శ్రీ మదగ్ని మహాపురాణము - 195 / Agni Maha Purana - 195
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 195 / Agni Maha Purana - 195 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 59
🌻. అధివాసనము - 2 🌻
బుద్ధి నుండి అహంకారము, అహంకారమునుండి మనస్సు జనించినది. మనస్సు నుండి శబ్ద-స్పర్శ-రూప-రస- గంధములనెడు సంకల్పాదియుక్తములగు ఐదు విషయములు ఉత్పన్నమైనవి.
వీటినుండి జ్ఞానశక్తి గల త్వక్-శ్రోత్ర-ఘ్రాణ-నేత్ర-జిహ్వలను ఐదు ఇంద్రియములావిర్భవించినవి. వీటికి జ్ఞానేంద్రియములని పేరు. పాద - పాయుపాణి - వాక్ - ఉపస్థలు పంచకర్మేంద్రియములు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము, ఆకాస వాయు తేజో - జల - పృథివులు పంచమహాభూతములు. అన్నింటికిని అధారమగు స్థూలశరీరము ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈతత్త్వములకు వాచకములగు ఉత్తమ బీజాక్షరములను న్యాసమునిమిత్తమైన చెప్పుచున్నాను. 'మం' అను బీజము జీవస్వరూపము (జీవతత్త్వవాచకము) ఇది శరీరమంతయు వ్యాపించయున్నదని భావనచేసి దీనిని సకల దేహవ్యాపకన్యాసము చేయవలెను 'భం' అనునది ప్రాణతత్త్వబీజము, ఇది జీవోపాధియందున్నది.
అందుచే దీనిని దానియందే న్యాసము చేయవలెను. బుద్ధితత్త్వవాచకమగు 'బం' అను బీజమును, విద్వాంసుడు హృదయముపై వ్యాసము చేయవలెను. అహంకారరూపమగు 'ఫం' అను బీజమును కూడ హృదయమునందే న్యాసము చేయవలెను. సంకల్ప కరణ భూతమనస్తత్త్వ రూపమగు 'పం' అను బీజమును గూడ హృదయమునందే న్యాసము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 195 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 59
🌻Preliminary consecration of an image (adhivāsana) - 2 🌻
11. Then intellect came into being associated with the prāṇa and with eight-fold modifications. Egoism was born then and the mind came out from it.
12. Then the five (abstract) things were born possessing determination. They are known as sound, touch, sight, taste and smell.
13. The sense-organs possessing consciousness were brought about by these. The skin, ear, nose, eyes, tongue are the senseorgans.
14. The feet, anus, arms, speech (mouth) and the genitals are the five organs of action. Listen (I shall describe) the five elements.
15. The ether, wind, light, water and earth (are the five elements). The gross body is composed of these elements and becomes the support for all.
16. (I shall presently) describe the mystic syllables signifying these and for being (mentally) placed on (the different parts of) the body. The letter ma which is the symbol of the inner self should be located to co-extend with (the body of) the deity.
17. The letter bha which is the emblem of life should be lodged in the differentiating individuality of the god. The letter ba which represents the intellect should be located in the region of the heart.
18. The letter pha representing the sense of ego should also be located there itself. The letter pa representing the mind should be located in the mental resolve.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment