🍀 27 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 27 - DECEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 27 - DECEMBER - 2022 TUESDAY, మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 302 / Bhagavad-Gita -302 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -22వ శ్లోకము.
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 149 / Agni Maha Purana - 149 🌹 🌻. పిండికాది లక్షణము - 2 Characteristics of pedestals and details relating to images - 2🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 014 / DAILY WISDOM - 014 🌹 🌻 14. అత్యున్నత పరిపూర్ణత కలిగినది సంపూర్ణ జీవి - Absolute Being is the Highest Perfection 🌻 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 279 🌹
6) 🌹. శివ సూత్రములు - 16 / Siva Sutras - 16 🌹. 5. ఉద్యమో భైరవః - 3 / 5. Udyamo bhairavaḥ - 3

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹27, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మండల పూజ, Mandala Pooja🌻*

*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 7 🍀*

*13. జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః |*
*రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్*
*14. విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః |*
*సర్వాపద్భ్యో విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భయాందోళనలు సంకల్పానికి విపరీత రూపాలు. నీ మనస్సు నందు పదే పదే భయాందోళనలు మసలజొచ్చి నప్పుడు దేనిని గురించి నీవు భయాందోళనలు చెందుతున్నావో అది సంభవించడానికి నీవు తోడ్పడిన వాడవవుతావు. ఏలనంటే, మెలకువ యందలి ఉపరితలంలోని నీ సంకల్పం దానిని నివారింప గోరుతున్నా, అడుగు పొరలోని నీ మనస్సు విడువకుండా దానిని సంకల్పిస్తూనే వున్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పుష్య మాసం
 తిథి: శుక్ల పంచమి 22:54:09
వరకు తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ధనిష్ట 14:28:29 
వరకు తదుపరి శతభిషం
యోగం: వజ్ర 17:27:40 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బవ 12:15:25 వరకు
వర్జ్యం: 21:09:24 - 22:38:36
దుర్ముహూర్తం: 08:57:11 - 09:41:34
రాహు కాలం: 15:03:26 - 16:26:41
గుళిక కాలం: 12:16:57 - 13:40:12
యమ గండం: 09:30:28 - 10:53:43
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:38
అమృత కాలం: 05:02:04 - 06:29:08
మరియు 30:04:36 - 31:33:48
సూర్యోదయం: 06:44:00
సూర్యాస్తమయం: 17:49:55
చంద్రోదయం: 10:24:46
చంద్రాస్తమయం: 22:09:22
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 14:28:29 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 302 / Bhagavad-Gita - 302 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 22 🌴*

*22. స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే |*
*లభతే చ తత: కామాన్మయైవ విహితాన్ హి తాన్ ||*

🌷. తాత్పర్యం :
*అట్టి శ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్ద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరములన్నియును నా చేతనే ఒసగబడుచున్నవి.*

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని అనుజ్ఞ లేనిదే దేవతలు తమ భక్తులకు ఎట్టి వరములను ఒసగలేరు. సర్వము శ్రీకృష్ణభగవానునికి చెందినదే యున్న విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రము మరువరు. 

అనగా దేవతార్చనము మరియు తద్ద్వారా ఇష్టసిద్ధి యనునవి దేవతల వలన గాక ఆ భగవానుని ఏర్పాటు వలననే జరుగుచుండును. 

అల్పజ్ఞుడైన జీవుడు ఈ విషయము నెరుగలేడు. కనుకనే మూర్ఖముగా అతడు కొద్దిపాటి లాభమునకై దేవతల నాశ్రయించును. కాని శుద్ధభక్తుడు మాత్రము ఏదేని కావలసివచ్చినప్పుడు ఆ భగవానునే ప్రార్థించును. 

అయినను ఆ విధముగా భౌతికలాభమును అర్థించుట శుద్ధభక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన కామమును పూర్ణము చేసికొనుట యందు ఆతురతను కలిగియుండును కనుక దేవతల నాశ్రయించును. 

జీవుడు తనకు తగనటువంటిదానిని కోరగా భగవానుడు అట్టి కోరికను తీర్చనప్పుడు ఆ విధముగా జరుగుచుండును. ఒకవైపు ఆదిదేవుడైన శ్రీకృష్ణుని అర్చించుచు వేరొక వైపు విషయభోగవాంఛలు కూడియుండుట విరుద్దకోరికలను కలిగియుండుట వంటిదని శ్రీచైతన్యచరితామృతము తెలుపుచున్నది. 

కృష్ణునకు ఒనర్చబడు భక్తియుతసేవ మరియు దేవతలకు ఒనర్చబడు పూజ సమస్థాయిలో నున్నటువంటివి కావు. దేవతార్చనము భౌతికము కాగా భగవానుని భక్తియుతసేవ సంపూర్ణముగా దివ్యమగుటయే అందులకు కారణము.

భగవద్ధామమును చేర నభిలషించు జీవునకి విషయకోరికలనునవి అవరోధములు వంటివి. కనుకనే అల్పజ్ఞులగు జీవుల వాంఛించు భౌతికలాభములు శుద్ధభక్తునకు సాధారణముగా ఒసగబడవు. 

తత్కారణముననే అట్టి అల్పజ్ఞులు భగవానుని భక్తియుతసేవ యందు నిలుచుటకు బదులు భౌతికజగమునకు చెందిన దేవతల పూజకే ప్రాధాన్యత నొసగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 302 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Yoga - 22 🌴*

*22. sa tayā śraddhayā yuktas tasyārādhanam īhate*
*labhate ca tataḥ kāmān mayaiva vihitān hi tān*

🌷 Translation : 
*Endowed with such a faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actuality these benefits are bestowed by Me alone.*

🌹 Purport :
The demigods cannot award benedictions to their devotees without the permission of the Supreme Lord.

The living entity may forget that everything is the property of the Supreme Lord, but the demigods do not forget. So the worship of demigods and achievement of desired results are due not to the demigods but to the Supreme Personality of Godhead, by arrangement. 

The less intelligent living entity does not know this, and therefore he foolishly goes to the demigods for some benefit. But the pure devotee, when in need of something, prays only to the Supreme Lord. Asking for material benefit, however, is not a sign of a pure devotee. A living entity goes to the demigods usually because he is mad to fulfill his lust. 

This happens when something undue is desired by the living entity and the Lord Himself does not fulfill the desire. In the Caitanya-caritāmṛta it is said that one who worships the Supreme Lord and at the same time desires material enjoyment is contradictory in his desires. 

Devotional service to the Supreme Lord and the worship of a demigod cannot be on the same platform, because worship of a demigod is material and devotional service to the Supreme Lord is completely spiritual.

For the living entity who desires to return to Godhead, material desires are impediments. A pure devotee of the Lord is therefore not awarded the material benefits desired by less intelligent living entities, who therefore prefer to worship demigods of the material world rather than engage in the devotional service of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 149 / Agni Maha Purana - 149 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 45*

*🌻. పిండికాది లక్షణము - 2🌻*

ముఖము పొడవు ఒక కోణము నుండి మరియొక కోణమువరకు ఎంత ఉండునో సూత్రములో కొలిచి కర్ణ పాశము అంత ఉండునట్లు చేయవలెను. దాని పొడవు పైన చెప్పిన సూత్రము కంటె కొంచెము ఎక్కువ పొడవే ఉండవలెను. రెండు స్కంధములు కొంచెము వంగి ఒక కల తగ్గినట్లు చయవలెను. కంఠము పొడవు ఒకటిన్నర కళల పొడవుండవలెను. వెడల్పు కూడ అంతలో ఉండవలెను. రెండు ఊరువుల విస్తారము కంఠము కంటె ఒక నేత్రము తక్కువ ఉండవలెను. మోకాళ్ల చిప్పలు, పిండలి, పాదములు, పీఠము, నితంబము, కటిభాగము మొదలగు వాటిని యథా యోగ్యముగ కల్పంపవలెను.

చేతి వ్రేళ్లు పెద్దవిగా ఉండవలెను. పరస్పరావరుద్ధములు కాకూడదు. పెద్దవ్రేలి కంటె చిన్న వ్రేళ్లు ఏడవ వంతు తక్కువ ఉండవలెను. పిక్కలు, తొడలు, కటి-వీటి పొడవు క్రమముగా ఒక్కొక్క నేత్రము తక్కువ ఉండవలెను. శరీర మధ్య ప్రాంతము గుండ్రముగా ఉండవలెను. కుచములు దగ్గరగా బలిసి ఉండవలెను. స్తనములు జానెడు ఉండవలెను. కటి ప్రదేశము వాటికంటె ఒకటిన్నర కలలు పెద్దదిగా ఉండవలెను. మిగిలిన చిహ్నములన్నియు వెనుకటివలెనే లక్ష్మికి కుడిచేతిలో కమలము, ఎడమచేతిలో బిల్వఫలము ఉండవలెను. చామరము ధరించిన స్త్రీలు ఆమె పార్శ్వములందు నిలిచి ఉండవలెను. పెద్ద ముక్కుగల గరుత్మంతుడు ఎదుట నిలిచి ఉండవలెను. ఇపుడు చక్రాంకిత (సాలగ్రామాది) మూర్తులను గూర్చి చెప్పెదను.

అగ్నిపురాణమునందు పిండికాది లక్షణమను నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 149 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 45
*🌻Characteristics of pedestals and details relating to images - 2 🌻*

10. The beautiful ears should be made to be in a line with the corners of the mouth. Then the two shoulders should be made sloping by less than a kalā.

11-12. The neck should be one and a half kalās long and made beautiful by a proportionate width. The thighs, kneejoints, the pedestal, should be broad. The feet, the hinder part, the bullocks and the hips should be made as prescribed. The fingers should measure less than the seventh part of the above and should be long and not crooked.

13. The shank, thigh and the hip would be one netra[1] less in length. The middle part and the sides should have the same roundness. The two breasts (should be) fully developed and plump.

14-15. The beasts should be made to measure a tāla. The waist should be one and a half kalās. The other marks should be the same as before. A lotus (should be placed) on the right hand and a bilva (fruit) on the left (hand). (There should be) two maidens on the sides holding chowries in their hands. (The image of) Garuḍa should have a long nose. I shall then describe those which bear the marks of a disc.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 14 / DAILY WISDOM - 14 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. అత్యున్నత పరిపూర్ణత కలిగినది సంపూర్ణ జీవి 🌻*

*సంపూర్ణ జీవే అత్యున్నత పరిపూర్ణత. పరిపూర్ణత అనేదే ఆనందం. స్వయమే సంపూర్ణ ప్రేమకు స్థానం, ఈ ప్రేమ ఒక వస్తువు పట్ల కాదు. ఇది వస్తు సంబంధం లేని ఆనందం, ఎందుకంటే బ్రహ్మానందం విషయం మరియు వస్తువు యొక్క సంపర్కం ద్వారా ఉద్భవించదు. ఇక్కడ, ప్రేమ మరియు ఆనందం అనేది వస్తు సంబంధం లేకుండా ఉనికిలో ఉంటాయి. అంటే, ఇవే చైతన్యం యొక్క ఆనందం, ఇదే జీవుడి యొక్క ఆనందం.*

*అన్ని ప్రయాసల యొక్క అత్యున్నత లక్ష్యం ఏమిటంటే ప్రస్తుత పరిమిత జీవిత స్థితి నుండి విముక్తి చెంది సంపూర్ణమైన ఆనందాన్ని చేరుకోవడం. సంపూర్ణ జ్ఞానం అయిన సంపూర్ణ ఉనికి కూడా సంపూర్ణ ఆనందమే. అత్యున్నత ఆనందం యొక్క స్పృహ అనేది మనం స్పృహలో ఉన్న జీవితంలో మనం అనుభూతి చెందే ఎదుగుదల మరియు విస్తరణకు అనులోమానుపాతంలో ఉంటుంది. సత్-చిత్-ఆనంద మూడు రెట్లు ఉనికిని సూచించదు, కానీ సంపూర్ణ స్వయాన్ని సూచిస్తుంది.*

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 14 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 14. Absolute Being is the Highest Perfection 🌻*

*Absolute Being is the highest perfection. Perfection is Bliss. The Self is the seat of Absolute Love, Love without an object outside it. It is Bliss without objectification, for Brahman-Bliss is not derived through contact of subject and object. Here, Love and Bliss are Existence itself. That which is, is Bliss of Consciousness which is Being.*

*The highest aim of all endeavour is deliverance from the present condition of limited life and the reaching of the Bhuma which is Bliss. Absolute Existence which is Absolute Knowledge is also Absolute Bliss. The Consciousness of Bliss experienced is in proportion to the growth and expansion that we feel in the conscious being of ourselves. Sat-chit-ananda does not imply a threefold existence, but is Absolute Self-Identity.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 279 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ధ్యానం పునర్జన్మనిస్తుంది. మొదటి భౌతిక జన్మ రెండోది ఆధ్యాత్మిక జన్మ. పుట్టినప్పుడు నువ్వు భౌతికంగా నువ్వు కాంతిలో వుంటావు. తరువాత నీకు ఇంకో జన్మ కావాలి. అప్పుడు నీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా సంపూర్ణ కాంతి లభిస్తుంది. 🍀*

*ఒకసారి విత్తనం మొలకెత్తితే భూమి పైకి వస్తుంది. సూర్యుడి కేసి సాగుతుంది. చంద్రుడి కేసి సాగుతుంది. నక్షత్రాల కేసి సాగుతుంది. బిడ్డ పుడతాడు. భౌతికంగా అతను కాంతిలోకి వస్తాడు. కానీ, ఆధ్యాత్మికంగా అతనింకా చీకట్లోనే వుంటాడు. ఆ చీకట్ని కేవలం ధ్యానం గుండానే వదిలించుకోవడం వీలవుతుంది. అందువల్ల ధ్యానం పునర్జన్మనిస్తుంది. మొదటి భౌతిక జన్మ రెండోది ఆధ్యాత్మిక జన్మ.*

*పుట్టినప్పుడు నువ్వు భౌతికంగా కాంతిలో వుంటావు. తరువాత నీకు ఇంకో జన్మ కావాలి. అప్పుడు నీకు మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా సంపూర్ణ కాంతి లభిస్తుంది. కాంతి అస్తిత్వానికి యింకో పేరు. నువ్వు కాంతిలోకి అడుగిడిన మరుక్షణం నువ్వు జ్ఞానోదయం పొందుతావు. అప్పుడు నువ్వు యిద్దరు కావు. నీలో ద్వైదీభావం వుండదు. నువ్వు కాంతిని చూసేవాడివి కావు. మీరు ఒకటవుతారు. నువ్వు కాంతివవుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 16 / Siva Sutras - 16 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻5. ఉద్యమో భైరవః - 3 🌻*
*🌴. నిర్మలమైన స్పృహలో ఒక కాంతి మెరుపులా శివుడు సాక్షాత్కరిస్తాడు 🌴*

*భైరవునిపై మనస్సు కేంద్రీకరించినపుడు మాత్రమే ప్రతిభ ఆవిర్భవిస్తుంది. భైరవ ఆలోచన కాకుండా మరొక ఆలోచన ఉద్భవిస్తే, ప్రతిభ ఎప్పుడూ బయటపడదు. ప్రతిభ యొక్క ఆవిర్భావాన్ని ఉన్మేషము అంటారు. ఉన్మేషము అనేది అత్యున్నత స్థాయి చైతన్యం యొక్క ఆవిర్భావాన్ని సూచిస్తుంది, ఇక్కడ శివుడు సాక్షాత్కరిస్తాడు. ఇది ఆలోచన ప్రక్రియ యొక్క కేంద్రీకృత అంతర్గతీకరణ, దీని ఆఖరి దశలో శివుడు లిప్తమాత్రంలో వెల్లడించ బడతాడు. ఆ మరుసటి క్షణం నుండి, అతను మునుపటిలాగా, అదే వ్యక్తిగా ఉండడు. ఇప్పుడు అతనికి శివుని సర్వవ్యాపకత్వం అర్థమైంది.*

*ధ్యాన ప్రక్రియ ద్వారానే ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుందని ఈ సూత్రం చెబుతోంది, దాని కోసం ఒకరు అంతర్ముఖం కావలసి ఉంటుంది. ఎవరైనా బహిర్ముఖమైతే, అతనికి ఇంద్రియాలతో సంబంధం ఏర్పడి, అవి మనస్సును భ్రమింపజేస్తాయి మరియు అంతర్ముఖం అవ్వడం అసాధ్యమౌతుంది. అంతర్గత దృష్టి సాకారం కానప్పుడు, చైతన్యం పరిపూర్ణ స్పష్టత స్థితిని పొందదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 016 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻5. Udyamo bhairavaḥ - 3 🌻*
*🌴. Shiva is realized like a flash of light in the arena of serene consciousness. 🌴*

*The pratibhā happens only if mind is focused on Bhairva. If another thought originates, apart from the thought of Bhairava, pratibhā never unfolds. The unfoldment of pratibhā is called unmeṣa. Unmeṣa refers to the emergence of the highest level of consciousness, where Shiva is revealed. It is the focused internalization of thought process, at the end of which Shiva is revealed, in a fraction of a second. From the next second onwards, he does not remain as the same person, as he was earlier. Now he understands the omnipresence of Shiva.*

*This sūtrā says that Self-realization can be happen, only through the process of meditation, for which one has to look within. If one happens to look externally, he gets associated with senses that in turn make the mind deluded and making it impossible to focus within. When internalized focus does not materialize, the consciousness cannot attain the state of perfect clarity.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

No comments:

Post a Comment