శ్రీమద్భగవద్గీత - 374: 10వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 374: Chap. 10, Ver. 02

 


🌹. శ్రీమద్భగవద్గీత - 374 / Bhagavad-Gita - 374 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 02 🌴

02. న మే విదు: సురగణా: ప్రభవం న మహర్షయ: |
అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశ: ||

🌷. తాత్పర్యం :

సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసి కొనజాలరు.


🌷. భాష్యము :

బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు. అతని కన్నను అధికుడు వేరొక్కడు లేడు. అతడే సర్వకారణకారణుడు. తానే దేవతలకు మరియు ఋషులకు కారణుడనని అతడే స్వయముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా దేవతలు మరియు మహర్షులు కూడా శ్రీకృష్ణుని సంపూర్ణముగా ఎరుగలేరు. వారే ఆ భగవానుని నామమును గాని, స్వరూపమును గాని ఎరుగలేరన్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల విషయము వేరుగా తెలుపపనిలేదు. భగవానుడు ఏ కారణము నిమిత్తము ధరత్రి యందు సామాన్యమానవునిగా అవతరించి అద్భుతములు మరియు అసాధారణములైన కార్యముల నొనర్చునో ఎవ్వరును ఎరుగాజాలరు.

అనగా పాండిత్యమనునది శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు ఒక యోగ్యత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు ఋషులు సైతము తమ మానసికకల్పనలచే శ్రీకృష్ణుని అవగతము చేసికొన యత్నించినను విఫలురైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణభగవానుని ఎరుగాజాలరని శ్రీమద్భాగవతమునందు స్పష్టముగా తెలుపబడినది. వారు తమ పరిమిత ఇంద్రియముల పరధి మేరకు ఊహాగానము చేయ యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్త్వమునకు విరుద్ధభావమైన నిరాకారతత్త్వమునే చేరగలరు. అనగా వారు మానసిక కల్పనలను కావించినను దాని ద్వారా శ్రీకృష్ణుని మాత్రము ఎరుగాజాలరు. పరతత్త్వమును తెలిసికొనగోరువారు కొరకై శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను దేవదేవుడననియు మరియు పరమపురుషుడనని పరోక్షముగా తెలియజేయుచున్నాడు. ఈ విషయమును ప్రతియొక్కరు గమనింపవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 374 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 02 🌴

02. na me viduḥ sura-gaṇāḥ prabhavaṁ na maharṣayaḥ
aham ādir hi devānāṁ maharṣīṇāṁ ca sarvaśaḥ


🌷 Translation :

Neither the hosts of demigods nor the great sages know My origin or opulences, for, in every respect, I am the source of the demigods and sages.

🌹 Purport :

As stated in the Brahma-saṁhitā, Lord Kṛṣṇa is the Supreme Lord. No one is greater than Him; He is the cause of all causes. Here it is also stated by the Lord personally that He is the cause of all the demigods and sages. Even the demigods and great sages cannot understand Kṛṣṇa; they can understand neither His name nor His personality, so what is the position of the so-called scholars of this tiny planet? No one can understand why this Supreme God comes to earth as an ordinary human being and executes such wonderful, uncommon activities. One should know, then, that scholarship is not the qualification necessary to understand Kṛṣṇa.

Even the demigods and the great sages have tried to understand Kṛṣṇa by their mental speculation, and they have failed to do so. In the Śrīmad-Bhāgavatam also it is clearly said that even the great demigods are not able to understand the Supreme Personality of Godhead. They can speculate to the limits of their imperfect senses and can reach the opposite conclusion of impersonalism, of something not manifested by the three qualities of material nature, or they can imagine something by mental speculation, but it is not possible to understand Kṛṣṇa by such foolish speculation. Here the Lord indirectly says that if anyone wants to know the Absolute Truth, “Here I am present as the Supreme Personality of Godhead. I am the Supreme.” One should know this.

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment