శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 447 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 447 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 447 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 447 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀
🌻 447. 'కాంతిః'- 1 🌻
సహజముగ కాంతి గలది శ్రీమాత అని అర్థము. ఏమియూ లేనట్లున్న స్థితి నుండి తనకు తానుగ వ్యక్తమగునది శ్రీమాత. అవ్యక్తము నుండి వ్యక్తమగుట వలన వెలుగు అందురు. వెలుపలకు వచ్చిన శక్తి గనుక వెలుగు. వెలుగనగా కంటికి కనిపించు వెలుగు మాత్రమే కాదు. కనిపించుట, వినిపించుట, యిత్యాదివి చిల్లర వెలుగులు. అనిపించుట కూడ వెలుగే. ప్రతి ఒక్కరికి నేనున్నానని అనిపించును. ఈ అనిపించుట ప్రప్రథమమగు వెలుగు. ఇతరము లన్నియూ ఇది ఆధారముగ అనిపించును. నిద్ర యందు కూడ జీవుడున్నాడు. కాని వున్నాను అని తెలియదు. ఇట్లు తెలియుట ఆది వెలుగు. అదియే కాంతి. అదియే ప్రకటింపబడిన ప్రజ్ఞ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 447 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻
🌻 447. 'Kantih'- 1 🌻
It means that Srimata has a natural radiance. Srimata manifests herself from the state of nothingness. Because she manifests from the unmanifest, light is cited. Light is due to energy that comes out. Light is not just visible light. Seeing, hearing, etc. are trivial lights. Feeling is also light. Everyone has the feeling of I exist. This feeling is our first light. This feeling is the primary light on which all others depend. There is life even in sleep. But there is no knowledge of I exist here. Knowing this is the first light. That is the light. That is the revealed wisdom.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment