శ్రీ మదగ్ని మహాపురాణము - 219 / Agni Maha Purana - 219


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 219 / Agni Maha Purana - 219 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 64

🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 3 🌻


వరుణసూక్తము పఠించుచు పుష్ప-చామర-దర్పణ-ఛత్ర-పతాకలను సమర్పింపవలెను. మూలమంత్రము చదువుచు, 'ఉత్తిష్ఠ' అని పనికి లేవదీసి, ఆ రాత్రికి అధివాసనము చేయించవలెను. 'వరుణం వా' అను మంత్రముచే సంనిధీకరణము చేసి వరుణ సూక్తముచే పూజింపవలెను. మూలమంత్రముచే సజీవీకరణము చేసి చందనాదులతో పూజించవలెను. మండలమున వెనుక చెప్పిన విధమున అర్చన చేయవలెను. అగ్నికుండమున సమిధులతో హోమము చేయవలెను. వైదికమంత్రములతో గంగ మొదలగు నాలుగు గోవులను పిదుకవలెను. అన్నిదిక్కులందును యవలతో వండిన చరువు ఉంచి హోమము చేయవలెను. చరువును వ్యాహృతులచేతను, గాయత్రిచేతను లేదా మూలమంత్రముచేతను అభిమంత్రించిసూర్య-ప్రజాపతి-దివ్‌-అంతకనిగ్రహ-పృథ్వీ-దేహధృతి-స్వధృతి-రతి-రమతీ-ఉగ్ర-భీమ-రౌద్ర-విష్ణు-వరుణ-ధాతా-రాయస్పోష-మహేంద్ర-అగ్ని-యమ-నిరృతి-వరుణ-వాయు-కుబేర-ఈశ-అనంత-బ్రహ్మ-వరుణ నామములను చతుర్థ్యంతములు చేసి పలుకుచు అంతమున "స్వాహా" చేర్చి బలి ఇవ్వవలెను.. "ఇదం విష్ణుః" "తద్విప్రాసః" అను మంత్రములచే అహుతుల నీయవలెను. "సోమో ధేనువు" ఇత్యాది మంత్రములతో ఆరు ఆహుతు లిచ్చి "ఇమం మే వరుణ" అను మంత్రముతో ఒక ఆహుతి ఇవ్వవలెను. 'అపో హిష్ఠా' ఇత్యాది మంత్రత్రయముతోను 'ఇమా రుద్రా' ఇత్యాదిమంత్రముతోను కూడ ఆహుతుల నీయవలెను.

పిమ్మట పది దిక్కులందును బలు లిచ్చి గంధపుష్పాలతో పూజించవలెను. ప్రతిమను ఎత్తి మండపము మీద స్థాపించి గంధపుష్పాదుల చేతను, సువర్ణ పుష్పాదుల చేతను పూజించవలెను. పిమ్మట శ్రేష్ఠుడైన ఆచార్యుడు ఎనిమిది దిక్కులందును రెండేసి జానల చెరువులను, ఇసుకతో ఎనిమిది వేదికలను నిర్మింపవలెను. 'వరుణస్య' ఇత్యాది మంత్రము చదువుచు, ఘృతముతోను, యవలతో వండిన చరువుతోను వేరు వేరుగ నూటఎనిమిది హోమములు చేయవలెను. శాంతి జలము తీసికొని వచ్చి దానితో వరుణుని శిరస్సుపై అభిషేకము చేసి, సజీవీకరణము చేయవలెను. తన ధర్మపత్నియగు గౌరితో కూడిన వరుణుడు నదీనదములతో పరివేష్టితుడై యున్నట్లు ధ్యానము చేయవలెను. ఓం వరుణాయ నమః అను మంత్రముతో పూజించి సాంనిధ్యకరణము చేయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 219 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 64

🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 3 🌻


21. The invocation should be performed with the vyāhṛtis, gāyatrī and the principal mantra. Oblation should be done with the mantra sūryāya prajāpataye dyauḥ svāhā cāntarikṣakaḥ.

22. (Ceremony is to be performed) for the earth, Dehadhṛti, Svadhṛti, Rati, Ugra, Bhīma, Raudraka.

23-24. Viṣṇu, Varuṇa, Dhātṛ, Mahendra the furtherer of riches, Agni, Yama, Nairṛta, Varuṇa, Vāyu, Kubera, Īśa, Ananta, Brahman and the lord of waters should be propitiated. with oblations reciting svāhā and (the mantras) idaṃ viṣṇuḥ[28] and tad viprāsa[29].

25. Having made oblation six times with somo dhenu[30], oblation should be made with imaṃ me[31]. Again oblation should. be done thrice with āpo hi ṣṭhā[32] (and once) with imā rudrā[33].

26. Bali (offering) should be made in the ten directions. The image should be worshipped with perfumes and flowers. The image should be lifted and placed in a mystic diagram by a wise man.

27-28. (The image) should be worshipped with perfumes. and flowers as well as golden flowers duly. The excellent priest should lay eight raised platforms filled with sand after having made ready the water tanks measuring two feet. Then clarified. butter (should be given as oblation) hundred and eight times with (the mantra) varuṇasya[34].


Continues....

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment