శ్రీ మదగ్ని మహాపురాణము - 221 / Agni Maha Purana - 221
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 221 / Agni Maha Purana - 221 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 64
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 5 🌻
యజ్ఞప్రాంగణము "యూపబ్రహ్మ" ఇత్యాది మంత్రముతో యూపమును స్థాపించి, దానికి వస్త్రములు చుట్టబెట్టి, పై భాగమున పితాక ఏర్పరుపవలెను. దానిని గంధాదులతో పూజించి, జగత్తుకొరకై శాంతికర్మ చేయవలెను. ఆచార్యునకు భూమి, గోవు, సువర్ణము, జలపాత్రము మొదలగునవి దక్షిణగ ఇవ్వవలెను. ఇతర బ్రాహ్మణులకు గూడ దక్షిణ లిచ్చి, వచ్చిన వారికి ఖోజనము పెట్టవలెను. "బ్రహ్మ మొదలు తృణమువరకు, లేదా కీటకము వరకు దప్పికొన్న వారి కందరికిని ఈ తడాగములో నున్న జలముచే తృప్తి కలుగు గాక" అని పలుకుచు జలము విడిచిపెట్టి. జలాశయములో పంచగవ్యము లుంచవలెను. పిమ్మట 'ఆపో హి ష్ఠామ' ఇత్యాది ఋక్త్రయము పఠించుచు, బ్రాహ్మణులు సమకూర్ఛిన శాంతి జలమును, పవిత్రతీర్థ జలమును ఉంచి, బ్రాహ్మణులకు గోవృషభాదిదానము చేయవలెను. ఎట్టి అడ్డులు చెప్పకుండగ అందరికిని అన్నదానము చేయు ఏర్పాట్లు చేయవలెను. ఒక్క జలాశయమును నిర్మించువాని పుణ్యము లక్ష అశ్వమేధయాగములు చేసిన వాని పుణ్యము కంటె వేయి రెట్లు అధికము. అతడు స్వర్గము చేరి విమానమునందు ఆనందించుచుండును. ఎన్నడును నరకమునకు వెళ్ళడు జలాశయమునందు గోవులు మొదలుగు పశువులు జలము త్రాగును గాన దానిని నిర్మించినవాడు పాప వినిర్ముక్తు డగును. జలదానము చేసిన మానవుడు సకల దానములు చేసిన ఫలముపొంది స్వర్గమునకు వెళ్ళును.
అగ్నిమహాపురాణము నందు కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథన మను ఆరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 221 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 64
🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 5 🌻
39-40. Fees should be paid to twice-borns. Those who are-present should be fed. “From Brahman down to (inanimate objects like) the pillar all those who seek water may get satisfied with the waters of the tank!” (With the utterance of these words) the water should be given as charity. The five things got from a cow should then be thrown (into the water).
41. With the utterance of (the mantra) āpo hi ṣṭhā[37] thrice, the sanctified water got ready by the brahmins and the holy waters of the sacred spots should be sprinkled (into the tank) and herd of kine should be given to brahmins.
42-43. Food and other things should be given to all the people without any restraint. One who consecrates a reservoir of water (acquires) in a single day a merit ten crores times more than one who performs thousands of aśvamedha (the horsesacrifice). Such a person goes to heaven in the (celestial) vehicle and rejoices (there). He never goes to hell.
44. The consecrator can never get any sin as the cattle and other (animals) drink water from it. One attains all merits by the endowment of water (tank) and goes to heaven.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment