నిర్మల ధ్యానాలు - ఓషో - 313


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 313 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రార్ధన అంటే, నేను చిన్నవాణ్ణి, సమస్తం లేదా సంపూర్ణత నాకు సహకరించకుంటే నేను ఏమీ చేయలేను' అని. ప్రార్థన అంటే అహం అనంతానికి లొంగిపోవడం. నిరాశతో కాదు. గాఢమయిన అవగాహనతో లొంగిపోవడం. 🍀


ప్రయాణం ప్రేమతో ఆరంభమై కాంతిలోనో జ్ఞానోదయంలోనో ముగుస్తుంది. దానికి ప్రార్థన వంతెన. సమస్త తీర్థయాత్ర, అజ్ఞానం నించి వివేకానికి సాగేవి. అది ప్రార్థనకు సంబంధించిన తీర్థయాత్ర. ప్రార్ధన అంటే, నేను చిన్నవాణ్ణి, సమస్తం లేదా సంపూర్ణత నాకు సహకరించకుంటే నేను ఏమీ చేయలేను' అని.

ప్రార్థన అంటే అహం అనంతానికి లొంగిపోవడం. నిరాశతో కాదు. గాఢమయిన అవగాహనతో లొంగిపోవడం. చిన్ని అల సముద్రానికి వ్యతిరేకంగా ఎలా వెళుతుంది? అసలు ప్రయత్నమన్నదే అసంగతం. కానీ మానవజాతి చేస్తున్నది అదే. అనంత చైతన్య సముద్రంలో మనం అల్పమైన అలలం. అనంత చైతన్య సముద్రాన్ని దేవుడు, సత్యం, జ్ఞానోదయం, నిర్వాణం తావో, ధర్మం ఏమైనా అనండి. వాటన్నిటి అర్థం ఒకటే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment