🌹 14, MAY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 14, MAY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 14, MAY 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🌹. హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Hanuman Jayanti to All. 🌹*
*- ప్రసాద్ భరద్వాజ*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 370 / Bhagavad-Gita - 370 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 32 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 217 / Agni Maha Purana - 217 🌹 
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 1 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 082 / DAILY WISDOM - 082 🌹 
🌻 22. వేదం మొత్తం 'ఓం' లోపల ఉంది / 22. The Whole of the Veda is Inside “Om” 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 347 🌹
6) 🌹. శివ సూత్రములు - 84 / Siva Sutras - 84 🌹 
🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 4 / 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 14, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*🍀. హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Hanuman Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హనుమాన్‌ జయంతి, Hanuman Jayanti 🌻*

*🍀. శ్రీ హనుమ స్తోత్రం 🍀*

*హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః*
*రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక సంసిద్ధి - ఆధ్యాత్మిక సంసిద్ధికి రెండు పరస్పర విభిన్న రూపాలున్నాయి. ఒక దాని యందు సాధకుడు నామరూపాత్మకమైన సమస్త జగత్తు నుండి ఉపరమించి తనలోని ఈశ్వరతత్త్వమందు లీనమవుతాడు. రెండవదాని యందు అతడు సమస్త జగత్తులోనూ ఆత్మదర్శనమూ, ఈశ్వరదర్శనమూ చేస్తూ తద్ద్వారా విశ్వాత్మకతను అందుకుంటాడు. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ దశమి 26:47:30 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: శతభిషం 10:16:52 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: ఇంద్ర 06:35:51 వరకు
తదుపరి వైధృతి
కరణం: వణిజ 15:45:18 వరకు
వర్జ్యం: 16:22:08 - 17:53:40
దుర్ముహూర్తం: 16:56:56 - 17:48:39
రాహు కాలం: 17:03:24 - 18:40:23
గుళిక కాలం: 15:26:26 - 17:03:24
యమ గండం: 12:12:29 - 13:49:27
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 03:28:00 - 04:58:40
మరియు 25:31:20 - 27:02:52
సూర్యోదయం: 05:44:34
సూర్యాస్తమయం: 18:40:23
చంద్రోదయం: 01:56:45
చంద్రాస్తమయం: 13:52:27
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 10:16:52 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Hanuman Jayanti to All. 🌹*
*- ప్రసాద్ భరద్వాజ*

*🪷. శ్రీ హనుమత్ కవచం 🪷* 

అస్య శ్రీ హనుమత్ కవచస్తోత్రమహామంత్రస్య వసిష్ఠ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ హనుమాన్ దేవతా మారుతాత్మజ ఇతి బీజం అంజనాసూనురితి శక్తిః వాయుపుత్ర ఇతి కీలకం హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః 

1. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం
యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయమ్ ౧

2. మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి ౨

3. ఉద్యదాదిత్య సంకాశం ఉదారభుజ విక్రమమ్ |
కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్ ౩

4. శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహమ్ |
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్ ౪

5. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ౫

6. పాదౌ వాయుసుతః పాతు రామదూతస్తదంగుళీః |
గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్ణవలంఘనః ౬

7. జానునీ మారుతిః పాతు ఊరూ పాత్వసురాంతకః |
గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః ౭

8. ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనః |
ఉదరం పాతు హృద్గేహీ హృదయం చ మహాబలః ౮

9. వక్షో వాలాయుధః పాతు స్తనౌ చాఽమితవిక్రమః |
పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్ ౯

10. కరావక్ష జయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః |
పృష్ఠం భవిష్యద్ర్బహ్మా చ స్కంధౌ మతి మతాం వరః ౧౦

11. కంఠం పాతు కపిశ్రేష్ఠో ముఖం రావణదర్పహా |
వక్త్రం చ వక్తృప్రవణో నేత్రే దేవగణస్తుతః ౧౧

12. బ్రహ్మాస్త్రసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా |
కామరూపః కపోలే మే ఫాలం వజ్రనఖోఽవతు ౧౨

13. శిరో మే పాతు సతతం జానకీశోకనాశనః |
శ్రీరామభక్తప్రవరః పాతు సర్వకళేబరమ్ ౧౩

14. మామహ్ని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయశాః |
వివస్వదంతేవాసీ చ సంధ్యయోః పాతు సర్వదా ౧౪

15. బ్రహ్మాదిదేవతాదత్తవరః పాతు నిరంతరమ్ |
య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః ౧౫

16. దీర్ఘమాయురవాప్నోతి బలం దృష్టిం చ విందతి |
పాదాక్రాంతా భవిష్యంతి పఠతస్తస్య శత్రవః |
స్థిరాం సుకీర్తిమారోగ్యం లభతే శాశ్వతం సుఖమ్ ౧౬

17. ఇతి నిగదితవాక్యవృత్త తుభ్యం
సకలమపి స్వయమాంజనేయ వృత్తమ్ |
అపి నిజజనరక్షణైకదీక్షో
వశగ తదీయ మహామనుప్రభావః ౧౭

ఇతి శ్రీ హనుమత్ కవచమ్ ||
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 370 / Bhagavad-Gita - 370 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 32 🌴*

*32. మాం హి పార్థా వ్యపాశ్రిత్య యేపి స్యు: పాపయోనయ: |*
*స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాన్తి పరాం గతిమ్ ||*

🌷. తాత్పర్యం :
*ఓ పార్థా! నా శరణుజొచ్చువారు అధమజన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికిని పరమగతిని పొందగలరు.*

🌷. భాష్యము : 
*భక్తిలో ఉచ్చ, నీచ జనుల నడుమ భేదభావము ఉండదని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా ప్రకటించుచున్నాడు. భౌతికభావనము నందున్నప్పుడు అట్టి విభాగములు ఉండవచ్చును గాని భగవానుని భక్తియుతసేవ యందు నియుక్తుడైనవానికి అట్టివి ఉండవు. ప్రతియొక్కరు పరమగతిని పొందుటకు అర్హులై యున్నారు. చండాలురు (శునకమాంసము భుజించువారు) యని పిలువబడు అతినీచతరగతికి చెందినవారు సైతము శుద్ధభక్తుని సంగములో పవిత్రులు కాగలరని శ్రీమద్భాగవతము (2.4.18) తెలుపుచున్నది. భక్తియోగము మరియు భక్తుల మార్గదర్శనము అనునవి అత్యంత శక్తివంతమగుటచే ఉచ్చ, నీచ తరగతి జనుల నడుమ భేదభావమును కలిగియుండవు. ఎవ్వరైనను అట్టి భక్తుని స్వీకరింపవచ్చును. అతిసామాన్యుడు సైతము భక్తుని శరణము నొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు.*

*వాస్తవమునకు గుణముల ననుసరించి మనుజులు సత్త్వగుణప్రధానులని (బ్రాహ్మణులు), రజోగుణప్రధానులని (క్షత్రియులు), రజస్తమోగుణ ప్రధానులని (వైశ్యులు), తమోగుణప్రదానులని (శూద్రులు) నాలుగు తరగతులుగా విభజింపబడిరి. ఈ నాలుగు తరగతుల కన్నను నీచమైనవారు పాపయోనులైన చండాలురు. సాధారణముగా అట్టి పాపజన్ముల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందినవారు అంగీకరింపరు. కాని భక్తియోగము అత్యంత శక్తివంతమైనదగుటచే శుద్ధభక్తుడు సమస్త నీచజనులు సైతము అత్యున్నత జీవనపూర్ణత్వమును బడయునట్లుగా చేయగలడు. శ్రీకృష్ణభగవానుని శరణుజొచ్చుట ద్వారానే అది సాధ్యము కాగలదు. కనుకనే “వ్యపాశ్రిత్య” యను పదముచే సూచింపబడినట్లు ప్రతియొక్కరు శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పొందవలెను. అంతట మనుజుడు ఘనులైన జ్ఞానులు, యోగుల కన్నను అత్యంత ఘనుడు కాగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 370 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 32 🌴*

*32. māṁ hi pārtha vyapāśritya ye ’pi syuḥ pāpa-yonayaḥ*
*striyo vaiśyās tathā śūdrās te ’pi yānti parāṁ gatim*

🌷 Translation : 
*O son of Pṛthā, those who take shelter in Me, though they be of lower birth – women, vaiśyas [merchants] and śūdras [workers] – can attain the supreme destination.*

🌹 Purport :
*It is clearly declared here by the Supreme Lord that in devotional service there is no distinction between the lower and higher classes of people. In the material conception of life there are such divisions, but for a person engaged in transcendental devotional service to the Lord there are not. Everyone is eligible for the supreme destination. In the Śrīmad-Bhāgavatam (2.4.18) it is stated that even the lowest, who are called caṇḍālas (dog-eaters), can be purified by association with a pure devotee. Therefore devotional service and the guidance of a pure devotee are so strong that there is no discrimination between the lower and higher classes of men; anyone can take to it. The most simple man taking shelter of the pure devotee can be purified by proper guidance.*

*According to the different modes of material nature, men are classified in the mode of goodness (brāhmaṇas), the mode of passion (kṣatriyas, or administrators), the mixed modes of passion and ignorance (vaiśyas, or merchants), and the mode of ignorance (śūdras, or workers). Those lower than them are called caṇḍālas, and they are born in sinful families. Generally, the association of those born in sinful families is not accepted by the higher classes. But the process of devotional service is so strong that the pure devotee of the Supreme Lord can enable people of all the lower classes to attain the highest perfection of life. This is possible only when one takes shelter of Kṛṣṇa. As indicated here by the word vyapāśritya, one has to take shelter completely of Kṛṣṇa. Then one can become much greater than great jñānīs and yogīs.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 217 / Agni Maha Purana - 217 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*

*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 1 🌻*

*హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! ఇపుడు కూపములు, దిగుడుబావులు, చెరువులు ప్రతిష్ఠచేయు విధిని చెప్పెదను; శ్రీహరియే జలరూపముచే దేవ శ్రేష్ఠుడైన సోముడుగాను, వరుణుడు గాను ఆయెను. ప్రపంచ మంతయు అగ్నిషోమమయము. జలరూపుడైన నారాయణుడు దానికి కారణము. బంగారముతో, లేదా వెండితో, లేదా రత్నములతో వరుణుని ప్రతిమ చేయించవలెను. వరుణదేవునకు రెండు భుజములతో, హంసారుఢుడై, నదులతోడను, కాలువలతోడను కూడియుండును. అతని కుడి చేతిలో అభయముద్రయు, ఎడమచేతిలో నాగపాశము ప్రకాశించుచుండును. యజ్ఞమండప మధ్యభాగమున కుండముతో ప్రకాశించు వేదిక నిర్మించి దాని తోరణమున పూర్వద్వారమున కమండలసహితముగా వరుణకలశము స్థాపింపవలెను, భద్రకమున (దక్షిణద్వారమున)ను, అర్ధచంద్రమునను (పశ్చిమద్వారముదను) స్వస్తికమునను (ఉత్తరద్వారమునను) వరుణగకలశములు స్థాపించవలెను. కుండమునందు అగ్న్యాధానము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను.*

*"యే తే శతం వరుణ" ఇత్యాదిమంత్రముతో స్నానపీఠముపై వరుణుని స్థాపింపవలెను. మూలమంత్రము నుచ్చరించుచు, ఆచార్యుడు, వరుణదేవతాప్రతిమకు ఘృతము పూయవలెను. "శం నో దేవీ" ఇత్యాదిమంత్రముతో ప్రక్షాళనముచేసి, "శుద్ధవాలః," "సర్వశుద్ధవాలః" ఇత్యాదిమంత్రములతో, పవిత్ర జలముచే స్నానము చేయించవలెను. పిమ్మట స్నానపీఠమునకు పూర్వాది దిక్కులందు కలశములను స్థాపించవలెను. తూర్పుననున్న కలశమున సముద్రజలము, అగ్నేయమున నున్న కలశమున గంగాజలము, దక్షిణ కలశమున వర్షాజలము, నైరృతికలశమున సెలయేరు నీరు, పశ్చిమకలశమున నదీజలము వాయవ్య కలశమున కొండకాలువ నీరు, ఉత్తరకలశమున కాలువల నీరు, ఈశాన్యకలశమున తీర్థజలములను ఉంచవలెను. ఈ వివిధజలములు లభించనిచో నదీజలమే ఉంచవలెను. ఈ అన్ని కలశములను "యాసాం రాజా" ఇత్యాది మంత్రముచే అభిమంత్రించవలెను. విద్వాంసుడైన పురోహితుడు "సుమిత్రయా" ఇత్యాది మంత్రముతో మార్జననిర్మంథనములు చేయవలెను. "చిత్రం దేవానామ్‌" "తచ్చక్షుర్దేవహితమ్‌" అను మంత్రములతో తేనె, నెయ్యి పంచదార అను మధురత్రయముచే నేత్రములను తెరువలెనుః ఆ సువర్ణమయ వరుణ ప్రతిమపై జ్యోతిస్సును పూజించి ఆచార్యునకు గోదాన మీయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 217 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 1 🌻*

The Lord said:

l. I shall describe the (mode of) consecration of wells, tanks and ponds [i.e., kūpa, kūpaka]. Listen! Lord Hari (Viṣṇu) as Soma and excellent Varuṇa remains in the form of water.

2. The universe is permeated by fire and water. Viṣṇu in the form of water is its cause. The image of Lord Varuṇa (the presiding deity of waters) should be made of gold, silver or gems.

3. (The image should have) two hands, the right conferring refuge and the left should hold the snake-noose and as seated on the haṃsa along with the rivers and serpents.

4. There should be an altar at the centre of sacrificial shed having a fire-pit. There should be an arch. A pitcher made of stone for Lord Varuṇa should be placed.

5. Pitchers (should be placed) at the entrance to the fire receptacle which may be of a semi-circular shape or a svastika of auspicious nature. Having done the agnyādhāna (rite) in the pit for water the final oblation should be done.

6. (The image of) Varuṇa should be touched in the bathing seat with (the mantra) ye te śate[1]. It should then be anointed with ghee by the priest with (the recitation of) the principal mantra.

7. Having washed the eight pitchers with pure water with (the recitation of) śaṃ no devī[2] they should be consecrated. Sea water (should be kept) in the eastern pitcher.

8-9. Having kept the Ganges water in the (pitcher on the) south-east, rain water in the (pitcher on the) south, water from waterfalls in the (pitcher on the south-west, river water in the west, water from a masculine river in the north-west, spring water in the north, waters from sacred places (should be kept) in the north-east. In the absence of all the above, river water (should be poured into these pitchers) with the chanting of yāsāṃ rājā[3].

10. After having cleansed and anointed the eyes with the three sweet things (honey, sugar and clarified butter) with (the mantra) durmitriya[4], they should be opened with Citram[5] and taccakṣuḥ[6].

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 82 / DAILY WISDOM - 82 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 22. వేదం మొత్తం 'ఓం' లోపల ఉంది 🌻*

*మీరు బైబిల్ యొక్క ఈ గొప్ప భాగాన్ని విన్నారు: 'ఆదిలో శబ్దం ఉంది. శబ్దం దైవంతో ఉంది, మరియు శబ్దమే దైవము అయి ఉంది.' అలాంటిదే ఉపనిషత్తు ఇక్కడ మనకు చెబుతోంది. బ్రహ్మం నుంచి శబ్దబ్రహ్మం, ఆ శబ్దబ్రహ్మం నుంచి విశ్వం ఏర్పడ్డాయి. ఇక్కడ దైవం నుంచి పూట్టి దైవమే అయినటువంటి ఆ శబ్దం, కేవలం మనం పలికే ఒక అక్షరం కాదు. అది ఒక శక్తి. ఇది వస్తు రూపంలోకి సాకారమైన శక్తి, ఒక ప్రకంపన.*

*ఆ శబ్దమే వేదం, లేదా భగవంతునితో ఉన్న శాశ్వతమైన జ్ఞానం. అది భగవంతుని నుండి విడదీయరానిది, కనుక ఇది దైవమే. విశ్వ మనస్సు ఈ శాశ్వత జ్ఞానం రూపంలో తనను తాను వ్యక్తపరచుకుని ఈ విశ్వాన్ని సృష్టించింది. మనుస్మృతిలో, మరియు ఇతర ప్రాచీన గ్రంథాలలో, సృష్టికర్త అయిన ప్రజాపతి, 'ఓం' లేదా ప్రణవంతో మొత్తం విశ్వాన్ని రూపొందించాడని మనకు చెప్పబడింది. ప్రణవము, లేదా ఓంకారము, సమస్త విశ్వమునకు బీజంగా భావించబడుచున్నది. అది పరమాత్మ శబ్దం యొక్క సారాంశం. ఇది బీజరూపంలో ఉన్న వేదం కూడా. వేదమంతా ‘ఓం’ లోపలే ఉంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 82 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 22. The Whole of the Veda is Inside “Om” 🌻*

*You have heard this great passage of the Bible: “In the beginning was the Word, and the Word was with God, and the Word was God.” Something like this is what the Upanishad tells us here. The Eternal Wisdom was manifest, with the eternal Word, and with this Word the whole cosmos was created. The Word which is with God, and which is God, is not merely a letter, or a sound that we make through our lips. It is an energy; it is a force; it is a vibration which materialises itself, concretises itself into object-forms.*

*The Word is the Veda, or Eternal Wisdom which is with God, and it is inseparable from God, and so, it is God Himself. The Cosmic Mind projected itself in the form of this Eternal Word, and manifested this universe. In the Manusmriti, and such other ancient texts, we are also told in a symbolic manner that Prajapati, the Creator, conceived the whole cosmos in the pattern of ‘Om’, or the Pranava. The Pranava, or Omkara, is supposed to be the seed of the whole universe. That is the essence of the Word that is Divine. It is also the Veda contained in a seed form. The whole of the Veda is inside ‘Om’.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 347 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. కేవలం ఒక అడుగు కూడా మనిషిని దేవుణ్ణి చేస్తుంది. బుద్ధుణ్ణి చేస్తుంది. చేస్తుంది. అది గాఢమయిన ప్రయత్నం మీద ఆధారపడి వుంటుంది. నీ దృఢ సంకల్పం మీద, నీ సమగ్రత మీద, నువ్వు లీనం కావడం మీద ఆధారపడి వుంటుంది. 🍀*

*పరిణామమంటే అభివృద్ధి, దానికి కోట్ల సంవత్సరాలు పట్టింది. విప్లవమంటే కూడా అభివృద్ధే కారణం అది చైతన్యం, అది పెద్ద అంగ, దూకడం. అది క్రమంగా జరిగేది కాదు. అడుగులో అడుగు వేస్తూ జరిగేది కాదు. అదంతా నీ మీద ఆధారపడి వుంటుంది. నువ్వెంత సాహసివన్న దాని మీద ఆధారపడి వుంటుంది. కేవలం ఒక అడుగు కూడా మనిషిని దేవుణ్ణి చేస్తుంది. బుద్ధుణ్ణి చేస్తుంది. అది గాఢమయిన ప్రయత్నం మీద ఆధారపడి వుంటుంది.*

*నీ దృఢ సంకల్పం మీద, నీ సమగ్రత మీద, నువ్వు లీనం కావడం మీద ఆధారపడి వుంటుంది. మనిషి సహజంగా, ప్రకృతి సహజంగా ఎదిగే అవకాశం ఏ మాత్రం లేదు. స్పృహతో వుద్దేశపూర్వకంగా ఎదగాలని మనిషి అనుకుంటే తప్ప మనిషి మనిషిగానే మిగిలిపోతాడు. అది విప్లవానికి ఆరంభం పరిణామాన్ని దాటి నీ జీవితంలో విప్లవాన్ని ఆరంభించు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 084 / Siva Sutras - 084 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 4 🌻*
*🌴. మంత్రం యొక్క రహస్యం, జ్ఞానాన్ని తన చలన శక్తిగా కలిగి ఉన్న దాని శరీరమే. స్వచ్ఛమైన జ్ఞానంతో తన చిత్తాన్ని, మానసిక శరీరాన్ని ప్రకాశింపజేసే యోగి అదే శక్తిని పెంపొందించుకుని మంత్రశక్తిపై ఆధిపత్యం సాధిస్తాడు. 🌴*

*అనుభవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో విలీనం చేయడం ( సర్వవ్యాప్త స్వభావం కారణంగా విశ్వ చైతన్యం) ఆధ్యాత్మిక అత్యున్నస్థితిని పొందే రహస్యం. అత్యున్నత జ్ఞానం అనేది అత్యున్నత వాస్తవికత యొక్క సూక్ష్మ స్వభావాన్ని అర్థం చేసుకోవడాన్ని సూచిస్తుంది. పండితుడు యోగి ఒకటి కాదు. పండితుని జ్ఞానం స్థూలమైనది, కానీ యోగి యొక్క జ్ఞానం సూక్ష్మమైనది. ఇంద్రియాల ద్వారా స్థూలాన్ని గ్రహించవచ్చు. వ్యక్తిగత చైతన్యాన్ని పరమ చైతన్యంతో ఏకతాటిపై నిలబెట్టడం ద్వారా మాత్రమే సూక్ష్మాన్ని గ్రహించవచ్చు. అభ్యాసం ద్వారా ఖచ్చితమైన అమరిక ఏర్పడే వరకు, సరైన ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేము.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 084 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 4 🌻*
*🌴. The secret of the mantra is its body which has knowledge as its moving force. A yogi who illuminates his chitta and mental body with pure knowledge develops a similar power and gains lordship over the mantra shaktis. 🌴*

*Merging of empirical consciousness with cosmic consciousness (cosmic because of omnipresent nature) is the secret of attaining spiritual consecration. Supreme knowledge refers to the understanding the subtle nature of Ultimate Reality. A scholar is different from a yogi. A scholar’s knowledge is gross in nature, but a yogi’s knowledge is subtle in nature. Gross can be realised through senses and subtle can be realised only through aligning individual consciousness with Supreme consciousness. Till such time the perfect alignment sets in through practice, right kind of spiritual progression cannot be attained.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment