శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 446 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 446 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀

🌻 446. 'స్వస్తిమతిః'- 3 🌻


ఉదాహరణకు బ్రహ్మర్షి యగు వశిష్ఠుడు అట్టి స్వస్తిమతి. విశ్వామిత్రుడు చేయు విన్యాసములను అతడు చిరునవ్వుతో దర్శించెను గాని ప్రతిస్పందించ లేదు. అట్లే పట్టాభిషేక సమయమున రాముడు వనవాసముల కేగుచున్నప్పుడు కూడా అడ్డుపడలేదు. విపత్కర పరిస్థితులలో కూడ అతడు చలించలేదు. తన నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు సంహరించినపుడు చలింపక స్థిరమతియై యుండెను. స్వస్తికి శ్రీమాతయే మూలము. ఆమెయే గురువు. ఆమె చైతన్యమే బ్రహ్మర్షుల యందు మరియు క్రూర మృగముల యందు కూడ యున్నది. ఎందున్నను తాను తానుగనే యుండును. కాలము దేశము రూపము తనపై ప్రభావము చూపవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 446 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻

🌻 446. 'Swastimatih'- 3 🌻


For example Brahmarshi Vasishtha is such Swastimati. He watched Vishwamitra's maneuvers with a smile but did not respond. Similarly, at the time of coronation, when Rama went to the forest, he did not stop him. He was not perturbed even in dire situations. When Vishwamitra killed his 100 sons, he remained unmoved and steady of mind. Srimata is the source of auspiciousness. She is the teacher. Her consciousness is present in Brahmarshis and wild beasts. Wherever she is, she is herself. Time, space and appearance do not affect her.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment