శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 441 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 441 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 441. 'తుష్టిః' - 2 🌻
శ్రీమాత కొన్ని కోరికలను తీర్చి తృప్తి పరచును. కొన్ని కోర్కెలను తీర్చక శిక్షణ నిచ్చి ఆ కోరికల నుండి ఉత్తీర్ణులను చేయును. ఎట్లైనను తుష్టులను చేయుట ఆమె కార్యము. పురాణములలో తుష్టి మొదలుకొని పోషణము, జ్ఞానము, ధైర్యము, శమము, కల్యాణము, కమనీయత, కీర్తి, ధృతి, లక్ష్మి, శక్తి, శ్రద్ధ, మతి, స్మృతి ఇత్యాది సిద్ధులను శ్రీమాత అనుగ్రహించు నని తెలుపబడినది. కావున సర్వ ప్రయోజనములకు శ్రీమాత ఆరాధనమే జీవులకు ఉపాయమని తెలియనగును. రాబోవు 8 నామములు మరికొన్ని సిద్ధులను తెలుపుచున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 441. 'Tushtih' - 2 🌻
Srimata fulfills certain desires and gives satisfaction. She does not fulfil some and trains the disciple to overcome those desires. Her job is to make people satisfied and content. In the Puranas, it is said that starting from Tushti, Sri Mata grants the siddhas of nutrition, knowledge, courage, calmness, welfare, desire, fame, speed, Lakshmi, Shakti, Shraddha, Mati, Smriti etc. Therefore, Srimata can be worshipped for all purposes. The next 8 names reveal some more siddhas.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment