నిర్మల ధ్యానాలు - ఓషో - 325
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 325 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. అస్తిత్వం ప్రతిక్షణం నీలో గొప్ప శక్తిని నింపుతుంది. నువ్వు ఎట్లా వేరు అని భావిస్తావు? నువ్వు పునర్జన్మించడానికి మరణిస్తావు. పునర్జన్మ వుంటుంది. పునరుత్థానం సంభవమే. 🍀
నువ్వు పునర్జన్మించడానికి మరణిస్తావు. శరీరం చనిపోతుంది. కానీ అది కేవలం అస్తిత్వం నుంచి శరీరాన్ని వేరు చెయ్యడమనే మాత్రమే అనే విషయాన్ని మరిచి పోతున్నారు. అస్తిత్వం ప్రతిక్షణం నీలో గొప్ప శక్తిని నింపుతుంది. నువ్వు ఎట్లా వేరు అని భావిస్తావు? నీ శ్వాస ఆగిపోతే నువ్వు చనిపోతావు. శ్వాసే కాదు అట్లాగే నువ్వు తాగే నీటిని, తిండిని ప్రతిరోజు వదిలేస్తున్నావు. అనుక్షణం జీవితం వస్తూ వుంటుంది. మృతవిషయాలు వెళ్ళిపోతూ వుంటాయి. అది మొదటి మరణానికి, మొదటి రోజుకు ప్రాధాన్యం వహిస్తుంది.
తరువాత మనసు, ఆలోచనలు అవి కూడా బయటినించీ వస్తాయి గాలి నీళ్ళలాగే, నీ మనసు ఆలోచనల్ని అన్ని వేపుల నించీ సేకరిస్తుంది. మనసు కూడా ప్రత్యేక రీతిలో మరణిస్తుంది. మూడో రోజు మరింత సున్నితమయిన విషయం జరుగుతుంది. అది ప్రతీకాత్మకాలు. అనుభూతి, ఉద్వేగం, హృదయం మరణిస్తుంది. అప్పుడు పునర్జన్మ వుంటుంది. పునరుత్థానం సంభవం. శరీరం, మనసు, హృదయం అదృశ్యమవుతాయి. అన్నీ అస్తిత్వంలో ఏకమవుతాయి. హఠాత్తుగా నువ్వు నీది కాని అనంత విశ్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment