నిర్మల ధ్యానాలు - ఓషో - 335


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 335 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానమంటే చైతన్యాన్ని సృష్టించే మార్గం. అది నిన్ను చురుగ్గా మెలకువగా వుండమంటుంది. నువ్వు చైతన్యంతో వుంటే నీ జీవితం మారడం మొదలుపెడుతుంది. నీ పని, నీ అస్తిత్వం గాఢమయిన సమశృతిలో సాగాలి. 🍀

హిపోక్రసీ అంటే నువ్వు ఒక లాంటివాడివి. కానీ యింకొకడిలా కనిపించాలని ప్రయత్నించడం. నీకు తెలుసు. ఆ విషయం నిన్ను బాధ పెడుతుంది. ఫలితం విషాదం. సమస్త ప్రపంచం వ్యక్తిత్వాన్ని, నీతిని సృష్టింస్తుంది. నాకు వ్యక్తిత్వం మీద ఆసక్తి లేదు. నీతిపైన ఆసక్తి లేదు. నేను జనాలకు నీతి లేకుండా వుండమని బోధిస్తాను. నేను జనాల్ని చైతన్యంగా వుండమని బోధిస్తాను. చైతన్యాన్ని సృష్టించమంటాను. ధ్యానమంటే అదే.

ధ్యానమంటే చైతన్యాన్ని సృష్టించే మార్గం. అది నిన్ను చురుగ్గా మెలకువగా వుండమంటుంది. నువ్వు చైతన్యంతో వుంటే నీ జీవితం మారడం మొదలుపెడుతుంది. నీ పని, నీ అస్తిత్వం గాఢమయిన సమశృతిలో సాగాలి. నీ చర్య, నీ అస్తిత్వం సమశృతిలో వుంటే జీవితం ఆనందంగా వుంటుంది, నాట్యంటాగా వుంటుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment