శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 446 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 446 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀

🌻 446. 'స్వస్తిమతిః'- 1 🌻


క్షేమము కలది శ్రీమాత అని అర్థము. స్వస్తి అను పదము ను అస్తి నుండి ఏర్పడినది. అస్తి అనగా వుండుట. సు ఆస్తి అనగా బాగుగా వుండుట. హాయిగా వుండుట. క్షేమముగా నుండుట. సుఖముగా నుండుట. ఏ జీవుడైననూ కోరునది ఈ స్థితియే. ఏ కోరికా లేని స్థితి ఇది. కోరికలన్నీ తీరిన స్థితి. పూర్ణమగు స్థితి. ఈ స్థితిని పొందుటకే స్వస్తి చిహ్నమగు (45) స్వస్తికమును ఆరాధించు సంప్రదాయ మేర్పడినది. భౌతిక దేహము నుండి అన్ని దేహ పొరల యందు లేక కోశముల యందు, లేక లోకముల యందు సుఖముగ నుండుట జీవన్ముక్తి. అనగా ఏదియూ బంధింపని స్థితి. యోగులు, సిద్దులు, తపస్విజనులు సత్సాధన ద్వారా ఈ స్థితిని పొందుటకు ప్రయత్నింతురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻

🌻 446. 'Swastimatih'- 1 🌻


It means Sri Mata has safety or security. The word Swasti is derived from Asti. Asti means being. Su Asti means to be well. to be comfortable be safe to be comfortable. This is the state that any living being desires. This is the state of having no desire. A state where there are no desires. Perfect condition. It is to attain this state that the tradition of worshiping the swastika symbol (45) is distinguished. Liberation is to be comfortable from the physical body to all the layers of the body, or to the koshams, or to the worlds. That is, the state of not being bound by anything. Yogis, Siddhas and ascetics try to attain this state through noble spiritual practice.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment