శ్రీమద్భగవద్గీత - 305: 07వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 305: Chap. 07, Ver. 25

 

🌹. శ్రీమద్భగవద్గీత - 305 / Bhagavad-Gita - 305 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 25 🌴

25. నాహం ప్రకాశ: సర్వస్య యోగమాయాసమావృత: |
మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్


🌷. తాత్పర్యం :

మూఢులకు మరియు అజ్ఞానులకు నేనెన్నడును వ్యక్తము కాను. వారికి నేను నా అంతరంగశక్తిచే కప్పబడి యుందును. తత్కారణముగా వారు నేను అజుడననియు, నాశములేనివాడననియు ఎరుగరు.

🌷. భాష్యము :

శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమొసగెను గావున ఇప్పుడు మాత్రము ఎందులకు సర్వులకు దర్శితమగుటలేదని ఎవరైనను వాదింపవచ్చును. కాని వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తము కాలేదు. భూమిపై అవతరించియున్నప్పుడు కొద్దిమంది మాత్రమే అతనిని దేవదేవునిగా తెలిసికొనగలిగిరి. కురుసభలో శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరముగా పలికినప్పుడు, భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవదేవునిగా తీర్మానించెను. అలాగుననే పాండవులు మరియు ఇతర కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవదేవుడని తెలిసికొనగలిగిరి. అతడెన్నడును అభక్తులకు మరియు సామాన్యజనులకు విదితము కాలేదు. కనుకనే భక్తులు తప్ప మిగిలిన వారందరు తనను తమవంటివాడనే తలంతురని శ్రీకృష్ణుడు గీత యందు పలికియుండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన ఆభక్తులకు తన అంతరంగశక్తిచే కప్పుబడియుండును.

శ్రీకృష్ణభగవానుడు “యోగమాయ” అను తెరచే కప్పబడియున్నందున సామాన్యజనులు అతనిని తెలిసికొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసెను. (శ్రీమద్భాగవతము 1.8.19). ఈ “యోగమాయ” అను తెర ఈశోపనిషత్తు (మంత్రము 15) నందును తెలుపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు కీర్తించును.

హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్ |
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే

“హే ప్రభూ! సమస్తవిశ్వమును పోషించువాడవు నీవే. నీ భక్తియే అత్యుత్తమ ధర్మనియమమై యున్నది. కనుకనే నన్ను కుడా పోషింపుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్యరూపము యోగమాయచే కప్పబడియున్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే ఆచ్చాదితమై యున్నది. నీ సచ్చిదానందవిగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని ఉపసంహరింపుమని నేను ప్రార్థించుచున్నాను.” సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణభగవానుడు బ్రహ్మజ్యోతిచే కప్పబడియుండుట వలన బుద్ధిహీనులైన నిరాకారవాదులు అతనిని గాంచలేకున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 305 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 25 🌴

25. nāhaṁ prakāśaḥ sarvasya yoga-māyā-samāvṛtaḥ
mūḍho ’yaṁ nābhijānāti loko mām ajam avyayam


🌷 Translation :

I am never manifest to the foolish and unintelligent. For them I am covered by My internal potency, and therefore they do not know that I am unborn and infallible.

🌹 Purport :

It may be argued that since Kṛṣṇa was visible to everyone when He was present on this earth, how can it be said that He is not manifest to everyone? But actually He was not manifest to everyone. When Kṛṣṇa was present there were only a few people who could understand Him to be the Supreme Personality of Godhead. In the assembly of Kurus, when Śiśupāla spoke against Kṛṣṇa’s being elected president of the assembly, Bhīṣma supported Him and proclaimed Him to be the Supreme God. Similarly, the Pāṇḍavas and a few others knew that He was the Supreme, but not everyone. He was not revealed to the nondevotees and the common man. Therefore in the Bhagavad-gītā Kṛṣṇa says that but for His pure devotees, all men consider Him to be like themselves. He was manifest only to His devotees as the reservoir of all pleasure. But to others, to unintelligent nondevotees, He was covered by His internal potency.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment