🌹 . శ్రీ శివ మహా పురాణము - 713 / Sri Siva Maha Purana - 713 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 06 🌴
🌻. శివస్తుతి - 4 🌻
నీవు ఈ లోకములో సృష్టించిన వివిధ ప్రాణి సమూహములను మేము పూర్తిగా చూడజాలము. దేవతలు, రాక్షసులు, బ్రాహ్మణులు, మరియు ఇతర చరాచర ప్రాణులు నిన్నే శరణు జోచ్చు చున్నారు (25). ఓ దేవ దేవా! శంభో! మాకు నీవు తక్క మరియొక గతి లేదు. త్రిపురాసురులు దేవతలను ఇంచుమించు నశించిన వారినిగా చేసినారు. నీవు క్షణములో ఆ రాక్షసులను సంహరించి మమ్ములను కాపాడుము (26). ఓ పరమేశ్వరా! వారీనాడు నీ మాయచే మోహమును పొంది యున్నారు. ఓ ప్రభూ! విష్ణువు చెప్పిన ఉపాయముచే వారు ధర్మ భ్రష్టులై ఉన్నారు (27).
ఓ భక్త ప్రియా! మా భాగ్యవశముచే ఆ రాక్షసులు సర్వధర్మములను విడనాడి బౌద్ధధర్మము నాశ్రయించి ఉన్నారు (28). శరణు నిచ్చువాడా! నీవు సర్వదా దేవాకార్యములను చేయుచుంటివి. మేము నిన్ను శరణు జొచ్చితిమి . నీకు నచ్చిన రీతిని చేయుము (29).
సనత్కుమారుడిట్లు పలికెను-
దేవతలు దీనులై తలలు వంచి చేతులు జోడించి ఈ విధముగా మహేశ్వరుని స్తుతించి ఆయన యెదుట నిలబడిరి (30). ఇంద్రుడు మొదలగు దేవతలు ఇట్లు స్తుతించగా, మరియు విష్ణువు చేసిన జపము చేత ఆనందించిన సర్వేశ్వరుడగు శివుడు వృషభము నధిష్ఠించి అచటకు విచ్చెసెను (31). ప్రసన్నమగు మనస్సు గల శివుడు వృషభము (నంది) నుండి దిగి విష్ణువును కౌగిలించు కొని నందిపై చేతిని ఉంచి దయతో కూడిన చూపులతో అందరినీ చూచెను (32). పార్వతీపతి యగు హరుడు దయా దృష్టితో దేవతలను, విష్ణువును చూచి, ప్రసన్నుడై గంభీరమగు వాక్కుతో ఇట్లనెను (33).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 713🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 06 🌴
🌻 Prayer to Śiva - 4 🌻
25. The various living beings created by you and to be created in future are invisible to us. The gods, the Asuras, the brahmins, nay, the mobile and immobile beings eulogise you alone.
26. O Śiva, dear to the gods, save us, the gods who have no other go, by killing all the Asuras instantaneously. We are practically destroyed by the Tripuras.
27. O lord Śiva, they are now deluded by your magic. O lord, they have gone astray from the virtuous path through the expedient taught by Viṣṇu.
28. O lord, favourably disposed towards your devotees, those Asuras have resorted to Buddha’s religion and philosophy, thanks to our good fortune and hence they have eschewed all Vedic sacred rites.
29. You have always been the only one carrying out the task of the gods and the bestower of refuge. We have sought refuge in you. Please do as you desire.
Sanatkumāra said:—
30. After eulogising lord Śiva thus, the distressed gods stood in front of him with palms joined in reverence and kneeling low.
31. Eulogised thus by Indra and others and by the repetition of Japas by Viṣṇu, the delighted lord came there seated on his bull.
32. Getting down from Nandīśa and embracing Viṣṇu, lord Śiva delighted in his mind cast his benign look on all with his hand resting on Nandin.
33. Casting a sympathetic glance on the gods, the delighted Śiva, lord of Pārvatī, spoke to Viṣṇu in a majestic tone.
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment