శ్రీ మదగ్ని మహాపురాణము - 193 / Agni Maha Purana - 193
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 193 / Agni Maha Purana - 193 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 58
🌻. స్నపనాది విధానము - 5 🌻
బ్రహ్మరథము మీదగాని, పల్లకీ మీదగాని తీసికొని వెళ్ళవలెను. "అతోదేవాః" అను సూక్తము పఠించుచు, "శ్రీశ్చతే లక్ష్మీశ్చ" అను మంత్రము పఠించుచు, ప్రతిమను, పిండికను శయ్యపై చేర్చవలెను. పిమ్మట మహావిష్ణువునకు నిష్కలీకరణ క్రియ చేయవలెను. సింహము, వృషభము, గజము, వ్యజనము, కలశము' పతాక, భేరి, దీపము - ఈ ఎనిమిదియు మంగళ సూచక వస్తువులు, వీటినన్నింటిని, అశ్వసూక్తము పఠించుచు భగవంతునకు చూపవలెను.
'త్రిపాత్' ఇత్యాది మంత్రము చదువుచు భగవంతుని చరణ ప్రాంతమునందు ఉఖ (ఒక విధమైన పాత్ర) దాని మూత, అంబిక (చిన్న బూర్లమూకుడు,) దర్వి (గరిటె) పాత్ర, రోలు, రోకలి, శిల, చీపురు, భోజన పాత్ర, ఇతర గృహ పాత్రలు ఉంచవలెను. తలవైపు వస్త్రములు, రత్నములుంచిన కలశము ఉంచవలెను. ఆ కలశమును పటికబెల్లం ముక్కలతో. నింపవలెను. దానికి 'నిద్రా' అని పేరు. ఈ విధముగ భగవంతుని శయన విధానము చెప్పబడినది.
అగ్ని మహాపురాణమునందు స్నపనాది విధానము ఏబది ఎనిమిదవ అధ్యాయము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 193 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 58
🌻Consecration of the idol (snāna) - 5 🌻
29. (The image) having been raised (by reciting) (the syllable) uttiṣṭha, the lord should be led to the bed in the pavilion with (the recitation of) the hymn śakuna[29] and with (the syllable) brahmaratha.
30. Then the image and the pedestal (should be laid) in the bed with the hymn ato devā.[30] With the (recitation of) śrīsūkta the rite for Viṣṇu is completed.
31. The eight auspicious things are: the lion, bull, serpent, fan, pitcher, banner, trumpet and lamp.
32-33. (The priest) should show (these) at the foot with the hymn (called) aśvasūkta and the tripād (gāyatrī). One should submit a cooking vessel, covering pan, ladle, pestle, crushing stone, grinding stone, groomstick, utensils for eating and other household things should be given to the goddess.
34. A pitcher known as nidrā provided with clothes and gems and filled with edibles (should be placed) at the head-side (of the image). This is the mode of bathing (the image).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment