శ్రీ శివ మహా పురాణము - 684 / Sri Siva Maha Purana - 684
🌹 . శ్రీ శివ మహా పురాణము - 684 / Sri Siva Maha Purana - 684 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴
🌻. త్రిపుర వర్ణనము - 4 🌻
ఓ బ్రహ్మా! అయిదు దినములలో నిశ్చితముగా మృత్యువుచే కబళింపబడువానికి ఈ సర్వము వ్యర్ధమే గదా! మా నిశ్చయ మిట్లున్నది (34).
సనత్కుమారుడిట్లు పలికెను -
తపశ్శాలురగు ఆ రాక్షసుల ఈ మాటలను విని బ్రహ్మ తన ప్రభువు మరియు కైలాసవాసి యగు శివుని స్మరించి ఇట్లు పలికెను (35).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ రాక్షసులారా! సర్వథా మరణము లేకపోవుట సంభవము కాదు. కావున ఈ కోరికనుండి విరమించుకొనుడు. మీకు నచ్చిన మరియొక వరమును కోరుకొనుడు(36). ఓ రాక్షసులారా! భూలోకములో ఎక్కడనైననూ ఇంతకు ముందు పుట్టిన ప్రాణులు గాని, పుట్టబోవు ప్రాణులు గాని ఎవ్వరైననూ జరామరణములు లేనివారు లేరు, ఉండబోరు. ఇది నిశ్చయము (37). కాలునకు కాలుడగు శివుడు, మరియు విష్ణువు తక్క ఇతరులకు మరణము తప్పదు. వారు ధర్మాధర్మములకు అతీతులు, నిర్గుణులు, సగుణరూపమును స్వీకరించినవారు (38). జగత్తును పీడించుట కొరకు తపస్సును చేసినచో, దాని ఫలము చేయి జారి పోవునని ఎరింగి, తపస్సును యోగ్యమగు ఫలము కొరకు చేయదగును (39).
ఓ పుణ్యాత్ములారా! మీరు మీ బుద్ధితో స్వయముగా విచారించుడు. దేవతలకు గాని, రాక్షసులకు గాని పొంద శక్యము గాని దుర్లభమగు వరమును గోరి మృత్యువును ప్రక్కన బెట్టుడు (40). కావున బుద్దిని ఉపయోగించి ఏయే కారణముల వలన మరణము సంభవమో, వాటన్నింటి నుండి వేర్వేరుగా రక్షణ కల్గునట్లు వరమును కోరి ఆ మృత్యుహేతువుల నుండి రక్షణను పొందుడు(41).
సనత్కుమారుడిట్లు పలికెను -
వారు బ్రహ్మ గారి ఈ మాటలను విని, ముహూర్తకాలము ధ్యానమునందు నిమగ్నులై, తరువాత మరల ఆలోచించి, సర్వలోకములకు పితామహుడగు బ్రహ్మతో నిట్లనిరి(42).
రాక్షసులిట్లునిరి-
హే భతవాన్! మేము పరాక్రమ వంతులమే అయిననే, మాకు సుఖముగా నివసించదగిన, శత్రువులు ముట్టడించ శక్యము కాని గృహము లేదు (43). మిక్కిలి అద్భుతమైనవి, సర్వసంపదలతో సంపన్నమైనవి, దేవతలకు జయింపశక్యము కానివి అగు మూడు నగరములను నిర్మించి మాకు ఇమ్ము (44). ఓ లోకనాథా! జగద్గురూ! మేము ఆ నగరములను అధిష్ఠించి నీ అనుగ్రహముచే ఈ భూమినంతనూ పరిభ్రమించెదము (45). అపుడు తారకాక్షుడిట్లనెను: విశ్వకర్మ దేవతలకైననూ భేదింపశక్యము కాని బంగారు వికారమైన నగరమును నాకు నిర్మించి ఇచ్చుగాక! (46)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 684🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴
🌻 Description of Tripura (the three cities) - 4 🌻
34. If one is to be swallowed by death in five days, O Brahmā, everything else belonging to him is futile. This is our decisive thought.
Sanatkumāra said:—
35. On hearing the words of those ascetic Asuras, Brahmā replied to them after remembering Śiva, his lord.
Brahmā said:—
36. O Asuras, there cannot be invariable indestructibility. Please desist from asking for it. Seek some other boon whatever you wish.
37. O Asuras, a creature is born, dies and will be born surely. But no one will be free from old age or death in this world.
38. Except Śiva the destroyer of Death, and Viṣṇu all else are mortals. These two are the supervisers of virtue and evil and have manifest and unmanifest forms.
39. If penance is performed for the harassment of the world, it shall be understood as gone. It is only a well-performed penance that can be fruitful.
40. Ponder over this keenly, O faultless ones, desist from seeking immortality. Immortality is impossible for the gods and the Asuras. It is inaccessible. It cannot be warded off.
41. Hence choose a boon whereby you shall do something equal to your own strength.[2]
Sanatkumāra said:—
42. On hearing the words of Brahmā, they thought for a while and then replied to the grandfather of all the worlds.
The Asuras said:—
43. O lord, we have no mansion where we can stay happily although we are valorous and invincible to our enemies.
44. Build and give us three wonderful cities richly endowed with wealth and unassailable even to the gods.
45. O Preceptor of the universe, Lord of the worlds, by your grace we shall move about on the earth occupying these cities.
46. Tārakākṣa then said—“Let Viśvakarmā make a city which cannot be broken even by the gods. Let that golden city be mine”.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment