శ్రీ శివ మహా పురాణము - 708 / Sri Siva Maha Purana - 708


🌹 . శ్రీ శివ మహా పురాణము - 708 / Sri Siva Maha Purana - 708 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. త్రిపుర మోహనము - 6 🌻


మరీచుని కుమారుడగు కశ్యపుడు దక్షుని కుమార్తెలగు పదముగ్గురు సుందరీ మణులను ధర్మమార్గములో వివాహమాడినాడు (44). కాని అల్పముగు బుద్ధి, అల్పమగు పరాక్రమము గల ఈనాటి మనుష్యులు 'వీనితో సంభోగించరాదు; వీనితో సంభోగించవచ్చునను' అంటూ వ్యర్ధమగు చర్చలను చేయుచున్నారు (45). బ్రహ్మగారి ముఖము, బాహువులు, ఊరువులు, పాదములనుండి క్రమముగా నాల్గు వర్ణములు జన్మించినవి అను కల్పనను పూర్వీకులు చేసి యుండిరి. ఈ కల్పన విచారము చేసినచో నిలబడదు (46). ఒకే భార్యా భర్తలకు నల్గరు కుమారులు పుట్టినచో, ఒకే దేహమునుండి పుట్టిన ఆ నల్గురు వేర్వేరు వర్ణముల వారు అగుదురా యేమి? (47).

ఈ వర్ణ విభాగము యుక్తి యుక్తముగా ఉన్నట్లు కన్పట్టుట లేదు. కావున ఎక్కడైననూ మానవులందరూ సమానమే. వారిలో భేదమును భావన చేయరాదు (48).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ యతి రాక్షసరాజునకు, పౌరులకు ఇట్లు ప్రవచించి, శిష్యులచే వేదధర్మములను పట్టుదలతో నశింపజేసెను (49). స్త్రీలకు పరమ ధర్మమగు పాతివ్రత్యమును, పురుషులందరు పాటింపదగిన ఇంద్రియ జయమును ఆతడు ఖండించెను (50). ఆతడు దేవ (యజ్ఞాది) ధర్మములను, శ్రాద్ధ ధర్మములను, వ్రతములు మొదలగు వాటిని, ప్రత్యేకించి తీర్థములలో చేయు శ్రాద్ధములను ఖండించెను (51). లింగారాధన పూర్వకముగా చేయు శివపూజను ఆతడు ప్రత్యేకముగా ఖండించెను. యథావిధిగా చేయబడే విష్ణు సూర్య గణేశాది పూజలను ఆతడు ఖండించెను (52).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 708🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 The Tripuras are fascinated - 6 🌻


44. Kaśyapa, the son of Marīci married thirteen of the sweet-eyed daughters of Dakṣa, they say, in accordance with righteous path.

45. But people of modern times whose intelligence and valour are but a modicum unnecessarily wrangle over the fact whether this is proper or improper.

46. Some of the ancestors thought that the four castes are born of mouth, arms, thighs etc. of Brahmā.[1] But when we consider, this does not fit in properly.

47. How can sons born of the same body or from the same body be of four different castes?

48. Hence the divisions of castes and outcastes do not appear to be sound. Hence no difference between man and man should be entertained.

Sanatkumāra said:—

49. O sage, addressing the lord of the Asuras and the citizens thus, the sage with his disciples spoiled the Vedic rites in a determined manner.

50. He then criticised the womanly virtues of chastity and manly virtues of continence etc.

51. Similarly he attacked and repudiated the divine rites, Śrāddhika rites, sacrificial rites and holy observances and festivals, pilgrimages and anniversaries.

52. Worship of Śiva, propitiation of his phallic form, adoration of Viṣṇu, Sun, Gaṇeśa and other deities in accordance with the sacred texts were repudiated by him.


Continues....

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment