శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 454 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 454 -3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 454 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 454 -3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 454. 'మాలినీ'- 2 🌻
ఇంటి యందు యజమాని వున్నప్పుడే ఇంటివారు ఒక మాటపై నడతురు. సద్గురువు వున్నచోటనే అనుయాయులు అన్యోన్యముగ నుందురు. ఇట్టి సామరస్యము మాలినీ చైతన్యము కారణముగ యేర్పడును. కుటుంబములు విడిపోవుటకు, దాంపత్య జీవితములు చెడి పోవుటకు, రాష్ట్రములు ముక్కలు, చెక్కలుగ విభజింపబడుటకు, దేశము లందు ఒకరియం దొకరికి సామరస్యము లేకుండుటకు, కులభేదములకు, మత భేదములకు, జాతి భేదములకు కారణము శ్రీమాత మాలినీ తత్త్వము నామమాత్రముగ నుండుటయే. మాలిని యున్నచోట కూడిక, కూర్పు, సామరస్యము, ఆనందము, అనుభూతి, వైభవము యుండును. మాలినీ దర్శనమైన సత్పురుషులు కూర్పు చేయుదురు. సామరస్యము నందింతురు. ఆనందమును ప్రసరింతురు. అనుభూతి, వైభవము కలిగింతురు. అట్టి వారి వలనే జీవులు సుఖ పడుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 454 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 454. 'Malini'- 3 🌻
When the owner is in the house, the family will follow one. Where there is a Guru, the followers are brotherly. Malini Consciousness is the cause of this harmony. The reason for the separation of families, the deterioration of married life, the division of states into pieces, the lack of harmony in the country, caste differences, religious differences and ethnic differences is the reason of lack of Srimata Malini's philosophy. Where there is Malini, there is harmony, composedness , joy, expeeience, splendor. The men who manifested Malini Consciousness in them are constructive. They bring harmony. Radiate happiness. Bring joy, splendor. It is because of them that living beings are happy.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment