 🍀*

*మనిషి సాధారణంగా చీకట్లో బతుకుతాడు. మనం చీకట్లోనే పుట్టాం. వాస్తవానికి ఆరంభంలో చీకటి ప్రాథమిక అవసరం. తల్లి గర్భంలో చీకటి వుంటుంది. అది అవసరం. ఎందుకంటే శారీరకంగా ఎదిగే బిడ్డకు చీకటి ఆటంకం కాదు. పసిబిడ్డ మృదువుగా వుంటుంది. మెత్తగా వుంటుంది. అందువల్ల చుట్టు మృదువయిన చీకటి అవసరం.*

*తల్లి గర్భంలో బిడ్డ రోజుకు ఇరవయి నాలుగ్గంటలూ నిద్రపోతుంది. ఆ తొమ్మిది నెలలు బిడ్డ పెరుగుతుంది. అప్పుడు ఎట్లాంటి ఆటంకం కలగకూడదు. అలా అయితే శక్తి దారి తప్పుతుంది. ప్రతిదీ మొదట్లో చీకట్లో పెరుగుతుంది. నువ్వు విత్తనాన్ని భూమిలో పెడతావు. దానికి గర్భం అవసరం. భూమి గర్భం అవసరం. అక్కడ చీకటి వుంటుంది. బిడ్డ పుడతాడు. భౌతికంగా అతను కాంతిలోకి వస్తాడు. కానీ, ఆధ్యాత్మికంగా అతనింకా చీకట్లోనే వుంటాడు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 15 / Siva Sutras - 15 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻5. ఉద్యమో భైరవః - 2 🌻*
*🌴. నిర్మలమైన స్పృహలో ఒక కాంతి మెరుపులా శివుడు సాక్షాత్కరిస్తాడు 🌴*

*ఈ హఠాత్‌ స్పృహను ప్రతిభ అంటారు. ప్రతిభ అంటే, మనస్సులో హఠాత్తుగా మెరుపులా స్ఫురించడం. కాశ్మీరీ శైవమతం మూడు విభిన్న వ్యవస్థలను కలిగి ఉంది. అవి క్రమ, ప్రతిభిజ్ఞా మరియు కుల వ్యవస్థలు. నిశ్చయాత్మకమైన ఆలోచన యొక్క శుద్ధీకరణ అనేది అంతిమ సాక్షాత్కారానికి సాధనం అని క్రమ వ్యవస్థ చెబుతుంది. ఇది అనిశ్చిత స్వభావం, ఇక్కడ శుద్ధి శూన్యం నుంచి పరిపూర్ణత వరకు వరుస దశల ద్వారా జరుగుతుంది.*

*క్రమ వ్యవస్థ ఐదు శక్తులను గుర్తిస్తుంది, సృష్టి శక్తి, స్థితి శక్తి, లయ శక్తి, అగోచర, మరియు భాస శక్తి. ఈ ఐదింటిలో, భాస ముఖ్యమైనది అని చెప్పబడింది. ఈ భాసని ప్రతిభ అంటారు. భాసా అనేది కాంతి, మెరుపు, ప్రకాశం మరియు మనస్సుపై చేసిన ముద్రగా వివరించబడింది. ఆనందంగా ఉన్న మానసిక స్థితిలో మాత్రమే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 015 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻5. Udyamo bhairavaḥ - 2 🌻*
*🌴. Shiva is realized like a flash of light in the arena of serene consciousness. 🌴*

*This flash is called pratibhā. Pratibhā means, to appear to the mind, flash upon the thoughts, become clear or manifest. Kashmiri Saivism has three distinct systems. They are krama, pratybhijñā and kula systems. Krama system says that purification of definitive idea is the means to the realization of the Ultimate. It is the nature of indetermination where purification happens through successive stages from nothingness to perfect clarity.*

*The krama system recognizes five powers, the power of creation, the power of sustenance, the power of annihilation, indescribable and bhāsā. Out of the five, bhāsā is said to be the important one. This bhāsā is known as pratibhā. Bhāsā is explained as light, luster, brightness and impression made on the mind. Realization always takes place in the arena of mind when one is in the stage of blissfulness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

No comments:

Post a Comment