శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 432 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।
చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀

🌻 432. 'చందనద్రవ దిగ్ధాంగీ'- 2 🌻


శివుని ఆరాధనమున కన్నులు, చెక్కిళ్ళు, పెదవులు ఎరుపెక్కుటయే గాక దేహమంతయూ శివతేజస్సు వ్యాపింపగ, ఆ తేజస్సు యొక్క వేడిమిని ఉపశమింప జేయుటకు చల్లని గంధపు పూత శ్రీమాతకు ఆవశ్యకమైనదని ఋషుల అభిప్రాయము. నరసింహుని శాంతింపజేయుటకు కూడ గుట్టలు గుట్టలుగ గంధపు లేపనమే వాడిరని ప్రతీతి. పుణ్యక్షేత్రమగు సింహాచలమున వరాహ నృసింహుని సంవత్సర మంతయూ గంధపు పూతతోనే నింపియుంతురు.

కారణము ఏమనగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించుటకు శ్రీ మహా విష్ణువు శివతేజస్సు నావాహనముచేసి ప్రళయకాల రుద్రునివలె చెలరేగి వరాహ నృసింహుల రూపమున సంహరించెను. శివుని తేజము గల నృశింహుని శాంతింప జేయుటకు గంధమే శరణ్యమైనది. అట్లే సతతము శివుని ఆరాధించు శ్రీమాత అంగములకు గంధ మావశ్యకమై నిలచినది అని భావము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 432 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh
Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻

🌻 432. 'Chandandrava Digdhangi'- 2 🌻


Sages are of the opinion that the eyes, cheekbones and lips become red in the worship of Shiva, so that the effulgence of Shiva spreads throughout the body, and to relieve the heat of that effulgence, the application of cold sandalwood is necessary for Sri Mata. It is believed that sandalwood ointment was also used to appease Lord Narasimha. Varaha Nrisimha is filled with sandal paste on the body in the shrine all year round. The reason is that in order to kill Hiranyaksha and Hiranyakaship,

Lord Vishnu used the essence of Shiva and burst out like Rudra and killed them in the form of Nrisimha. Sandalwood is the only refuge to pacify Nrisimha, who has the energy of Lord Shiva. Similarly, it is believed that sandalwood is essential for the limbs of Srimata who constantly worships Lord Shiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment