నిర్మల ధ్యానాలు - ఓషో - 297
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 297 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతి సందర్భానికీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. నువ్వు బాధని ఎన్నుకోవచ్చు. ఆనందాన్నీ ఎంపిక చేసుకోవచ్చు. ఆ దృష్టితో చూడు. ప్రతి సందర్భాన్నీ నువ్వు బాధగా మారుస్తావో, ఆనందంగా మారుస్తావో నీ యిష్టం. 🍀
జీవితం గురించి భయపడాల్సిన పన్లేదు. అన్ని మార్గాలకు అందుబాటులో వుండు. క్షణకాలం కూడా బాధ పడాల్సిన పన్లేదు. జీవితాంతం ఆనందంగా వుండొచ్చు. కొంత మంది బాధగా వుండడానికి కారణాలు వెతకడంలో ప్రవీణులు. వాళ్ళు బాధల్లో వుంటే తప్ప సంతోషంగా వుండలేరు. వాళ్ళకు తెలిసిన ఆనందమొకటే. అదే దుఃఖం.
అట్లాంటి వాళ్ళు వాళ్ళ బాధని పదింతలుగా ప్రదర్శిస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఆనందంగా ఎట్లా వుంటారు? ప్రతి సందర్భానికీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. నువ్వు బాధని ఎన్నుకోవచ్చు. ఆనందాన్నీ ఎంపిక చేసుకోవచ్చు. ఆ దృష్టితో చూడు. ప్రతి సందర్భాన్నీ నువ్వు బాధగా మారుస్తావో, ఆనందంగా మారుస్తావో నీ యిష్టం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment