శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 437 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 437 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀

🌻 437. 'కుళేశ్వరీ’ - 2 🌻


అట్లే పక్షులు, అట్లే మానవులు గూడ. పక్షుల యందు గూడ రాబందులు, రామచిలుకలు కలిసియుండవు. కాకులు, పిచ్చుకలు కలువవు. ఉడుతలు, ఎలుకలు కలువవు. గుణభేదము వలన వైవిధ్యముగల గుంపులు కలువవు. మానవులు గూడ అట్లే గుణ సారూప్యమును బట్టి కలిసి యుందురు. గుణ వైవిధ్యమును బట్టి విడి విడిగ నుందురు. జీవులుగ ఒకరియం దొకరికి సారూప్యమున్ననూ గుణాత్మకులుగ వైవిధ్యము కలుగును. గుణముల అధీనమునందు జీవులు వర్తించు చున్నప్పుడు కులములు, గుంపులు తప్పవు. గుణాధీనమైన వారికి కులము సదుపాయము. గుణముల యందు మార్పు సంభవించినపుడు, కులమార్పులు కూడ సంభవించును. ఇట్లు గుణమును బట్టి కులముల నేర్పరచుచు సృష్టిని నిర్వర్తించుచున్న శ్రీమాత కుళేశ్వరి అని పిలువబడు చున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 437 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻

🌻 437. 'Kuleshwari' - 2 🌻


Among the birds, nesting vultures and parakeets do not mix. Crows and sparrows do not mix. Squirrels and mice do not mix. Diverse groups do not come together because of differences in their Gunas. Human beings are united by similarity of qualities. They are different depending on the difference in quality. Like all living things, there are similarities and differences in qualities. Castes and groups are formed when when beings of diverse qualities form into groups of similar qualities. Caste is provision for a diverse population. When there is a change in qualities, caste changes also occur. Srimata is known as Kuleshwari, who governs this creation skillfully by creating groups of like living things according to this quality.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment