నిర్మల ధ్యానాలు - ఓషో - 349


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అనుభవాలు మంచివైనా, చెడ్డవైనా బాధ కలిగించేవైనా, ఆనందం కలిగించేవైనా, వాటి గుండా మనిషి మెల్లమెల్లగా మేలుకుంటాడు. అట్లా జీవించిన జీవితం సంపన్న జీవితం. జీవన గాఢతని అందుకున్న వ్యక్తి కళ్ళు తెరవడానికి సమర్థుడవుతాడు. 🍀


ప్రతి మనిషీ గుడ్డివాడుగా పుట్టాడు. ప్రతి మనిషికీ అంధకారం నించీ బయటపడే శక్తి వుంది. మనిషి గుడ్డిగా పుడతాడు. ఎందుకంటే అచేతనంగా వుంటాడు. మెలకువతో వుండడు. కేవలం జీవితం గుండా, దాని అనుభవాలు మంచివైనా, చెడ్డవైనా బాధ కలిగించేవైనా, ఆనందం కలిగించేవైనా, వాటి గుండా మనిషి మెల్లమెల్లగా మేలుకుంటాడు. అట్లా జీవించిన జీవితం సంపన్న జీవితం. జీవన గాఢతని అందుకున్న వ్యక్తి కళ్ళు తెరవడానికి సమర్థుడవుతాడు. అప్పుడు ఒక సందర్భంలో వ్యక్తిలో విప్లవాత్మక పరివర్తన జరుగుతుంది. అప్పుడు జీవితం వెనకటిలా వుండదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment