శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 451 / Sri Lalitha Chaitanya Vijnanam - 451
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 451 / Sri Lalitha Chaitanya Vijnanam - 451 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 451. ‘త్రినయనా' 🌻
మూడు కన్నులు గలది శ్రీమాత అని అర్థము. సోమ, సూర్య, అగ్ని నేత్రములు శ్రీమాత నేత్రములు. ప్రజ్ఞ, పదార్థము, శక్తి ఈ మూడునూ తన మూడు నేత్రముల నుండి సృష్టించి పోషించి తనలోనికి లయము చేసుకొనును. సత్వ, రజస్, తమో గుణములను ఉద్భవింపజేసి అందుండి లోకముల నేర్పరచి జీవులను ప్రవేశింపజేసి జగన్నాటకమును త్రినేత్రములతో శ్రీమాత నిర్వర్తించు చుండును. సృష్టి అంతటినీ త్రిగుణాత్మకముగ త్రినేత్రములతో నిర్మించును. త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రికాలములు, త్రివర్ణములు, త్రిలోకములు - ఇట్లంతయూ త్ర్యంబకమై నిర్వర్తింపబడు చున్నది. త్రిమూర్తుల నుండి మూడు కోట్ల దేవతల నేర్పరచుట కూడ యిట్టిదే. త్రిభుజము శ్రీమాత కత్యంత ప్రియమగు చిహ్నము. శ్రీమాతను చేరుటకు కూడ త్రిమార్గము లున్నవి. అవియే భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములు. మొత్తము శ్రీమాత వ్యూహమంతయూ వివిధ త్రయీమయమగు నామములుగ ముందు కూడ చెప్పబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 451 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 451. 'Trinayana' 🌻
It means that Srimata is The one with three eyes. The eyes of Soma, Surya and Agni are the eyes of Sri Mata. Prajna, matter and energy are created, maintained and finally consumed by these eyes. Srimata creates Sattva, Rajas and Tamo qualities, creates the worlds, introduces living beings into these worlds and conducts the play of the universe with these three eyes. All creation is conducted as a triumvirate of Gunas with these three eyes. Trimurti, trishakti, trikalam, trivarna, trilokam - all this is performed as trinity. The creation of three crore devathas from the Trinity of Gods is similar to this. The triangle is the most beloved symbol of Sri Mata. There are also three ways to reach Srimata. They are the paths of devotion, knowledge and dispassion. The entire plan Srimata is also explained as Trinity of Her names.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment