18 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 18, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹
శుభ శనివారం, Saturday, స్థిర వాసరే
🍀. మహా శివరాత్రి శుభాకాంక్షలు మిత్రులందరికీ, Good Wishes on Maha Shivaratri to All. 🍀
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహా శివరాత్రి, Maha Shivaratri🌻
🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 8 🍀
15. నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే |
ఉన్మూలనకర్మఠాయ హ్యలక్ష్మ్యా సర్వదా నమః
16. నమో లోకత్రయేశాయ స్వానందనిహితాయ తే |
నమః శ్రీబీజరూపాయ సర్వకామప్రదాయినే
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : అంతఃస్ఫురణం - నీ లోపలకు నీవు ప్రవేశించగల సామర్థ్యంపై అంతఃస్ఫురణ మీద ఆధారపడి వుంటుంది. ఒకొక్కప్పుడది భక్తి మొదలగు వానిచే లోతెక్కిన చైతన్యము నందు దానంతటదే స్ఫురించ వచ్చును. లేక ఒక్కొక్కప్పుడు విషయ నివేదన మొనర్చి జవాబు నాలకించు అభ్యాసముచే నైననూ అనుభవానికి రావచ్చును, 🍀
🌻. విశిష్టత - విధి - శివ మంగళాష్టకం 🌻
మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి. శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగ రూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.
🌷🌷🌷🌷🌷
శుభకృత్, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 20:03:57
వరకు తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాషాఢ 17:42:05
వరకు తదుపరి శ్రవణ
యోగం: వ్యతీపాత 19:36:13
వరకు తదుపరి వరియాన
కరణం: గార 09:50:38 వరకు
వర్జ్యం: 03:33:20 - 04:58:12
మరియు 21:12:20 - 22:36:28
దుర్ముహూర్తం: 08:14:19 - 09:00:49
రాహు కాలం: 09:35:41 - 11:02:52
గుళిక కాలం: 06:41:20 - 08:08:30
యమ గండం: 13:57:14 - 15:24:25
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 12:02:32 - 13:27:24
మరియు 29:37:08 - 31:01:16
సూర్యోదయం: 06:41:20
సూర్యాస్తమయం: 18:18:47
చంద్రోదయం: 04:57:39
చంద్రాస్తమయం: 16:17:40
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 12:26:00 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment