శ్రీ మదగ్ని మహాపురాణము - 205 / Agni Maha Purana - 205
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 205 / Agni Maha Purana - 205 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 60
🌻. వాసుదేవ ప్రతిష్ఠా విధి - 5 🌻
నమస్కరించి, స్తుతించి, స్తోత్రాదులు పఠించి, అష్టాక్షర్యాదిమంత్రములు జపించుచు భగవంతు డచట సన్నిహితుడై యున్నాడని గ్రహింపవలెను.
పిమ్మట ఆచార్యుడు దేవాలయమునుండి బైటకు వచ్చి ద్వారమువద్ద నున్న చండ -ప్రచండులను ద్వారపాలకులకు పూజ చేయవలెను. మరల మండపములోనికి వెళ్ళి గరుత్మంతుని స్థాపింపవలెను. అన్ని దిక్కులందును ఆ యా దిక్పాలకులను, ఇతరదేవతలను స్థాపించి, శంఖచక్రాదులకు గూడ పూజ చేయవలెను. అందరు పార్షదులకును, భూతములకును బలి సమర్పింపవలెను. (యజమానుడు) ఆచార్యునకు గ్రామ-వస్త్ర-సువార్ణదులను దక్షిణగా ఈయవలెను. యజ్ఞమునకు ఉపయోగించు ద్రవ్యములు కూడ ఆచార్యున కీయవలెను. ఋత్విక్కులను ఆచార్యదిక్షిణలో సగ మీయవలెను. పిమ్మట బ్రాహ్మణులకు గూడ దక్షిణ ఇచ్చి భోజనము పెట్టవలెను. అచచటకు వచ్చు బ్రహ్మణు నెవ్వనిని అడ్డుపెట్టరాదు. అందరిని సత్కరించవలెను. పిమ్మట గురువు యజమానునకు ఫల మీయవలెను. భగద్విగ్రహప్రతిష్ఠ చేసిన పుణ్యాత్ముడు తన వంశీయు లందరిని తనతో పాటు శ్రీమహావిష్ణువు సమీపమునకు తీసికొని పోవును. ఇది అందరు దేవతలకును సాధారణమైన విధానము కాని ఆ యా దేవతల మూలమంత్రములు మాత్రము వేరు వేరుగ నుండను. మిగిలిన కార్యము లన్నియు సమానమే.
అగ్నిమహాపురాణమునందు వాసుదేవప్రతిష్ఠాది విధి యను ఆరువదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 205 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 60
🌻Mode of installation of the image of Vāsudeva - 5 🌻
29-30. (The priest) should infer the presence of the god from the yātrā[12] and varṣā[13]. Having saluted and sung the glories and recited the mantras of eight syllables[14] etc., the priest should come out and worship Caṇḍa and Pracaṇḍa (the two guardians) at the gate. (The priest) should go to the place of sacrificial fire, install the image of Garuḍa (the vehicle bird of Lord Viṣṇu) and worship.
31. Having installed and worshipped (the images) of different presiding deities of the quarters in their respective quarters, the priest should install the image of Lord Viṣvaksena[15] and worship the conch, disc etc.
32. Offerings should be made to the attendant gods and to the goblins. The priest should be given the fees—(which may be of the form of) proprietary right over a village, clothes and gold.
33. The materials required for (the performance of) sacrificial ceremony should be given to the principal priest. The attendant priests should be paid fees half of what was paid to the principal priest.
34. The other priests should be paid their fees. The brahmins should then be fed. Without any restraint the benefits of sacrifice should be extended to the patron-employer by the principal priest.
35. The consecrator of the image of Viṣṇu leads the self,. as well as his entire family (to the region of the god). This is the general mode of performance for all gods. Only the principal mantra would be different. The other formalities are the same.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment