శ్రీ మదగ్ని మహాపురాణము - 183 / Agni Maha Purana - 183


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 183 / Agni Maha Purana - 183 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 56

🌻. దశదిక్పతియాగ ము - 3 🌻

పూర్వాది దిక్కులలోనున్న ధ్వజములపై కుముద-కుముదాక్ష-పుండరీక-వామన-శంకుకర్ణ-సర్వనేత్ర-సుముఖ-సుప్రతిష్ఠితులను దేవతలను పూజింపవలెను. వీరందరును కోట్లకొలది సద్గుణములు కలవారు. ఎఱ్ఱని దొండపండువలె ఎఱ్ఱగాకాలిన నూడ ఇరువది ఎనిమిది కలశలను నాలుగు శేర్ల నీళ్లతోనింపి 'కాలదండ' మను యోగములేని సమయమున స్థాపింపవలెను. వీటి అన్నింటికి కంఠభాగమునందు వస్త్రములుకట్టి, వాటిలో సువర్ణము ఉంచి, తోరణముల వెలుపల ఉంచవలెను. వేదికి తూర్పుమొదలైన నాలుగు దిక్కులందును, కోణములందును గూడ కలశములు స్థాపింపవెలను. మొదట నాలుగు కలశములను పూర్వాది దిక్కులు నాల్గింటియందు "అజిఘ్ర కలశమ్‌" ఇత్యాది మంత్రము చదువుచు స్థాపింపవలెను.

ఆ కలశలపై, పూర్వాది దిక్కులందు దిక్పాలకులను అవాహనచేసి పూజింపవెలను. "ఐరావతముపై ఎక్కి, హస్తమున వజ్రము ధరించిన దేవరాజువైన ఇంద్రా! ఇతరదేవతలతో కూడ ఇచటికి రమ్ము; ఈ తూర్పు ద్వారమును రక్షింపిము; దేవతాసమేతుడవైన నీకు నమస్కారము'' అని ప్రార్థించుచు ఇంద్రుని ఆవహనచేసి, "త్రాతారమిన్ద్రమ్‌" ఇత్యాదిమంత్రము పఠించుచు పూజింపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 183 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 56

🌻Five divisions of installation - 3 🌻


13-15. The presiding deities of the banners (hoisted) in the (quarters) east etc., such as Kumuda, Kumudākṣa, Puṇḍarīka, Vāmana, Saṅkarṣaṇa, Sarvanetra, Sumukha and Supratiṣṭhita, who are endowed with countless (divine) qualities should. be worshipped. One hundred and eight pitchers resembling the ripe bimba fruit (in colour), not having black spots and having been filled with water and gold and having pieces of cloth around their necks should be placed outside the arches.

16. Pitchers should be placed at the east and other directions. Four pitchers should be placed at the corners of the sacrificial altar with the sacred syllable ājighra.

17. After having invoked Indra and others in the pitchers. in the east etc. one should worship (Indra). O Indra, the lord of celestials, the wielder of thunderbolt, seated on the elephant you come.

18. (You) protect the eastern door in the company of celestials. May salutations be to you. After having worshipped (Indra) with the sacred syllable trātāram indra[1], the wise man should invoke him.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment