1) 🌹 25, MARCH 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 345 / Bhagavad-Gita - 345 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 07 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 192 / Agni Maha Purana - 192 🌹 🌻. స్నపనాది విధానము - 4 / Consecration of the idol (snāna) - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 057 / DAILY WISDOM - 057 🌹 🌻 26. అత్యున్నతమైన అంతిమ కలయిక / 26. The Ultimate Union🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 322 🌹
6) 🌹. శివ సూత్రములు - 59 / Siva Sutras - 59 🌹
🌻. శక్తిసంధానే శరీరోత్పత్తిః - 1 / 19. Śaktisandhāne śarīrotpattiḥ - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 25, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, లక్ష్మీ పంచమి, Vinayaka Chaturthi, Lakshmi Panchami 🌻*
*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 12 🍀*
*21. నమస్తే బలరూపాయ పరేషాం బలనాశినే |*
*నమస్తే స్వర్గసంస్థాయ నమో భూర్లోకవాసినే*
*22. నమః పాతాళవాసాయ నిరాధారాయ తే నమః |*
*నమో నమః స్వతంత్రాయ హ్యనంతాయ నమో నమః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : శబ్దం ద్వారా ఏకాగ్రత - సాధకుడు ఒక శబ్దం పైన తన చైతన్యాన్ని ఏకాగ్రం చేసేటప్పుడు, దేనిని అభివ్యక్తం చేయ్యడానికి ఆ శబ్దం ఉద్దేశించ బడిందో దాని అనుభవం ఆకాంక్షిస్తూ ఆ శబ్దమందు ఇమిడి యున్న ముఖ్య భావమందు నిమగ్నుడు కావడం అవసరం. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
శోభకృత్, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల చవితి 16:24:08 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: భరణి 13:20:18 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వషకుంభ 24:19:36 వరకు
తదుపరి ప్రీతి
కరణం: విష్టి 16:29:09 వరకు
వర్జ్యం: 25:40:00 - 27:18:48
దుర్ముహూర్తం: 07:54:08 - 08:42:53
రాహు కాలం: 09:19:27 - 10:50:52
గుళిక కాలం: 06:16:38 - 07:48:03
యమ గండం: 13:53:40 - 15:25:05
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 08:31:48 - 10:07:32
సూర్యోదయం: 06:16:38
సూర్యాస్తమయం: 18:27:53
చంద్రోదయం: 08:45:12
చంద్రాస్తమయం: 22:02:48
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మేషం
ఆనందాదియోగం: ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని 13:20:18
వరకు తదుపరి ధ్వజ యోగం -
కార్య సిధ్ధి
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 345 / Bhagavad-Gita - 345 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 07 🌴*
*07. సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిమ యాన్తి మామికామ్ |*
*కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యాహమ్ ||*
🌷. తాత్పర్యం :
*ఓ కొన్తేయ! కల్పాంతమున సమస్త భౌతికసృష్టులు నా ప్రకృతి యందు ప్రవేశించును. తదుపరి కల్పారంభమున నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును.*
🌷. భాష్యము :
*ఈ భౌతికసృష్టి యొక్క సృష్టి, స్థితి, లయములు సంపూర్ణముగా శ్రీకృష్ణభగవానుని దివ్యసంకల్పము పైననే ఆధారపడియుండును. ఇచ్చట కల్పాంతమనగా బ్రహ్మదేవుని నిర్వాణము పిదప యని భావము. నూరు సంవత్సరములు జీవించు ఆ బ్రహ్మదేవుని ఒక పగలు 4,300,000,000 భూలోక సంవత్సరములతో సమానము. అతని రాత్రి సమయము కూడా అంతే కాలపరిమాణమును కలిగియుండును. అనగా అతని మాసమున అట్టి పగలు మరియు రాత్రి సమయములు ముప్పదియుండగా, అతని సంవత్సరకాలము పన్నెండు అట్టి మాసములను కలిగియుండును.*
*అటువంటి వంద సంవత్సరములు గడచిన పిమ్మట బ్రహ్మదేవుడు తనువును చాలించినపుడు ప్రళయము సంభవించును. అనగా అట్టి సమయమున అంతవరకు ప్రదర్శితమైన శ్రీకృష్ణభగవానుని శక్తి అతని యందే తిరిగి లయించిపోవును. మరల విశ్వసృష్టి అవసరమైనప్పుడు, ఆ భగవానుని సంకల్పముచే అది తిరిగి ప్రకటితమగును. కనుకనే “బహుస్యాం – నేనొక్కడనే అయినను బహురూపములు దాల్చుదును” అని తెలుపబడినది. ఇది చాందోగ్యోపనిషత్తు మంత్రము (6.2.3). శ్రీకృష్ణభగవానుడు ఆ రీతి భౌతికశక్తి యందు వ్యాపించినపుడు సమస్త విశ్వము తిరిగి ప్రకటితమగును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 345 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 07 🌴*
*07 . sarva-bhūtāni kaunteya prakṛtiṁ yānti māmikām*
*kalpa-kṣaye punas tāni kalpādau visṛjāmy aham*
🌷 Translation :
*O son of Kuntī, at the end of the millennium all material manifestations enter into My nature, and at the beginning of another millennium, by My potency, I create them again.*
🌹 Purport :
*The creation, maintenance and annihilation of this material cosmic manifestation are completely dependent on the supreme will of the Personality of Godhead. “At the end of the millennium” means at the death of Brahmā. Brahmā lives for one hundred years, and his one day is calculated at 4,300,000,000 of our earthly years. His night is of the same duration. His month consists of thirty such days and nights, and his year of twelve months. After one hundred such years, when Brahmā dies, the devastation or annihilation takes place; this means that the energy manifested by the Supreme Lord is again wound up in Himself.*
*Then again, when there is a need to manifest the cosmic world, it is done by His will. Bahu syām: “Although I am one, I shall become many.” This is the Vedic aphorism (Chāndogya Upaniṣad 6.2.3). He expands Himself in this material energy, and the whole cosmic manifestation again takes place.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 192 / Agni Maha Purana - 192 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 58*
*🌻. స్నపనాది విధానము - 4 🌻*
*"కాండాత్ " ఇత్యాది మంత్రముతో నిర్మంథనము చేసి, "గంధవతీ" ఇత్యాది మంత్రముతో గంధమును, "ఉన్నయామి" ఇత్యాది మంత్రముతో పుష్పమాలను, "ఇదం విష్ణుః " ఇత్యాది మంత్రముతో పవిత్రకమును అర్పింపవలెను. "బృహస్పతే" ఇత్యాది మంత్రముతో వస్త్ర ద్వయమును, "వేదాహ మేతమ్" ఇత్యాది మంత్రముతో ఉత్తరీయమును "మహావ్రతేన" ఇత్యాది మంత్రముతో పుష్పములను, ఓషధులను సమర్పింపవలెను. పిమ్మట "ధూరసి" అను మంత్రముతో ధూపము అర్పించి, 'విరాట్' సూక్తముతో అంజనమును, 'యజ్జన్తి' ఇత్యాది మంత్రముతో తిలకమును ఇవ్వవలెను.*
*"దీర్ఘాయుష్ట్వాయు" అను మంత్రముతో పుష్పమాల సమర్పింపవలెను. 'ఇన్ద్రక్షత్రమభి' ఇత్యాది మంత్రముతో ఛత్రమును, 'విరాట్' మంత్రముతో అద్దమును, 'వికర్ణ' మంత్రముతో చామరమును, రథంతర మంత్రముతో అలంకారములను సమర్పింపవలెను. వాయుదేవతకు సంబంధించిన మంత్రములతో వింజామరను, "ముఞ్చామిత్వా" ఇత్యాది మంత్రముతో పుష్పములను సమర్పించి, ఓంకారముతో కూడిన పురుషసూక్తముతో శ్రీ హరిని స్తుతింపివలెను. ఈ వస్తువుల నన్నింటిని పిండి కాదులపైనను శివుడు మొదలగు దేవతలకును ఈ విధముగనే సమర్పింపవలెను. దేవతను పైకి ఎత్తు నపుడు సౌపర్ణ సూక్తమును పఠింపవలెను. "ప్రభోలెమ్ము" అని పలుకుచు శ్రీమహావిష్ణువును ఎత్తి శకుని సూక్తము పఠించుచు మండపము నందలి శయ్యమీదకు తీసికొని వెళ్ళవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 192 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 58*
*🌻Consecration of the idol (snāna) - 4 🌻*
23. The image should be rubbed part by part and perfumes (should be offered) with (the syllable) gandhavat [?note?], garland with (the syllable) unnayāmi and the sacred thread with (the syllable) idaṃ viṣṇu.
24. Pair of cloth pieces (should be offered) (with the syllable) bṛhaspate (and) the upper cloth (with the syllable) vedāham. The herbs and the flower of concluding worship should.. be placed with the mahāvrata.
25. Incense should be offered with dhūrasi and the collyrium (to the eyes of the image) with the hymn (called) vibhrāṭ. The mark on the forehead (should be made) with (the syllable) yuñjanti and the garland (should be offered) with dīrghāyuṣṭvā.
26. (One should offer) an umbrella with (the syllable) indra cchatra, mirror with virāja, the chowrie with vikarṇa and_ the ornaments with rathantara.
27. (One should offer) the fan with (the syllable) vāyu daivatya and flowers with muñcāmi tvā. One should sing in praise of (Lord) Hari (Viṣṇu) with vedic hymns and (the hymn called) puruṣasūkta.
28. All these rites should be performed similarly relating to pedestals of Hara (Śiva) and other gods. The hymn (called) sauparṇa should be recited at the time of raising (the image of) the deity.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 57 / DAILY WISDOM - 57 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 26. అత్యున్నతమైన అంతిమ కలయిక 🌻*
*ఇది జీవాత్మతో ఆత్మ యొక్క అంతిమ కలయిక మరియు ఇది సమాపత్తి యొక్క ఆచరణాత్మకంగా చివరి దశ, ఇక్కడ నది సముద్రంలో ప్రవేశించింది ఇక నదిగా ఉనికిలో లేదు. సముద్రంలో ఏది గంగ, ఏది యమునా, ఏది అమెజాన్, ఏది వోల్గా అని ఎవరికీ తెలియదు. ఎక్కడ ఏముందో ఎవరికీ తెలియదు. ప్రతిదీ ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో ప్రతిచోటా ఉంది.*
*తాను అన్ని విషయాలకు కేంద్రంగా, అన్నింటికీ హృదయంగా మారుతాడు. ఒకటి విశ్వం యొక్క మూల ప్రతిపత్తి అవుతుంది. ఇది ఆధ్యాత్మిక భాషలో దేవుని గూర్చిన అనుభవం. ఇదే సంపూర్ణ, బ్రహ్మ సాక్షాత్కారం. ఇక్కడ చైతన్యం తనకు తానుగా తిరిగి తన సొంత స్థితిపై నిలుస్తుంది. దానికి దేనియందు అవగాహన రాలేదు. దానికి తన గురించి మాత్రమే తెలుసు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 57 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻26. The Ultimate Union 🌻*
*This is the ultimate union of the soul with All-Being and this is the final stage, practically, of samapatti, where the river has entered the ocean and does not any more exist as the river. One does not know in the ocean which is Ganga, which is Yamuna, which is Amazon, which is Volga. No one knows what is where. Everything is everywhere at every time in every condition.*
*One becomes the centre of the Being of all things, the heart of everything. One becomes the Immanent Principle of the cosmos. This is God-Experience, in the language of religion. This is the realisation of the Absolute, brahma-sakshatkara. Here the consciousness reverts to Itself and stands on Its own status. It has not become aware of something. It is aware only of Itself.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 322 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జీవితం తర్కాన్ని అనుసరించి నడవదు. నా దృష్టి ఏమిటంటే వ్యక్తి ప్రయత్నం ప్రయత్న రహితంగా వుండాలి. అంతమంగా అస్తిత్వపు దయ వల్ల ఫలితమందు కుంటాడు. 🍀*
*మనిషి ఆనందం కోసం ప్రయత్నించాలి. పని చేయాలి. అది అస్తిత్వపు అంతిమ వరం. అది వైరుధ్యంగా అనిపిస్తుంది. అది తర్కం కాదు. తర్కం నువ్వు దాని కోసం పని చేస్తే అప్పుడు నువ్వు అందుకున్న వాడివవుతావు అంటుంది. అది అసిత్త్వమిచ్చిన బహుమతి. అందువల్ల నువ్వు పని చేయాల్సిన పని లేదు. అస్తిత్వం ఎప్పుడనుకుంటే అప్పుడు నీకు ఆ బహుమతి నిస్తుంది.*
*అయితే జీవితం తర్కాన్ని అనుసరించి నడవదు. నా దృష్టి ఏమిటంటే వ్యక్తి వ్యక్తి ప్రయత్నం ప్రయత్న రహితంగా వుండాలి. అంతమంగా అస్తిత్వపు దయ వల్ల ఫలితమందుకుంటాడు. సాధారణంగా నువ్వు స్వీకరించడానికే సిద్ధంగా వుండవు. నీ తలుపులు మూసుకుని వుంటావు. హృదయం ముడుచుకుని వుంటావు. అస్తిత్వం అరిచి గీ పెట్టినా వినవు. అస్తిత్వం నీ తలుపుల్ని తడుతుంది. తెరవవు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 059 / Siva Sutras - 059 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻. శక్తిసంధానే శరీరోత్పత్తిః - 1 🌻*
*🌴. అతని సంకల్ప శక్తిని నింపడం ద్వారా సంకల్పం యొక్క స్వరూపం తక్షణం సంభవిస్తుంది.🌴*
*శక్తిసంధానే – శక్తి + సంధానే – ఏకం అయినప్పుడు (సంధాన్ అంటే ఏకం చేయడం) అతని సృజనాత్మక శక్తితో అతని సంకల్ప శక్తి; శరీరోత్పత్తిః -శక్తిసన్ధానే శరీర ఉత్పత్తిః - శరీరాలు సృష్టించబడతాయి. ఉత్పత్తిః అనే పదం యొక్క ఉపయోగం ముఖ్యమైనది. ఎందుకంటే దీని అర్థం ప్రభావం లేదా ఫలితాన్ని ఉత్పత్తి చేయడం. యోగి యొక్క అధిక స్థాయి ఏకాగ్రతతో కూడిన సంకల్ప శక్తియే ఇక్కడి ప్రభావం. దైవిక శక్తిపై అధిక స్థాయి ఏకాగ్రత ప్రత్యక్షీకరణకు దారి తీస్తుందని ఈ సూత్రం చెబుతోంది. యోగి యొక్క ఆలోచనా ప్రక్రియ అత్యున్నత చైతన్యంతో శక్తిని పొందినప్పుడు, కావలసిన ప్రభావాలకు దారి తీస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 059 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 1 - Sāmbhavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 19. Śaktisandhāne śarīrotpattiḥ - 1 🌻*
*🌴. By infusing his energy of will the embodiment of that which is willed occurs at once. 🌴*
*Śaktisandhāne – śakti + sandhāne – Upon uniting (sandhān means uniting) his willpower with his creative energy; śarīrotpattiḥ - śarīra + utpattiḥ - bodies are created. Usage of word utpattiḥ is significant, as it means producing an effect or a result. Here, effect is the union of yogi’s will power with his high level of concentration. This sūtra says that high level of concentration on the divine power causes manifestation. Thought process of a yogi when energized with supreme consciousness, leads to desired effects.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
No comments:
Post a Comment