నిర్మల ధ్యానాలు - ఓషో - 295


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 295 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. లోపలికి చూడు. ఆనందం కనిపిస్తుంది. కేవలం సత్యం కనిపిస్తుంది. జీవితం పరిమళిస్తుంది, పరవశిస్తుంది. మనం సమగ్రంగానే పుట్టాం. మనం ఆనందాన్ని అన్వేషించడానికి పుట్టలేదు. మనం కేవలం దాన్ని కనిపెట్టాలి. 🍀

మనం సమగ్రం కావడానికి పుట్టలేదు. మనం సమగ్రంగానే పుట్టాం. మనం ఆనందాన్ని అన్వేషించడానికి పుట్టలేదు. మనం కేవలం దాన్ని కనిపెట్టాలి. జనం అనుకునేంత కష్టమయిన విషయమేమీ కాదది. విశ్రాంతిని, విరామాన్ని పొందే సరళ మార్గమది. అప్పుడు మెల్లమెల్లగా కేంద్రానికి చేరుతాం. నువ్వు కేంద్రానికి చేరిన రోజు అక్కడంతా కాంతి కమ్ముకుంటుంది. నీకు స్విచ్ కనిపిస్తుంది. పరిస్థితి అది. మనం అనవసరంగా అరుస్తాం. గీపెడతాం.

నీ బాధ అర్థం లేనిది. తాడును చూసి పాముగా భ్రమించడం పరిగెట్టి అరటితొక్కపై కాలేసి పడి హాస్పిటల్లో చేరడం. చుట్టూ చూడు. అక్కడ ఏమీ వుండదు. లోపలికి చూడు. ఆనందం కనిపిస్తుంది. కేవలం సత్యం కనిపిస్తుంది. జీవితం పరిమళిస్తుంది, పరవశిస్తుంది. వ్యక్తి వీలయినంత పరవశాన్ని అందుకోవాలి. వ్యక్తిలో అనంత పరవశముంది. దానికి అంతం లేదు. ప్రయాణానికి అంతం లేదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment