శ్రీ మదగ్ని మహాపురాణము - 148 / Agni Maha Purana - 148
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 148 / Agni Maha Purana - 148 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 45
🌻. పిండికాది లక్షణము - 1🌻
హయగ్రీవుడు చెప్పెను.
బ్రహ్మదేవా! ఇపుడు నేను పిండిక లక్షణము చెప్పెదను పిండిక పొడవు ప్రతిమతో సమానముగ నుండును. ఎత్తు మాత్రము ప్రతిమలో సగముండును. పిండికకు అరువది నాలుగు కోష్ఠకము లేర్పరచి, క్రింది రెండు పంక్తులు విడచి, దానిపైన ఉన్న కోష్ఠము నాలుగు వైపుల, రెండు పార్శ్వములందును, లోపలి నుండి తుడిచి వేయవలెను. అట్లే పై రెండు పంక్తులు విడచి దాని క్రిందనున్న కోష్టమును లోపలినుండి తుడిచి వేయవలెను. ఈ విధముగ రెండు పార్శ్వములందును చేయవలెను. రెండు పార్శ్వముల మధ్యనున్న రెండు రెండు చతుష్కములను గూడ తుడిచివేయవలెను.
పిమ్మట దానిని నాలుగు భాగములుగా విభజించి పై రెండు పంక్తులను మేఖలగా గ్రహించి, దాని ప్రమాణములో సగము ప్రమాణముండునట్లు దాని యందు గొయ్యి తవ్వవలెను. రెండు పార్శ్వ భాగములందును సమానముగ ఒక్కొక్క భాగము విడిచి జైటపదమును నాలి (తూము) నిర్మించుటకై విడవలెను. దానియందు తూమునిర్మింపవలెను. మూడు భాగములలోని ఒక భాగమునకు ముందు నీరు ముందుకు పోటవుటకై మార్గముండవలెను.
వివిధాకారముగల ఈ పిండికకు ''భద్ర'' అని పేరు. లక్ష్మీదేవి ప్రతిమ ప్రమాణము ఎనిమిది జానలుండవలెను. ఇతర దేవుల ప్రతిమలు కూడ ఇట్లే ఉండవలెను. రెండుకను బొమ్మలును నాసిక కంటె ఒక యవ అధికముగా ఉండవలెను. నాసిక వాటి కంటె ఒక యవ తక్కువ ఉండవలెను. ముఖ గోలకము నేత్ర గోలకముకంటె పెద్దదిగా ఉండవలెను. ఇది ఎత్తుగాను, వంకర టింకరగాను ఉండకూడదు. నేత్రములు పెద్దవిగా మూడును పావుయవల ప్రమాణములో నుండ వలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 148 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 45
🌻Characteristics of pedestals and details relating to images - 1 🌻
The Lord said:
1. I shall describe the characteristics of the pedestal. The length is the same as that of the image. The height (should be) half of it. It should have sixty-four folds.
2. Leaving two rows at the bottOṃ, the other parts should be polished on either side as also inside.
3. Leaving two rows at the top, the other parts are polished evenly on either side and inside.
4. The rectaṅgular space in between these should then be polished. The first two rows should be divided into four parts by a wise man.
5-6. The girdle should be equal to one such part. The indent should be half that. Leaving one such part evenly on either side a wise man should leave on the exterior a breadth of a foot. The water drains should be at the top of each one of the three-parts.
7. This auspicious and excellent pedestal (has been described) relating to its manifold ways (of construction). The (images of the)goddess Lakṣmī and other feminine forms should be made (to measure) eight tālas in length.
8. The eye brows should be more than a yava (in length). The nose (should be) less than a yava (in length). The mouth (should measure) more than a small ball well distributed above and below.
9. The eye should be made long (measuring) three parts of a yava less than three yavas. The breadth of the eyes should be made half of it.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment